Abhishek Kumar
-
'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్!
బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్ అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17 షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించారు.అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్ బోగిలో టికెట్ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. -
టార్చర్ పెట్టిన ప్రియురాలు.. విడిపోయాకే లైఫ్ బాగుంది: నటుడు
హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ ఈ మధ్యే ముగిసింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ విజేతగా అవతరించగా నటుడు అభిషేక్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. హీరోయిన్ మన్నారా చోప్రా, నటి అంకిత లోఖండే, హైదరాబాదీ కుర్రాడు అరుణ్ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. వీళ్లంతా ఇప్పుడు వారి ఫేమ్, సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన అభిషేక్ హౌస్‌లో ఎన్నో కష్టాలు పడ్డాడు. అందుకు కారణం తన మాజీ ప్రేయసి ఇషా. ఈమెనే అనుకుంటే ఆమెకు తోడుగా తన ప్రియుడు సమర్థ్‌ను కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. ప్రేమజంటను ఛీ కొట్టిన జనాలు చుట్టూ కెమెరాలున్న సంగతి మర్చిపోయిన ఇషా-సమర్థ్ చేసిన పిచ్చి చేష్టలు చూసి జనాలు ఛీ కొట్టారు. పైగా ఇషా మాజీ బాయ్‌ఫ్రెండ్ అయిన అభిషేక్‌ను మానసికంగా వేధించారు. తన ఆరోగ్య సమస్యను వెక్కిరిస్తూ వికృత చర్యలకు పాల్పడ్డారు. వాళ్ల మాటలు భరించలేక ఒకానొక సమయంలో సమర్థ్ చెంప చెళ్లుమనిపించాడు అభిషేక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషాతో తన బ్రేకప్ గురించి నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఇషా మాల్వియా అనే చాప్టర్‌ను ముగిస్తున్నాను. ఫినాలే రోజు బిగ్‌బాస్.. ఇంటి లైట్లు ఆర్పేసి స్టేజీపైకి రమ్మన్నాడో అప్పుడే ఇషాను, ఆమెతో జరిగిన గొడవలన్నింటినీ అక్కడే మర్చిపోవాలనుకున్నాను. ఏవేవో ఆలోచించుకుంటూ మనసు పాడుచేసుకోవాలనుకోవడం లేదు. అదే నాకు పెద్ద థెరపీ జీవితంలో, కెరీర్లో ఓ అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. తన గురించి కానీ, తనకు సంబంధం ఉన్న విషయాల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. మొదట్లో నా మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు థెరపీ తీసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇషా నా జీవితంలో నుంచి వెళ్లిపోయిందో అదే నాకు పెద్ద థెరపీలా ఉపయోగపడింది. తను వెళ్లిపోయాకే నా జీవితం ప్రశాంతంగా ఉంది. ప్రేమ అంటేనే భయమేస్తోంది. ఇక మీదట ఏదైనా రిలేషన్షిప్లో అడుగుపెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్. చదవండి: వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అనుష్క తల్లిదండ్రులు.. నిజమెంత? -
వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అదేంటి.. నెక్స్ట్ ఇయర్ కదా..!
బాలీవుడ్ కా బెస్ట్ ఫ్రెండ్ ఓరీ.. అవును మరి.. ఇతడు బాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరికీ బాగా కావాల్సినవాడు, అత్యంత సన్నిహితుడు. హిందీ చిత్రసీమలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అందరి కన్నా ముందే అక్కడ వాలిపోతుంటాడు. అందరితోనూ ఫోటోలు దిగుతుంటాడు. తాజాగా ఇతడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఇతడి అసలు పేరు ఒర్హాన్ అవత్రమణి. శుక్రవారం నాడు హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్ చెప్పాడో మరేంటో కానీ అతడిని సాదరంగా ఆహ్వానించిన హౌస్మేట్స్ అతడికి ఘనంగా వెల్కమ్ చెప్తూ పార్టీ ఇచ్చారు. బతకడానికి శ్వాస తీసుకుంటా అతడి కోసం ర్యాప్ సాంగ్ రాసి పాడుతుంటే ఓరీ మాత్రం బోర్‌గా ఫీలై వాష్‌రూమ్ ఎక్కడుందని అడిగి అక్కడి నుంచి జారుకున్నాడు. హౌస్‌లో ఒక్కరోజు అయినా ఉన్నాడో లేదో కానీ రకరకాల డ్రెస్సులు మార్చాడు. ఇంటిసభ్యులు అతడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశారు. నువ్వు బతకడానికి ఏం పని చేస్తావ్? అని అడిగితే.. చిల్ అవుతా, శ్వాస తీసుకుంటా అని సరదాగా సమాధానం చెప్పాడు ఓరీ. మరో కంటెస్టెంట్ అభిషేక్ కుమార్.. వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అని ఆతృతగా అడిగాడు. నువ్వు ఉండాల్సినవాడివే దీనికి ఓరీ.. అదేంటి? వరల్డ్ కప్ వచ్చే ఏడాది కదా! అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. 'గొప్పోడివయ్యా.. పోయినవారం అందరూ టీవీలకు అతుక్కుపోయి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తే అది జరిగిందన్న విషయం కూడా తెలియదా?', 'క్రికెట్ మీద ఎంత ఆసక్తి లేకపోయినా కనీసం ప్రపంచకప్ ఎవరు గెలిచారనేది కూడా పట్టించుకోలేదంటే నువ్వు ఉండాల్సినవాడివే..', సమాధానం తెలిసినా కావాలనే చెప్పలేదేమో' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓరీ శనివారం ముంబైలో జరిగిన పార్టీలో చిల్ అవుతూ కనిపించాడు. దీంతో అతడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే! #Orry brings entertainment in the house, Promo #BiggBoss17 pic.twitter.com/7KZ0IEeS2H — The Khabri (@TheKhabriTweets) November 25, 2023 చదవండి: యానిమల్‌లో రణ్‌బీర్‌కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్ కంటే తక్కువేం కాదు! -
అత్యధిక సాలరీ ప్యాకేజీ: రూ.1.8 కోట్లు!
సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్ సృష్టించాడు. అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అభిషేక్ నైపుణ్యాలివే.. తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linuxతోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్వర్కింగ్, బ్యాకెండ్ అండ్ డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది. అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక
సాక్షి, ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ విచారణ కొనసాగుతోంది. అభిషేక్ Abhishek Boinpally ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఏ9 నిందితుడు, ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ ప్రశ్నిస్తోంది. వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది సీబీఐ. ఈ క్రమంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు(సహ నిందితుడు) ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఈ కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనేది ఆరోపణలు వినవస్తున్నాయి. -
13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్
వ్యాఖ్యాత.. కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కని వాతావరణంలో నడిపించాలి. ప్రేక్షకులకు ఏమాత్రం విసుగు కలగకుండా తన మాటల మంత్రంతో మ్యాజిక్ చేయాలి. నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎంతో ఈజ్‌గా యాంకరింగ్ చేయాలి. పెదవులు దాటి బయటకొచ్చే ప్రతి మాట చాలా ముఖ్యం. ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఇందులో నేర్పరి పీతల అభిషేక్. యాంకరింగ్‌లో రాణిస్తూ.. పలువురి మన్ననలు పొందుతున్నాడు. – కంచరపాలెం(విశాఖ ఉత్తర) నగరంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో యాంకరింగ్ అంటే ముందుగుర్తొచ్చేది రాజేంద్రప్రసాద్, అతని పిల్లలు జుహిత, అభిషేక్. ఆయా కార్యక్రమాల్లో వీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తికట్టిస్తారు. తన మాటలతో మాయాజాలం చేస్తారు. వీరిలో అభిషేక్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాడు. ప్రభుత్వ అనుమతితో 13 ఏళ్లకే అభిషేక్ 10వ తరగతి పరీక్షలు రాసి.. 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో అభిషేక్ సెల్ఫీ నాలుగేళ్ల ప్రాయంలోనే ఒడిశాలోని పారాదీప్‌లో జరిగిన నాటికల పోటీలో పెద్దలతో పోటీపడి నటించాడు. వారితో సమానంగా డైలాగ్‌లు చెప్పి అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యాడు. తర్వాత పలు నాటికలు, లఘు చిత్రాల్లో నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. 18 ఏళ్లకే జూన్–2022లో విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. పీజీలో చేరి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాడు అభిషేక్. 16 ఏళ్లకే మొదలు అభిషేక్ విద్యలోనే కాదు వ్యాఖ్యాతగా కూడా రాణిస్తున్నాడు. తనదైన శైలిలో వ్యాఖ్యానం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. 16 ఏళ్ల వయసు నుంచే యాంకరింగ్ మొదలుపెట్టాడు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న స్వాతంత్య్ర దినోత్సవం, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్న రిపబ్లిక్ డే వేడుకల్లో తెలుగులో యాంకరింగ్ చేసి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా అభిషేక్ ముఖ్యపాత్ర వహించాడు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద సోనోవాల్, శంతను ఠాకూర్ పాల్గొన్న మూడు భారీ కార్యక్రమాల్లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో యాంకరింగ్ చేసి వారి మన్ననలు పొందాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు, మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొనే కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, క్రిస్మస్ వేడుకలు, టూరిజం డే సెలబ్రేషన్స్ తదితర వేడుకల్లో అభిషేక్ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందాడు. ఈ కార్యక్రమాలను అద్భుతంగా నడిపించాడు. తన గంభీరమైన కంఠంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అభిషేక్.. అందరితోనూ మ్యాన్ ఆఫ్ మెటాలిక్ వాయిస్ కీర్తించబడుతున్నాడు. వందలాది సాంస్కృతిక, క్రీడా, సేవా, రాజకీయ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్న అభిషేక్‌కు పలు అవార్డులు వరించాయి. ఎన్నో ప్రశంసలు దక్కాయి. కళారత్న సంస్థ ‘యువరత్న’ ‘విశాఖరత్న’ అవార్డులతో సత్కరించింది. ఆయన ఇంట్లో ఓ గది బహుమతులతో నిండిపోయి ఉంటుంది. పైగా ఇంట్లో ముగ్గురూ యాంకర్లు కావడం మరో విశేషం. -
చనిపోతున్నానంటూ.. సెల్ఫీ తీసి పంపాడు
పుణె: పుణెలో ఇటీవల మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన సంఘటనను మరచిపోకముందే నగరంలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గురువారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న 23 ఏళ్ల ఉద్యోగి సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాంగ్రియా మెగాపాలిస్ సొసైటీలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో.. చనిపోయేముందు దుప్పటితో మెడకు చుట్టుకుని సెల్ఫీ తీసుకున్నాడు. దీన్ని ఓ స్నేహితుడికి పంపాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడ్ని అభిషేక్ కుమార్‌గా గుర్తించారు. అభిషేక్ సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఎనిమిది లేదా తొమ్మిది నెలల క్రితం టీసీఎస్‌లో ఉద్యోగంలో చేరాడు. స్నేహితులతో కలసి త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో అద్దెకు ఉండేవాడు. ఒక్కో గదిలో ఇద్దరు చొప్పున ఉండేవారు. అభిషేక్ తన రూమ్మేట్ బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అభిషేక్ స్నేహితులు ఫ్లాట్‌లోనే వేరే గదుల్లో ఉన్నారు. ఇంతలో అభిషేక్ స్నేహితుడు వాళ్లకు ఫోన్ చేసి సెల్ఫీ విషయం చెప్పాడు. వాళ్లు వెంటనే బెడ్ రూమ్ తలుపు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ అభిషేక్ కనిపించాడు. అతణ్ని కిందకు దించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాసేపటి తర్వాత అభిషేక్ మరణించినట్టు వైద్యులు చెప్పారు. కాన్పూర్‌లోని అతని కుటుంబ సభ్యులకు రూమ్మేట్స్ విషయం తెలియజేశారు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అభిషేక్ ఇలా చేస్తాడని తాము ఊహించలేదని అతని రూమ్మేట్స్ పోలీసుల విచారణలో చెప్పారు.