లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! | Sonakshi Sinha sells luxurious sea-facing apartment Rs 22 Crore | Sakshi
Sakshi News home page

లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే!

Published Wed, Feb 5 2025 3:04 PM | Last Updated on Wed, Feb 5 2025 4:05 PM

Sonakshi Sinha sells luxurious sea-facing apartment Rs 22 Crore

హీరోయిన్ సోనాక్షి సిన్హా  మొత్తానికి తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. సంజయ్ లీలా భన్సాలీ  పీరియాడికల్ డ్రామా హీరామండి: ది డైమండ్ బజార్‌లో చివరిసారిగా కనిపించిన సోనాక్షి సిన్హా, సముద్రం వైపున ఉన్నతన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను రూ.22.50 కోట్లకు విక్రయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ (81 Aureate) 16వ అంతస్తులో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందీ అపార్ట్‌మెంట్‌. దీన్ని 2022, మార్చి దాదాపు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.  అంటే  తాజా  విక్రయం ద్వారా దాదాపు 61 శాతం లాభాన్ని ఆర్జించింది

ఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన 4-BHK అపార్ట్‌మెంట్‌ను reD ఆర్కిటెక్ట్స్‌కు చెందిన రాజీవ్ , ఏక్తా పరేఖ్ 1.5-BHKగా సొగసైన రీతిలో  తీర్చిదిద్దారు. ఎంతో స్పెషల్‌గా, అందంగా ఈ ఇంటిలో వాక్-ఇన్ వార్డ్‌రోబ్, ప్రత్యేక జిమ్‌,  అందమైన కళాకృతులు, అరేబియా సముద్రాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీ ఉన్నాయి. 

చదవండి: లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!

ముఖ్యంగా గత ఏడాది (2024, జూన్ 23న ) సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న ఇల్లు కూడా ఇదే.  ఇటీవల సోనాక్షి, జహీర్‌  పెళ్లి వేడుకలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఇంటిని  రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది.

కాగా బాలీవుడ్‌  నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తరువాత  బాగా బరువు తగ్గించుకుని, స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాక్షన్-డ్రామా దబాంగ్ (2010)మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఉత్తమ డెబ్యూనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారింది. ముఖ్యంగా దక్షిణాదిన రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో తమిళం సినిమాకి పరిచయం అయినది. సహనటుడు జహీర్ ఇక్బాల్‌తో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న సోనాక్షీ ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో మూడు హనీమూన్లు, ఆరు టూర్లు అన్నట్టుగా  వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement