స్టార్ హీరోయిన్ పెళ్లి హడావుడి.. బ్యాచిలర్ పార్టీ ఫొటోలు వైరల్ Sonakshi Sinha Bachelor Party And Wedding Details Latest. Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: కొన్నిరోజుల్లో పెళ్లి.. బ్యాచిలర్ పార్టీలో ఫుల్ బిజీ

Published Tue, Jun 18 2024 10:58 AM | Last Updated on Tue, Jun 18 2024 11:53 AM

Sonakshi Sinha Bachelor Party And Wedding Details Latest

స్టార్ హీరో సోనాక్షి సిన‍్హా పెళ్లికి రెడీ అయిపోయింది. జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఈ వివాహం జరగనుందని, తల్లిదండ్రులకు సోనాక్షి నిన్న మొన్నటి వరకు చెప్పలేదట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి హడావుడి ఓ పక్క జరుగుతుండగా, మరోవైపు బ్యాచిలర్ పార్టీలు గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి:ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)

బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ 'లింగా' మూవీలో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు పెద్దగా కలిసి రావట్లేదు. ఈ క్రమంలోనే జహీర్ ఇక్బాల్ అనే నటుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇది జరిగిన కొన్నిరోజులకే పెళ్లి గురించి న్యూస్ బయటకొచ్చింది.

పెళ్లి కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి పెళ్లి నిజమేనని క్లారిటీ వచ్చేసింది. జూన్ 23న వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది. ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. శుభకార్యానికి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీల‍్లో కాబోయే వధూవరులు బిజీగా ఉన్నారు.

(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement