హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ ఈ మధ్యే ముగిసింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ విజేతగా అవతరించగా నటుడు అభిషేక్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. హీరోయిన్ మన్నారా చోప్రా, నటి అంకిత లోఖండే, హైదరాబాదీ కుర్రాడు అరుణ్ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. వీళ్లంతా ఇప్పుడు వారి ఫేమ్, సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన అభిషేక్ హౌస్‌లో ఎన్నో కష్టాలు పడ్డాడు. అందుకు కారణం తన మాజీ ప్రేయసి ఇషా. ఈమెనే అనుకుంటే ఆమెకు తోడుగా తన ప్రియుడు సమర్థ్‌ను కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు.
ప్రేమజంటను ఛీ కొట్టిన జనాలు
చుట్టూ కెమెరాలున్న సంగతి మర్చిపోయిన ఇషా-సమర్థ్ చేసిన పిచ్చి చేష్టలు చూసి జనాలు ఛీ కొట్టారు. పైగా ఇషా మాజీ బాయ్‌ఫ్రెండ్ అయిన అభిషేక్‌ను మానసికంగా వేధించారు. తన ఆరోగ్య సమస్యను వెక్కిరిస్తూ వికృత చర్యలకు పాల్పడ్డారు. వాళ్ల మాటలు భరించలేక ఒకానొక సమయంలో సమర్థ్ చెంప చెళ్లుమనిపించాడు అభిషేక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషాతో తన బ్రేకప్ గురించి నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఇషా మాల్వియా అనే చాప్టర్‌ను ముగిస్తున్నాను. ఫినాలే రోజు బిగ్‌బాస్.. ఇంటి లైట్లు ఆర్పేసి స్టేజీపైకి రమ్మన్నాడో అప్పుడే ఇషాను, ఆమెతో జరిగిన గొడవలన్నింటినీ అక్కడే మర్చిపోవాలనుకున్నాను. ఏవేవో ఆలోచించుకుంటూ మనసు పాడుచేసుకోవాలనుకోవడం లేదు.
అదే నాకు పెద్ద థెరపీ
జీవితంలో, కెరీర్‌లో ఓ అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. తన గురించి కానీ, తనకు సంబంధం ఉన్న విషయాల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. మొదట్లో నా మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు థెరపీ తీసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇషా నా జీవితంలో నుంచి వెళ్లిపోయిందో అదే నాకు పెద్ద థెరపీలా ఉపయోగపడింది. తను వెళ్లిపోయాకే నా జీవితం ప్రశాంతంగా ఉంది. ప్రేమ అంటేనే భయమేస్తోంది. ఇక మీదట ఏదైనా రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్.
చదవండి: వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అనుష్క తల్లిదండ్రులు.. నిజమెంత?
Comments
Please login to add a commentAdd a comment