హీరోయిన్‌ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే? | Zaheer Iqbal Gifts 2 Crore Worth Car To Wife Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: పెళ్లి బహుమతిగా ఖరీదైన కారు.. వీడియో వైరల్

Published Wed, Jun 26 2024 8:04 AM | Last Updated on Wed, Jun 26 2024 8:39 AM

Zaheer Iqbal Gifts 2 Crore Worth Car To Wife Sonakshi Sinha

హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న రైటర్ జహీర్ ఇక్బాల్‌తో ఒక్కటైంది. జూన్ 23న జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే మతాల వేరు కావడంతో ఈ వివాహం సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని రూమర్స్ వచ్చాయి. ఇందుకు తగ్గట్లే పెళ్లిలో సోనాక్షి అన్నదమ్ములు కనిపించలేదు.

(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)

ఇకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోనాక్షి-జహీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సోనాక్షితో వివాహం జరగడానికి ముందే జహీర్ ఖరీదైన బహుమతి ఇచ్చాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని ఖరీదు దాదాపు రూ.2 కోట్లకు పైనే అని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

పెళ్లి తర్వాత సెలబ్రేషన్స్ కోసం సోనాక్షి-జహీర్ కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి బీఎండబ్ల్యూ ఐ7 కారులో వచ్చారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు.. జహీర్, సోనాక్షికి బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. మార్కెట్‌లో దీని ధర రూ.2 నుంచి రూ.3 కోట్ల మధ్యలో ఉంది. ఏదేమైనా పెళ్లికి వేరే వాళ్లు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. కానీ భర్త నుంచి ఇంత కాస్ట్ లీ బహుమతి రావడం మాత్రం సోనాక్షికి మరపురాని బహుమతిగా మిగిలిపోతుంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement