‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’ | Police Records Sanjay Leela Bhansali Statement About Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

సంజయ్‌లీలా భన్సాలీ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌..

Published Tue, Jul 7 2020 4:18 PM | Last Updated on Tue, Jul 7 2020 4:46 PM

Police Records Sanjay Leela Bhansali Statement About Sushant Singh Rajput - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా కలిచి వేసింది. నెపోటిజం, ప్రొఫెషనల్‌ శత్రుత్వం వల్లే సుశాంత్‌ మరణించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రొడక్షన్‌ హౌస్‌లతో సుశాంత్‌ ఒప్పందాలు.. ఆగిపోయిన సినిమాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్‌ చిత్రాల్లో సుశాంత్‌ నటించాల్సిందిగా సమాచారం. గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాలలో సుశాంత్ ప్రధాన పాత్రలు పోషించాల్సి ఉండగా.. పద్మావత్‌ చిత్రంలో షాహిద్ కపూర్ పోషించిన రాజ్‌పుత్‌ రాజు పాత్రలో నటించాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ చివరకు అతడి స్థానంలో మరొకరిని తీసుకున్నారు. (‘సుశాంత్‌ను‌ అందుకే తొలగించారా!’)

ఈ క్రమంలో పోలీసులు దీని గురించి భన్సాలీని ప్రశ్నించారు. డేట్స్‌ కుదరకపోవడంతోనే సుశాంత్‌ను ఈ సినిమాల నుంచి తప్పించినట్లు భన్సాలీ వెల్లడించాడు. దాదాపు మూడు గంటల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది. ఇప్పటికే సుశాంత్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు కుంటుంబ సభ్యులు, స్నేహితులు, సహా నటులతో కలిపి దాదాపు 34 మందిని విచారించారు. వారందరి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.(నన్ను చాలా టార్చర్‌ చేశారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement