
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయిలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లికి ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నా ఏకైక కుమార్తె సోనాక్షినే అని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరని.. వారి నిర్ణయాన్ని మాత్రమే తెలియజేస్తారని ఆయన అన్నారు.
పెళ్లికి ముందు విభేదాలు
సోనాక్షి తన ప్రియుడు ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనుందని తెలియగానే మా కుటుంబంలో విభేదాలు వచ్చాయని శతృఘ్న సిన్హా తెలిపారు. పెళ్లి అనేది అందరి ఇళ్లలో జరుగుతుందని.. వివాహనికి ముందు గొడవలు కూడా మామూలే అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని వెల్లడించారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్‌కు తమ కుటుంబం హాజరవుతుందని శతృఘ్న తెలిపారు. కాగా.. పెళ్లికి ముందు సోనాక్షి, జహీర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment