ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్! | Sanjay Leela Bhansali's 'Heeramandi' Web Series Release Date Fixed | Sakshi
Sakshi News home page

Heeramandi: వాస్తవ సంఘటనల ఆధారంగా 'హీరామండి'.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్!

Published Fri, Mar 29 2024 9:25 AM | Last Updated on Fri, Mar 29 2024 10:48 AM

Sanjay Leela Bhansali Heeramandi web Series Release date Fix - Sakshi

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్‌ బజార్‌. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్‌ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. 

కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్‌ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్‌ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement