'ఆడిషన్‌ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్! | Bigg Boss 17s Abhishek Kumar Opens Up On Casting Couch Experience | Sakshi
Sakshi News home page

Abhishek Kumar: ' ముంబయిలో ఆడిషన్‌.. స్వలింగ సంపర్కుడితో చేదు అనుభవం'

Published Sun, Jun 2 2024 11:14 AM | Last Updated on Sun, Jun 2 2024 12:15 PM

Bigg Boss 17s Abhishek Kumar Opens Up On Casting Couch Experience

బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్‌ అనే సీరియల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్‌బాస్ సీజన్‌-17 షో ద్వారా మరింత ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.  కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్‌ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్లు వివరించారు.

అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్‌లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్‌ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్‌ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్‌ బోగిలో టికెట్‌ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement