బీ కేర్‌ఫుల్.. బ్రదరూ..
చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు సెల్ఫీకి రెడీ అంటున్నారు నేటి యువత. అది ఎంత ప్రమాదకరమైన ప్రాంతమైన కేర్‌లెస్‌గా ఉంటున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. ఇటీవల కురిసిన వర్షాలతో జీడిమెట్ల ఫాక్‌సాగర్ చెరువు జల కళతో తోణికిసలాడుతోంది. దీంతో ఆ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. తూము ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కొందరు ప్రమాదభరితంగా సెల్ఫీలు దిగుతున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా అదే ఆఖరు సెల్ఫీ అవుతుందని మరిచి ఇలా చేస్తున్నారు. మంగళవారం చెరువు తూముపై ప్రమాదకరంగా నిలబడి ఫొటోలు దిగుతున్న కొందరు యువకులు ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.
– ఫొటోలు: దశరథ్ రజువా