ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్ | Sonakshi Sinha Reacted On Trolls After Deactivate Her Twitter Account | Sakshi
Sakshi News home page

ఇప్పుడు నేనే గెలిచాను: సోనాక్షి

Published Mon, Jun 22 2020 2:51 PM | Last Updated on Mon, Jun 22 2020 4:03 PM

Sonakshi Sinha Reacted On Trolls After Deactivate Her Twitter Account - Sakshi

ముంబై: తనపై విపరీతంగా ట్రోల్స్‌పై చేస్తున్న నెటిజన్లపై తానే గెలిచానని హీరోయిన్‌ సోనాక్షి సిన్హా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. గత వారం తన ట్విటర్‌ ఖాతాను డియాక్టివేట్‌ చేసినప్పటి నుంచి తనని మరింత ఎగతాలి చేస్తూ నెటిజన్లు ఫన్నీ మిమ్స్‌ క్రియోట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ  కేవలం ట్విటర్‌ నుంచి మాత్రమే తాను నిష్క్రమించానని.. ఇవి నిజమైన ట్రోల్స్‌ కాదంటూ నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్‌ చేస్తూ.. ‘కొంతమంది తాము ఏదో గెలిచినట్లు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సరే నేను దానికి సంతోషిస్తాను. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరికి లాభం లేదు, నష్టం కూడా లేదు. ఇక మీరు ప్రత్యేక్షంగా చేసే విమర్శలు, అవమానాలకు కేంద్రమైన నా ట్విటర్‌ అకౌంట్‌ తీసేశాను. నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను బాధ పెట్టాలనుకున్నారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేకుండా చేశాను. కాబట్టి ఇక్కడ గెలిచింది నేనే’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (ట్విటర్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేసిన హీరోయిన్‌!)

తాను తన ట్విటర్‌ నుంచి వైదొలుగుతున్నట్లు గత వారం సొనాక్షి ప్రకటి‍ంచారు. ‘‘తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి తెలివైన వారు మొదటగా వేసే అడుగు నెగిటివిటికీ దూరంగా ఉండటం. కాబట్టి నేను ట్విటర్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకని నా ఖాతాను తొలగిస్తున్నాను. గుడ్‌ బై గాయ్స్‌. ఇక ప్రశాంతంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’)

How i got myself off twitter and away from the negativity 😂 Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha. But lets face it, ive cut the direct source of insult and abuse in my life. Ive taken away YOUR power to be able to say whatever it is that you want to me, my family and my friends. Ive taken away that access you had to me, that i had given you so trustingly. So theres only one winner here. Me. Your negativity has never served me or my life, which is why it literally took a snap of a finger to get rid of a following of 16 million people which ive garnered over the last ten years. Just like that. And im better off for it. I wish all those haters and trolls lots of love and healing, or you can continue with the hate but please know it’ll NEVER reach me. Accha ab yeh chakkar mein i know the people who love me are caught up too... please know that your love and support is what has kept me going all this while, and it always will! And I request you all to keep spreading that love and light wherever you go and to as many people as you can. Because Love is the answer. Always ❤️

A post shared by Sonakshi Sinha (@aslisona) on

కాగా సుశాంత్‌ ఆత్మహత్యపై స్పందిస్తూ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ పరిశ్రమలోనిప్రముఖులు, స్టార్‌కిడ్స్‌పై మండిపడుతూ ట్విటర్‌లో వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనాక్షి స్పందిస్తూ..కొంత మంది సోదరభావంతో ఇతరుల మరణాలను కూడా ఫేమ్‌ కోసం వాడుకుంటున్నారు అంటూ  కంగనాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. అంతేగాక ఆభ్యంతరక వ్యాఖ్యలతో విమర్శలు చేయడంతో నెటిజన్లు సోనాక్షిపై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు. ఇక అవి తారాస్థాయికి చేరడంతో తన ట్విటర్‌ ఖాతాను సోనాక్షి గత శనివారం తోలగించారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement