selfiee
-
హీరోయిన్‌కి అభిమానితో చేదు అనుభవం..వీడియో వైరల్
సినీ తారలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప బయటకు రారు. అందుకే అలా బయట కనిపించినప్పుడు వాళ్లను చూసేందుకు జనాలు ఎగబడతారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతారు. హీరోహీరోయిన్లు కూడా తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు ఇస్తుంటారు. కొంతమంది హీరోలు సెల్ఫిలు అడిగినా కొడుతారను..అది వేరే విషయం. కానీ చాలా మంది అయితే అడగ్గానే సెల్ఫీకి ఒప్పేసుకుంటారు. అలాంటి వారిలో నటి పూనం పాండే(Poonam Pandey) కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు సెల్ఫీ అంటేనే భయపడిపోతుందట.ఫోటో కోసం వచ్చి..తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఫొటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులివ్వగానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పూనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.స్క్రిప్టెడా?ఇలాంటి ఘటన పూనమ్ కాకుండా ఇతర హీరోయిన్లలలో ఎవరికి జరిగినా అంతా నిజమనే నమ్మేవారు. కానీ పూనమ్ చరిత్ర తెలిసివాళ్లు ఇది ఫేక్ అని అంటున్నారు. ఇదంత స్క్రిప్టెడ్ అని.. అటెన్షన్ కోసమే పూనమ్ ఇలాంటి పని చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని కామెంట్ చేస్తున్నారు.గతంలో ఇంతకు మించి.. పూనమ్‌కి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి డ్రామాలు చాలానే ఆడింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు రాయించుకుంది. అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.2011లో వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. సినిమాల కంటే ఇలాంటి డ్రామాలే పూనమ్‌కి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ముద్దు వీడియో కూడా ఫేకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
త్యాగానికి అర్థమే స్నేహం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్న దోస్తులు (ఫొటోలు)
-
డాడీతో సెల్ఫీ.. నడిపించే దైవం నాన్న (ఫొటోలు)
-
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)
-
Raghava Lawrence: అభిమానుల కోసం లారెన్స్ కీలక నిర్ణయం!
అభిమానుల కోసం స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవా లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తనను కలిసేందుకు అభిమానులు రావొద్దని..తానే వారి వద్దకు వెళ్తానని ప్రకటించాడు. తనకు కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కలత చెందిన లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలతో పాటు సామాజిక సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోసం సెల్ఫీలు దిగే కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అలా గతేడాదిలో చెన్నై నిర్వహించిన సెల్ఫీ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తున్న ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సెల్ఫీ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు లారెన్స్. అభిమానులు ఎవరు తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. తానే స్వయంగా ప్యాన్స్ వద్దకు వచ్చి సెల్ఫీ ఇస్తానని తాజాగా ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. చివరిసారిగా చెన్నైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన నన్ను బాగా కలిచివేసింది. ఆ రోజే నా అభిమానులెవరు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై నేనే వారి కోసం ప్రయాణం చేస్తాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. రేపటి(ఫిబ్రవరి 25) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. రేపు మొదట విల్లుపురం లో గలక్ష్మి మహల్ వద్ద కలుద్దాం.’ అని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమవద్దకే వచ్చి కలవడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బీ కేర్‌ఫుల్.. బ్రదరూ..
చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు సెల్ఫీకి రెడీ అంటున్నారు నేటి యువత. అది ఎంత ప్రమాదకరమైన ప్రాంతమైన కేర్లెస్గా ఉంటున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. ఇటీవల కురిసిన వర్షాలతో జీడిమెట్ల ఫాక్‌సాగర్ చెరువు జల కళతో తోణికిసలాడుతోంది. దీంతో ఆ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. తూము ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కొందరు ప్రమాదభరితంగా సెల్ఫీలు దిగుతున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా అదే ఆఖరు సెల్ఫీ అవుతుందని మరిచి ఇలా చేస్తున్నారు. మంగళవారం చెరువు తూముపై ప్రమాదకరంగా నిలబడి ఫొటోలు దిగుతున్న కొందరు యువకులు ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. – ఫొటోలు: దశరథ్ రజువా