వరల్డ్‌ కప్‌ ఎవరు గెలిచారు? అదేంటి.. నెక్స్ట్‌ ఇయర్‌ కదా..! | Bigg Boss: Orry Thinks Cricket World Cup next year | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ కప్‌ నెక్స్ట్‌ ఇయర్‌ ఉందట.. గొప్పోడివయ్యా సామీ.. నువ్వుండాల్సినవాడివే!

Published Sun, Nov 26 2023 12:07 PM | Last Updated on Tue, Nov 28 2023 9:53 AM

Bigg Boss: Orry Thinks Cricket World Cup next year - Sakshi

బాలీవుడ్‌ కా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓరీ.. అవును మరి.. ఇతడు బాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరికీ బాగా కావాల్సినవాడు, అత్యంత సన్నిహితుడు. హిందీ చిత్రసీమలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అందరి కన్నా ముందే అక్కడ వాలిపోతుంటాడు. అందరితోనూ ఫోటోలు దిగుతుంటాడు. తాజాగా ఇతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఇతడి అసలు పేరు ఒర్హాన్‌ అవత్రమణి. శుక్రవారం నాడు హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్‌ చెప్పాడో మరేంటో కానీ అతడిని సాదరంగా ఆహ్వానించిన హౌస్‌మేట్స్‌ అతడికి ఘనంగా వెల్‌కమ్‌ చెప్తూ పార్టీ ఇచ్చారు.

బతకడానికి శ్వాస తీసుకుంటా
అతడి కోసం ర్యాప్‌ సాంగ్‌ రాసి పాడుతుంటే ఓరీ మాత్రం బోర్‌గా ఫీలై వాష్‌రూమ్‌ ఎక్కడుందని అడిగి అక్కడి నుంచి జారుకున్నాడు. హౌస్‌లో ఒక్కరోజు అయినా ఉన్నాడో లేదో కానీ రకరకాల డ్రెస్సులు మార్చాడు. ఇంటిసభ్యులు అతడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశారు. నువ్వు బతకడానికి ఏం పని చేస్తావ్‌? అని అడిగితే.. చిల్‌ అవుతా, శ్వాస తీసుకుంటా అని సరదాగా సమాధానం చెప్పాడు ఓరీ. మరో కంటెస్టెంట్‌ అభిషేక్‌ కుమార్‌.. వరల్డ్‌ కప్‌ ఎవరు గెలిచారు? అని ఆతృతగా అడిగాడు.

నువ్వు ఉండాల్సినవాడివే
దీనికి ఓరీ.. అదేంటి? వరల్డ్‌ కప్‌ వచ్చే ఏడాది కదా! అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. 'గొప్పోడివయ్యా.. పోయినవారం అందరూ టీవీలకు అతుక్కుపోయి ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తే అది జరిగిందన్న విషయం కూడా తెలియదా?', 'క్రికెట్‌ మీద ఎంత ఆసక్తి లేకపోయినా కనీసం ప్రపంచకప్‌ ఎవరు గెలిచారనేది కూడా పట్టించుకోలేదంటే నువ్వు ఉండాల్సినవాడివే..', సమాధానం తెలిసినా కావాలనే చెప్పలేదేమో' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓరీ శనివారం ముంబైలో జరిగిన పార్టీలో చిల్‌ అవుతూ కనిపించాడు. దీంతో అతడు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే!

చదవండి: యానిమల్‌లో రణ్‌బీర్‌కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్‌ కంటే తక్కువేం కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement