
సినీ తారలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప బయటకు రారు. అందుకే అలా బయట కనిపించినప్పుడు వాళ్లను చూసేందుకు జనాలు ఎగబడతారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతారు. హీరోహీరోయిన్లు కూడా తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు ఇస్తుంటారు. కొంతమంది హీరోలు సెల్ఫిలు అడిగినా కొడుతారను..అది వేరే విషయం. కానీ చాలా మంది అయితే అడగ్గానే సెల్ఫీకి ఒప్పేసుకుంటారు. అలాంటి వారిలో నటి పూనం పాండే(Poonam Pandey) కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు సెల్ఫీ అంటేనే భయపడిపోతుందట.
ఫోటో కోసం వచ్చి..
తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఫొటో సెషన్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులివ్వగానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పూనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
స్క్రిప్టెడా?
ఇలాంటి ఘటన పూనమ్ కాకుండా ఇతర హీరోయిన్లలలో ఎవరికి జరిగినా అంతా నిజమనే నమ్మేవారు. కానీ పూనమ్ చరిత్ర తెలిసివాళ్లు ఇది ఫేక్ అని అంటున్నారు. ఇదంత స్క్రిప్టెడ్ అని.. అటెన్షన్ కోసమే పూనమ్ ఇలాంటి పని చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని కామెంట్ చేస్తున్నారు.
గతంలో ఇంతకు మించి..
పూనమ్‌కి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి డ్రామాలు చాలానే ఆడింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు రాయించుకుంది. అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.2011లో వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. సినిమాల కంటే ఇలాంటి డ్రామాలే పూనమ్‌కి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ముద్దు వీడియో కూడా ఫేకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.