Raghava Lawrence: అభిమానుల కోసం లారెన్స్‌ కీలక నిర్ణయం! | Raghava Lawrence Key Decisions For Fans Over Fans Meet Photoshoot, Deets Inside - Sakshi
Sakshi News home page

Raghava Lawrence: అభిమానుల కోసం లారెన్స్‌ కీలక నిర్ణయం!

Published Sat, Feb 24 2024 5:31 PM | Last Updated on Sat, Feb 24 2024 6:09 PM

Raghava Lawrence Key Decisions for Fans - Sakshi

అభిమానుల కోసం స్టార్‌ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, హీరో రాఘవా లారెన్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తనను కలిసేందుకు అభిమానులు రావొద్దని..తానే వారి వద్దకు వెళ్తానని ప్రకటించాడు. తనకు కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కలత చెందిన లారెన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సినిమాలతో పాటు సామాజిక సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌ కోసం సెల్ఫీలు దిగే కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అలా గతేడాదిలో చెన్నై నిర్వహించిన సెల్ఫీ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తున్న ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సెల్ఫీ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు లారెన్స్‌. అభిమానులు ఎవరు తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. తానే స్వయంగా ప్యాన్స్‌ వద్దకు వచ్చి సెల్ఫీ ఇస్తానని తాజాగా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించాడు. 

హాయ్‌ ఫ్రెండ్స్‌, ఫ్యాన్స్‌.. చివరిసారిగా చెన్నైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన నన్ను బాగా కలిచివేసింది. ఆ రోజే నా అభిమానులెవరు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై నేనే వారి కోసం ప్రయాణం చేస్తాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. రేపటి(ఫిబ్రవరి 25) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. రేపు మొదట విల్లుపురం లో గలక్ష్మి మహల్ వద్ద కలుద్దాం.’ అని ట్వీట్‌ చేశాడు. లారెన్స్‌ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమవద్దకే వచ్చి కలవడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement