జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది.. సుశాంత్‌ సింగ్‌ వల్లే.. : నటి | Pavitra Rishta Turns 15: Ankita Lokhande Special Mention for Sushant Singh rajput | Sakshi
Sakshi News home page

Ankita Lokhande: సుశాంత్‌ లేకపోతే నా జర్నీయే పూర్తి కాదు.. అతడే దగ్గరుండి..

Published Sun, Jun 2 2024 2:34 PM | Last Updated on Sun, Jun 2 2024 4:17 PM

Pavitra Rishta Turns 15: Ankita Lokhande Special Mention for Sushant Singh rajput

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మొదట సీరియల్స్‌లో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్‌ అతడికి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో అతడికి జోడీగా అంకితా లోఖండే నటించింది. వీరిద్దరూ షూటింగ్‌ టైంలో లవ్‌లో పడ్డారు. కానీ ఆ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఇకపోతే 2009లో ప్రసారమైన ఈ సీరియల్‌ కొన్నేళ్లపాటు కొనసాగింది.

అర్చనగా మొదలైన జర్నీ
తాజాగా పవిత్ర రిష్తా సీరియల్‌ ప్రేక్షకుల్ని అలరించి పదిహేనేళ్లు అవుతున్న సందర్భంగా అంకిత సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. 15 ఏళ్ల క్రితం పవిత్ర రిష్తా సీరియల్‌లో అర్చనగా నా జర్నీ మొదలుపెట్టాను. తర్వాత కొన్ని వేరే ప్రాజెక్టులు కూడా చేశాను కానీ జనాలు నన్ను అర్చనగానే గుర్తుపెట్టుకుని నాపై ‍ప్రేమాభిమానాలు కురిపించారు. అందుకే ఆ పాత్ర ఇప్పటికీ నాలోనే, నాతోనే ఉంది. ఆ పాత్ర నాకు జీవితమంటే ఏంటో నేర్పింది.

సుశాంత్‌ వల్లే..
కెరీర్‌ ప్రారంభంలో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సీరియల్‌ యూనిట్‌కు థ్యాంక్స్‌. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సపోర్ట్‌ లేకుండా నా జర్నీయే పూర్తి కాదు. సీరియల్‌ ప్రారంభమైన కొత్తలో ఎలా నటించాలో తెలిసేది కాదు. అతడే దగ్గరుండి యాక్టింగ్‌ నేర్పించాడు. అందుకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా సరిపోదు. నాకు ఇంత ప్రేమాభిమానాలు అందించిన టీవీ ఇండస్ట్రీకి థ్యాంక్స్‌. అభిమానులు, స్టార్‌డమ్‌ ఇవన్నీ ఈ సీరియల్‌ నుంచే మొదలయ్యాయి అని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాగే మిస్‌ యూ సుశాంత్‌ అంటూ కొన్ని ఫోటోలు కూడా షేర్‌ చేసింది.

 

చదవండి: 'ఆడిషన్‌ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement