
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్‌షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్‌గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్‌లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ లుక్‌తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్‌గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్.
ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్‌తో సహా చంకీ స్టేట్‌మెంట్ నెక్లెస్‌లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్‌లెట్‌ల స్టాక్‌ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్‌లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది.