'కల్కి' మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. మొదటి దానితో పోలిస్తే అబ్బురపరిచే విజువల్స్ ఉన్నప్పటికీ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది. ఈ ట్రైలర్స్ బట్టి చాలామందికి కథ ఏంటనేది చూచాయిగా అర్థమవుతోంది. కాంప్లెక్స్, కాశీ, శంభలా అనే మూడు ప్రపంచాలు.. వాటిలో మనుషుల మధ్య సంఘర్షణే మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. అన్ని బాగానే ఉన్న ఓ పాయింట్ మాత్రం సస్పెన్స్‌లా ఉండిపోయింది. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)
'కల్కి' రెండు ట్రైలర్స్ చూస్తే సినిమాలోని చాలా పాత్రల్ని పరిచయం చేశారు. వీటితో పాటు ఇంకా చాలా పాత్రలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. సినిమా రిలీజైతే గానీ దీని గురించి క్లారిటీ రాదు. సరే ఇదంతా పక్కనబెడితే 'కల్కి' ఎవరనేది సస్పెన్స్ ఫ్యాక్టర్‌గానే ఉంది. కొందరు ప్రభాస్ అంటుంటే... మరికొందరు విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇంకొందరైతే దుల్కర్ సల్మాన్.. కల్కిగా కనిపిస్తాడని మాట్లాడుకుంటున్నారు.
'కల్కి' ట్రైలర్స్ చూసి ఎవరికి నచ్చినట్లు వాళ్లు స్టోరీని డీకోడ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ చాలామంది ఇక్కడ ఓ లాజిక్ మిస్సవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో హీరోగా ప్రభాస్ చేస్తున్నప్పుడు 'కల్కి' ఇంకెవరో అయితే ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేది క్వశ్చన్. ఒకవేళ దర్శకుడు నాగ్ అశ్విన్ అలా చేసినా సరే కన్విన్సింగ్‌గా స్టోరీని చెప్పడం అనేది పెద్ద టాస్క్. మరి ఈ ప్రశ్నలన్నింటికి ఎండ్ కార్డ్ పడాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.
(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment