sanjay Leela Bansali
-
సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి
-
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్‌లో రెడ్‌లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్‌తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్‌లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్‌లలో రాయల్ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా?
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోనే చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం చై కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చైకి ఫస్ట్ మూవీ కావడంతో లాల్ సింగ్ చద్దాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చైకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. లాల్ సింగ్ చద్దా మూవీని ప్రమోట్ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ మార్కెట్‌పై చై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత కరణ్ జోహార్‌ని అతడు కలిసినట్లు సమాచారం. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళినే: వర్మ చైతన్య నిన్న(బుధవారం) ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీసుకి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్ అనంతర నేరుగా చై సంజయ్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమయ్యాడట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయా? అని అంత చర్చించుకుంటున్నారు. ఇక ఏదేమైన చైతన్య, సంజయ్ భన్సాలీని కలవడం టాలీవుడ్లో ఆసక్తిని సంతరించుకుంది. ఇది అక్కినేని ఫ్యాన్స్ చైతో దేవదాసు మూవీ చేయండి అంటూ కోరుతున్నారు. అయితే చై, సంజయ్ లీలా భన్సాలి కలవడం వెనక అసలు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. కాగా లాల్ సింగ్ చద్దాలో చై బాలరాజు అనే ఆర్మి యువకుడిగా కనిపించనున్నాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై -
సంజయ్ లీలా భన్సాలీని కలిసిన అల్లు అర్జున్, వీడియో వైరల్
Allu Arjun Meets Sanjay Leela Bhansali: పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప: ది రైజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ పుష్ప రాజ్ అనే స్మగ్లర్‌గా కనిపించాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ పుష్ప: ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో పుష్ప పార్ట్ 2ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కూడా బన్నీ పాన్ ఇండియా చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కలిశాడు అల్లు అర్జున్. సోమవారం అల్లు అర్జున్ ముంబైలోని సంజయ్‌లీలా భన్సాలీని కలిశాడు. కార్యాలయానికి వెళ్లాడు. సంజయ్ లీలా భన్సాలిని కలిసేందుకు బన్నీ ఆయన కార్యాలయానికి వెళ్లి బన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ని ఐకాన్ స్టార్ ప్రత్యేకంగా కలవడంతో ఇటూ టాలీవుడ్, అటూ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక ఇంకేదైనా కారణాలతో కలిశారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. చదవండి: Radhe Shyam Director: వారిపై ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఏదేమైన బన్నీ, సంజయ్ లీలా భన్సాలీతో సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ఓ ప్రత్యేక శైలి ఉంది. అలాంటి దర్శకుడి ఐకాన్ స్టార్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందోనని ఇప్పుడు ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. రీసెంట్గా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' రిలిజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. Icon StAAr @alluarjun met with Bollywood top director #SanjayLeelaBhansali @ Mumbai today.#AlluArjun @bhansali_produc pic.twitter.com/ElELV7ddpo — VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) March 14, 2022 -
‘గంగూబాయ్ కతియావాడి’ మూవీ టీంపై గంగూబాయ్ ఫ్యామిలీ ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్ల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలై ప్రజాదరణ పొందింది. ముంబయిలోని మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వేశ్యగా జీవితం మొదలు పెట్టాల్సి వచ్చినా.. వాటన్నింటిని ఎదుర్కొని మాఫియా డాన్‌గా ఎదిగిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన మోహన్ బాబు, ఆ హీరోలే ఇలా చేయిస్తున్నారంటూ సీరియస్ అయితే ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ షా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన తల్లిని ఇందులో వేశ్యగా చూపించి అవమానపరిచారంటూ గతేడాది ఈ చిత్రంపై డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా మూవీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత దీంతో గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు రావుజి షా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో బాబూ రావుజీ షా మాట్లాడుతూ.. ‘మీ సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు అనేకమంది మీ అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. మా కుటుంబ మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం’ అని వాపోయాడు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఇక గంగూబాయి మనవరాలు మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం మా కుటుంబం పరువు తీశారు. ఈ మూవీ తీసేటప్పుడు కూడా మా కుటుంబం అనుమతి అడగలేదు. వారు పుస్తకం రాసేటప్పుడు కూడా మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి కావాల్సిందే. మా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను చాలా అభ్యంతరకరంగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె బాధపడింది. -
సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ కోసం సోనాక్షి డేరింగ్ స్టేప్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా డేరింగ్ స్టేప్ తీసుకుంది. ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘దబాంగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలల్లో నటించి మెప్పించిన సోనాక్షికి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వేశ్య పాత్రలో నంటించేందుకు రేడి అయ్యింది. దీంతో ఈ సమయంలో సోనాక్షి ఇలాంటి డేరింగ్ స్టేప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ స్థాయిలో ‘హీరా మండి’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రెడ్‌లైట్ ఎరియా నేపథ్యంలో సెక్స్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సీరిస్ సాగనుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించేందుకు సోనాక్షి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పాత్రకు సంజయ్ లీలా భన్సాలీ సోనాక్షిని ఖరారు చేశారట. ఈ వెబ్ సిరీస్ కథ వివరించగానే సోనాక్షి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి మరు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌లో వేశ్య పాత్ర కోసం సీనియర్ నటి మాధురి దీక్షిత్, హ్యూమా ఖురేషిల పేర్లు తెరపై రాగా చివరకు హ్యూమా ఖురేషిని దర్శకుడు ఓకే చేశాడు. తాజాగా మరో ప్రధాన వేశ్య పాత్రకు సోనాక్షిని కూడా ఎంపిక చేశారు. ఇందులో సోనాక్షి కథక్ డ్యాన్సర్‌గా కనిపించనుండటంతో ఆమె కథక్ నేర్చుకునే పనిలో కూడా పడిందట. కాగా ఇది వరకు సోనాక్షి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చి ‘రౌడీ రాథోడో’ మూవీలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్ ‘గంగూభాయ్ కథియావాడి’ మూవీని తెరెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తెయిన అనంతరం ‘హీరా మండి’ని తెరకెక్కించే ప్లాన్ ఉన్నాడు. దీనికోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ప్టిక్స్తో చర్చలు కూడా జరపుతున్నాడట. -
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్‌కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్‌లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా కలిచి వేసింది. నెపోటిజం, ప్రొఫెషనల్ శత్రుత్వం వల్లే సుశాంత్ మరణించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రొడక్షన్ హౌస్‌లతో సుశాంత్ ఒప్పందాలు.. ఆగిపోయిన సినిమాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో సుశాంత్ నటించాల్సిందిగా సమాచారం. గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాలలో సుశాంత్ ప్రధాన పాత్రలు పోషించాల్సి ఉండగా.. పద్మావత్ చిత్రంలో షాహిద్ కపూర్ పోషించిన రాజ్‌పుత్ రాజు పాత్రలో నటించాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ చివరకు అతడి స్థానంలో మరొకరిని తీసుకున్నారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) ఈ క్రమంలో పోలీసులు దీని గురించి భన్సాలీని ప్రశ్నించారు. డేట్స్ కుదరకపోవడంతోనే సుశాంత్‌ను ఈ సినిమాల నుంచి తప్పించినట్లు భన్సాలీ వెల్లడించాడు. దాదాపు మూడు గంటల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసులు కుంటుంబ సభ్యులు, స్నేహితులు, సహా నటులతో కలిపి దాదాపు 34 మందిని విచారించారు. వారందరి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.(నన్ను చాలా టార్చర్ చేశారు) -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
సల్మాన్ బిజినెస్‌మేన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఫ్లోరిడా వెళ్లనున్నారు. పర్సనల్ వర్క్‌పై కాదు. ప్రొఫెషనల్ వర్క్ మీదే. తన నెక్ట్స్ చిత్రం కోసమే ఈ యూఎస్ పయనం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా ‘ఇన్షా అల్లా’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో ఫ్లోరిడాకు చెందిన నలభై ఏళ్ల బిజినెస్‌మెన్‌గా సల్మాన్ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. ఆగస్టు చివరి వారంలో ఆరంంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఫ్లోరిడాలో లొకేషన్ హంట్ స్టార్ట్ చేశారు దర్శకుడు భన్సాలీ. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. ప్రస్తుతం ‘దబాంగ్ 3’ సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్‌ఖాన్. -
ట్రిపుల్ ధమాకా!
ప్రముఖ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ తన మేనకోడలు షర్మిన్ సెగల్‌ను (భన్సాలీ సోదరి బేలా భన్సాలీ సెగల్ కుమార్తె) హీరోయిన్గా పరిచయం చేయనున్నారని తెలిసింది. షర్మిన్‌తో ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారట భన్సాలీ. ఈ చిత్రాల్లో ఒకటి 2004లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ (తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’)కి రీమేక్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి ‘మలాల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ చిత్రం ద్వారా నటుడు జావేద్ జాఫ్రీ కుమారుడు మిజాన్ జాఫ్రీ హీరోగా పరిచయం అవ్వబోతున్నారట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
‘పద్మావత్’ రివ్యూ
పద్మావత్ సినిమా ఒక మహిళ వీరత్వానికి, చతురత్వానికి, ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే... ‘ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని నొక్కి వక్కాణించిన భన్సాలీ... చివరికి పోరాడలేక నిస్సహాయురాలై నిశ్చేష్టురాలై సంక్షోభాన్ని గట్టెక్కలేక తనతో పాటు వందల మంది మహిళల్ని (గర్భిణులు, పిల్లలకు కూడా ఉన్నారు) పద్మావతి బూడిద చేస్తుందని చూపించాడు! సినిమా చూడ్డానికి బాగుంది. నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా బాగుండాల్సింది. రూపమా? గుణమా? ఏది ముఖ్యమన్న ప్రశ్న ఎదురైనప్పుడు, గుణం అంటుంది రాణి పద్మావతి. ఆ గుణాన్ని నిరూపించుకోవడం కోసం తన రూపాన్ని కూడా ఆహుతి చేస్తుంది. ఇదీ ఒక్క మాటలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమా. అది ఎలాంటి గుణం? శత్రువు దగ్గర తలవంచని గుణం. శత్రువు తన గౌరవాన్ని మట్టుబెట్టడానికి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడే గుణం. రాజపుత్రిక ఖడ్గంలో ఎంత శక్తివుందో రాజపుత్రిక గాజుల్లో కూడా అంతే శక్తి వుందని నమ్మే గుణం. ఒక స్త్రీ గౌరవం స్త్రీ శీలంతో బలంగా ముడిపడిన 13వ శతాబ్దపు నాటి కథ ఇది. చారిత్రక కల్పన. భార్య కోసం ముత్యాలు కొనడానికి సింహాళ్ వెళ్లిన మహారావల్ రతన్ సింగ్ ‘ప్రమోదవశాత్తూ’ పద్మావతి వేటాడుతుండగా ఆమె బాణపు వేటుకు గాయపడుతాడు. పద్మావతి! ఎలాంటి అపురూప సౌందర్యవతి? ‘ఆమె నీడ కూడా మోహం కలిగించేంత అందం’! అంతటి దివ్యవిగ్రహం కాబట్టే, ఆమెను వివాహం చేసుకుని చిత్తోఢ్కు తెచ్చిన తర్వాత, రతన్‌సింగ్ రాజగురువు కూడా తన వ్యక్తిత్వాన్నీ, తనకు రాజ్యం తరఫున అందుతున్న గౌరవాన్ని కూడా పక్కనపెట్టి పద్మావతిని దొంగచాటుగా చూడటానికి ప్రయత్నిస్తాడు. దాంతో రతన్‌సింగ్ ఆయనకు దేశబహిష్కార శిక్ష విధిస్తాడు. అల్లాహ్ సృష్టించిన ప్రతి అందమైన దానిమీదా అల్లావుద్దీన్ ఖిల్జీకి హక్కు ఉంటుంది అనుకునేంత వాంఛాపరుడు ఖిల్జీ. పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం ఉన్నవాడు. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసినవాడు. కిరీటం ఎంత చెడ్డది, అది తలల్నే మార్చేస్తుంది అని చమత్కరిస్తాడు కూడా. ఇంకా బైసెక్సువల్ కూడా. మాలిక్ కాఫుర్ ‘ఆయనకు పెళ్లాంలాంటివాడు’ అనిపిస్తాడు దర్శకుడు ఒక పాత్రతో. అలాంటి ఖిల్జీకి తన పన్నాగంతో పద్మావతిని పొందని జన్మ జన్మే కాదనీ, ఆమె వుంటే స్వర్గం నేలమీదే వున్నట్టనీ ఊరిస్తాడు రాజగురువు. అలా విపరీతమైన లాలసను పెంచుకున్న ఖిల్జీ చిత్తోఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. రతన్‌సింగ్‌ను సంధి పేరుతో కుయుక్తిగా బంధించి ఢిల్లీకి పట్టుకెళ్లడమూ, అంతే యుక్తిగా పద్మావతి మళ్లీ రతన్‌సింగ్‌ను విడిపించుకు రావడమూ, దీనికి ఖిల్జీ భార్య మల్లికయే సాయం చేయడమూ, దాన్ని అవమానంగా భావించిన ఖిల్జీ భార్యను బంధించి తిరిగి చిత్తోఢ్కు భారీ ఫిరంగులతో వెళ్లడమూ (ఆ ఫిరంగి సామర్థ్యం చిత్తోఢ్కు లేదు), రతన్‌సింగ్ యుద్ధంలో మరణించడమూ(ఇక్కడా కుయుక్తిగానే), భర్త మరణించాడని తెలిసిన పద్మావతి సహా ఏడువందలమంది రాజపుత్రికలు సతీసహగమానానికి పాల్పడటమూ గగుర్పొడిచే ఘట్టం! ఖిల్జీ కనీసం పద్మావతి కొనగోటిని కాదుగదా, కనీసం కొనచూపుతో కూడా చూడకుండానే ఆమె బూడిదైపోతుంది. రాజపుత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి పూర్తి కంకణం కట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది. దీన్ని బట్టి రాజపుత్ర కర్ణిసేన చేసిన నిరసన ప్రదర్శనలు ఎంత అర్థరహితమో అనిపిస్తుంది. ఏ వ్యక్తుల, కులాల, మతాల, జాతుల విశ్వాసాలను కించపరచడానికి ఈ సినిమా తీయలేదు అని ముందుగానే జాగ్రత్తగా ప్రకటించిన ఈ సినిమాలో నిజానికి గాయపడటానికి అవకాశం ఉన్న పాత్ర ఖిల్జీది మాత్రమే. ఒక దృశ్యంలో తన పేరులేని చరిత్ర పుటల్ని ఖిల్జీ చించేస్తాడు. ఖిల్జీ కోణంలోంచి చూస్తే గనుక ఈ సినిమా కూడా చిరిగిన పుటే. ఖిల్జీ పాత్రకు ఎక్కడా కూడా ఒక సానుకూల కోణాన్ని ఇవ్వలేదు. కొన్నిసార్లు కవిత్వాన్ని ఆస్వాదించినట్టూ, తానే స్వయంగా కవితలు అల్లినట్టూ చూపినప్పటికీ ఆ కవిత చెప్పగలగడానికి కారణమైన సున్నితత్వాన్ని ఏ దృశ్యంలోనూ చూపలేదు. అతడు మొదటినుంచీ లాలసుడే. రతన్‌సింగ్ మొదటి భార్య వ్యక్తిత్వంగానీ, రతన్‌సింగ్– పద్మావతి మధ్య అద్భుతమైన ప్రేమ పండినట్టుగానీ ఆవిష్కరణ జరగదు. దాంతో ఏ పాత్ర ఉద్వేగంతోనూ నడవడానికి ఆధారం దొరకదు. కానీ భన్సాలీ అన్ని సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ రిచ్. ఇది బాగా తీయబడిన సినిమాయేకానీ బాగా రాయబడిన సినిమా కాదు అనిపిస్తుంది. చివరి అరగంట సతీసహగమన ఘట్టంలో మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ భారంతోనే సినిమాకు తెర పడుతుంది కాబట్టి సినిమా బాగుంది అనేలా చేస్తుంది. టాప్‌క్లాస్ విజువల్స్ రాజ్‌పుత్ రతన్‌సింగ్‌కు తాను పంపిన వర్తమానానికి సమాధానం కోసం ఎదురుచూస్తుంటాడు అల్లావుద్దిన్ ఖిల్జీ. ఆ వర్తమానంలో ఏం పంపాడో చూసిన పద్మావతి దాన్ని కాల్చేస్తుంది. అల్లావుద్దీన్ ఎదురుచూస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్స్ ఒక చిన్న ఉదాహరణ మేకింగ్ పరంగా ‘పద్మావత్’ టాప్‌క్లాస్ అని చెప్పడానికి. యుద్ధం మొదలైందని తెలిశాక, పద్మావతి పరిగెత్తుకుంటూ కోట గుమ్మం వరకూ వెళ్లే సన్నివేశంతో పాటు చాలా చోట్ల కొన్ని అన్‌కట్ లాంగ్ టేక్స్ చూడొచ్చు. ఇలాంటివి సంజయ్ లీలా భన్సాలీ లాంటి మాస్టర్స్‌కే సాధ్యమనిపించే షాట్స్. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీలో అన్నీ మెరుపులే! కాస్ట్యూమ్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్ వేరే లెవెల్ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. అదేదో మెయిన్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతీ క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్ టాప్‌క్లాస్ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్ కలర్స్ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. క్లైమాక్స్ ఎలివేట్ అయ్యేదంతా స్కోర్‌తోనే! పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, అదితిరావు హైదరి లాంటి స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను చూస్తేనే ఏదో మ్యాజిక్ చెయ్యగలరన్న నమ్మకం కలిగించే స్టార్స్ అంతా. ఆ నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చెయ్యలేదు. ప్రతీ ఒక్కరిదీ టాప్‌క్లాస్ పర్ఫార్మెన్స్. రణ్వీర్ సింగ్ వరుసగా తాను నెక్స్›్ట జనరేషన్ సూపర్‌స్టార్ అనిపించుకునేలానే నటించేశాడు. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి ‘‘ఈ చిత్రం సతీసహగమనాన్ని ఏవిధంగానూ సమర్థించడం లేదు.’’ అనే కార్డ్‌తో మొదలవుతుందీ సినిమా. అది సమర్థించాల్సిన విషయం కాదన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే! మరి సినిమా ఏం చెప్తోంది? సమర్థ్ధించాల్సిన విషయం కాదన్న రోజు ఈకథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా? ఈ ప్రశ్నలు రాకుంటే సినిమా ఎలాగూ మెప్పించడానికి చాలా సెల్లింగ్ పాయింట్స్‌నే పెట్టుకుంది. వస్తేనే.. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి వెళ్లిన, ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదన్న సినిమాగా కనిపిస్తుంది. మరోరకంగా ఆలోచిస్తే హిస్టారికల్ ఫిక్షన్లో ఇదిలా ఉండాలని కోరలేని అవసరంగా కూడా కనిపించొచ్చు! -
నో మోర్ డౌట్స్
నో డౌట్స్. ‘పద్మావత్’ సినిమా గురించి ఇక నో మోర్ డౌట్స్. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్‌కపూర్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘పద్మావత్’. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. ‘‘ఈ నెల 25న 3డీ, ఐ–మ్యాక్స్ 3డీ వెర్షన్లతో పాటుగా తమిళ, తెలుగు భాషల్లో ‘పద్మావత్’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదే రోజున అక్షయ్‌కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. -
ఫ్లేమ్ గేమ్
సల్మాన్‌ఖాన్! మనోడికి ఫ్లేమ్లు ఉండవు. అన్నీ ఎక్స్ ఫ్లేమ్లే. ఫ్లేమ్ అంటే ఏంటీ అనుకుంటు న్నారా? అగ్గి రాజేసే ప్రియురాలు. ‘ఏక్ థా టైగర్’ అనే సీక్వెల్ సినిమాలో ఎక్స్ ఫ్లేమ్ కత్రినా కైఫ్‌తో పంజా విసరబోతున్నాడు. ఈ మధ్యే హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రఖ్యాత జర్నలిస్ట్ శేఖర్ గుప్తాతో ముచ్చట్లేస్తూ, ‘‘సంజయ్ లీలా భన్సాలీ నాకు చెయ్యి చూపించాడు’’ అన్నాడు. అదెలా అనడిగితే, ‘‘సంజయ్‌కి నేను మూడు సూపర్ హిట్లు ఇచ్చా. ఖామోషీ, హమ్ దిల్‌దే చుకే సనమ్, సావరియా. కానీ, ‘దేవదాస్’ సినిమాలో మాత్రం నన్ను కాదని షారుక్ ఖాన్‌కి పాత్ర ఇచ్చాడు. మరి అది చెయ్యి చూపించడం కాదా?’’ అన్నాడు. శేఖర్ గుప్తాకు విషయం అప్పటికప్పుడు అర్థం కాకపోయినా, తర్వాత జ్ఞానం ఉదయించింది. ‘ఓహో! దేవదాసులో హీరోయిన్ మనోడి ఎక్స్ ఫ్లేమ్ ఐశ్వర్యారాయ్ కదా’ అని! ఇదండీ.. సల్లూ భాయ్ ఎక్స్ ఫ్లేమ్ల పరంపర. భన్సాలీ చెయ్యి చూపించాడనే విషయం నవ్వుతూ చెప్పినా బిడ్డ ఎక్కడో లోతుగా కుమిలిపోతున్నాడని అనిపించింది. ఫ్లేమ్ గేమ్ కాస్తా.. బ్లేమ్ గేమ్ అయిందన్నమాట. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - సంజయ్‌లీలా భన్సాలీ
-
’పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది
-
మరోసారి గాయపడ్డ హీరో : షూటింగ్ కు బ్రేక్
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి సినిమాను ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే హీరో షాహిద్ కపూర్ గాయపడటంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతుండగా కొంతమంది సినిమా కథ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూనిట్ సభ్యులపై దాడికి దిగటంతో ఆ లోకెషన్ లో షూటింగ్ అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. తాజాగా మరోసారి పద్మావతి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షాహిద్ కపూర్ మరోసారి గాయపడ్డాడు. కాలిగాయం తీవ్రంగా ఉండటంతో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్లు సూచించారట. దీంతో షూటింగ్ బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. భారీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాధాలు తప్పటంలేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పద్మావతిగా హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. షాహిద్ కపూర్ తో పాటు మరో హీరో రణవీర్ సింగ్ మరో కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు బన్నాలీ. -
పన్నెండు కోట్లయితేనే!
దీపికా పదుకొనెను హీరోయిన్గా తీసుకునేందుకు నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే పారితోషికం 12 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా! అని కండీషన్ పెడుతున్నారట. దీపిక ఇంత డిమాండ్ చేయడానికి కారణం సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో చేస్తోన్న ‘పద్మావతి’ అని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా 200కిపైగా డేట్స్ ఇచ్చారట. అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. అయితే, కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్ అవ్వడంలేదని సమాచారం. దాంతో బ్యూటీ మునగచెట్టు దిగక తప్పదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
బన్సాలీ డైరెక్షన్లో 'మనం' రీమేక్
అక్కినేని ఫ్యామీలి మూడుతరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా భారీ హైప్ క్రియేట్ చేసిన మనం, కథా కథనాల విషయంలో కూడా కొత్తదనంతో ఆకట్టుకుంది. నాగార్జున కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రీమేక్‌పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మనం బాలీవుడ్ రీమేక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, మనం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ డైరెక్షన్లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న 24 సినిమా షూటింగ్ సమయంలో మనం రీమేక్‌పై చర్చ జరిగిందని వెల్లడించాడు విక్రమ్. 'ముంబైలో 24 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ లీలా బన్సాలీని కలిశాను. ఆయన మనం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు', అని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు విక్రమ్. విక్రమ్ కె కుమార్ స్వయంగా మనం సినిమాను కోలీవుడ్ రీమేక్ చేయడానికి ట్రై చేశాడు. సూర్య, కార్తీ సూర్య తండ్రి శివకుమార్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించాడు. అయితే సూర్యకు మనం కన్నా 24 కథ బాగా నచ్చటంతో ముందుగా 24 సెట్స్ మీదకు వచ్చింది. మరి త్వరలో కోలీవుడ్‌లో కూడా మనం రీమేక్ అవుతుందేమో చూడాలి. -
'బాజీరావ్ మస్తానీ'కి పన్ను మినహాయింపు
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన పీరియాడిక్ విజువల్ వండర్ 'బాజీరావ్ మస్తానీ'. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ప్రేమకథ బాలీవుడ్లో కాసుల పంట పండిస్తోంది. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 18న రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా 'బాజీరావ్ మస్తానీ' సినిమాను చూశారు. 16 శతాబ్దానికి చెందిన విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిభకు ముగ్దుడైన అఖిలేష్, ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో వినోద పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటిన బాజీరావ్ మస్తానీ 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. -
హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ సినిమా బాజీరావ్ మస్థానీ హీరో, దర్శకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ చిన్న వివాదంతో హీరో, దర్శకుడిపై కేసు నమోదు చేశారు. పూణెకు చెందిన ఓ న్యాయవాది... అక్టోబర్ 16 వీరిపై కేసు వేశాడు. అనుమతి లేకుండా చేస్తున్న షూటింగ్‌ను అడ్డుకున్న తనపై బౌన్సర్స్‌తో దాడి చేయించారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాజీరావ్ మస్థానీ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. -
హీరోయిన్ను మేకప్ వేసుకోవద్దన్న డైరెక్టర్
హిందీ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోయిన్ దీపిక పదుకొనే. నటనతో పాటు గ్లామర్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీని, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. దీపిక ప్రస్తుతం బన్సాలీ దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రంలో నటిస్తుంది. 'బాజీరావ్ మస్తానీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావటంతో అప్పటి పరిస్థితులను సహజంగా చూపించటం కోసం నటీనటులకు మేకప్ వద్దంటున్నాడట దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. నటుల వరకు ఈ నిబంధన ఓకే కానీ నటీమణులు విషయంలో కూడా ఇదే కండిషన్ పెట్టడంతో దీపిక లాంటి గ్లామర్ స్టార్స్ ఇబ్బంది పడిపోతున్నారు. అందాల రాణులుగా తమను చూస్తున్న ఆడియన్స్ మేకప్ లేకుండా చూస్తే అంగీకరించరేమో అని భయపడుతుంది దీపిక. బాజీరావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'బాజీరావ్ మస్తానీ' సినిమాను డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.