ICC World Cup
-
వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అదేంటి.. నెక్స్ట్ ఇయర్ కదా..!
బాలీవుడ్ కా బెస్ట్ ఫ్రెండ్ ఓరీ.. అవును మరి.. ఇతడు బాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరికీ బాగా కావాల్సినవాడు, అత్యంత సన్నిహితుడు. హిందీ చిత్రసీమలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అందరి కన్నా ముందే అక్కడ వాలిపోతుంటాడు. అందరితోనూ ఫోటోలు దిగుతుంటాడు. తాజాగా ఇతడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఇతడి అసలు పేరు ఒర్హాన్ అవత్రమణి. శుక్రవారం నాడు హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్ చెప్పాడో మరేంటో కానీ అతడిని సాదరంగా ఆహ్వానించిన హౌస్మేట్స్ అతడికి ఘనంగా వెల్కమ్ చెప్తూ పార్టీ ఇచ్చారు. బతకడానికి శ్వాస తీసుకుంటా అతడి కోసం ర్యాప్ సాంగ్ రాసి పాడుతుంటే ఓరీ మాత్రం బోర్‌గా ఫీలై వాష్‌రూమ్ ఎక్కడుందని అడిగి అక్కడి నుంచి జారుకున్నాడు. హౌస్‌లో ఒక్కరోజు అయినా ఉన్నాడో లేదో కానీ రకరకాల డ్రెస్సులు మార్చాడు. ఇంటిసభ్యులు అతడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశారు. నువ్వు బతకడానికి ఏం పని చేస్తావ్? అని అడిగితే.. చిల్ అవుతా, శ్వాస తీసుకుంటా అని సరదాగా సమాధానం చెప్పాడు ఓరీ. మరో కంటెస్టెంట్ అభిషేక్ కుమార్.. వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అని ఆతృతగా అడిగాడు. నువ్వు ఉండాల్సినవాడివే దీనికి ఓరీ.. అదేంటి? వరల్డ్ కప్ వచ్చే ఏడాది కదా! అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. 'గొప్పోడివయ్యా.. పోయినవారం అందరూ టీవీలకు అతుక్కుపోయి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తే అది జరిగిందన్న విషయం కూడా తెలియదా?', 'క్రికెట్ మీద ఎంత ఆసక్తి లేకపోయినా కనీసం ప్రపంచకప్ ఎవరు గెలిచారనేది కూడా పట్టించుకోలేదంటే నువ్వు ఉండాల్సినవాడివే..', సమాధానం తెలిసినా కావాలనే చెప్పలేదేమో' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓరీ శనివారం ముంబైలో జరిగిన పార్టీలో చిల్ అవుతూ కనిపించాడు. దీంతో అతడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే! #Orry brings entertainment in the house, Promo #BiggBoss17 pic.twitter.com/7KZ0IEeS2H — The Khabri (@TheKhabriTweets) November 25, 2023 చదవండి: యానిమల్‌లో రణ్‌బీర్‌కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్ కంటే తక్కువేం కాదు! -
వాళ్లు అందుకే గెలిచారు: సుప్రీం మాజీ జడ్జి కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్లో స్పందించారు. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్‌ను యాదవులు, బహ్రెయిన్‌ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు. Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup. — Markandey Katju (@mkatju) November 20, 2023 కాగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో స్లిప్-అప్ల వరకు, అన్ని మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు. -
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్‌లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్‌కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్‌ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్‌లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్‌లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్‌పై అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్‌ని సాధించేసింది. అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్‌కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్‌లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్‌కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్‌కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ICC World Cup: అఫ్గాన్ తీన్మార్...
ఇకపై తమ జట్టును కూనగా పరిగణించాల్సిన అవసరం లేదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. మేటి జట్లపై తాము సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని తమ నిలకడైన ప్రదర్శనతో నిరూపించింది. మూడోసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఈసారి తమకంటే అన్ని విభాగాల్లో ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టిస్తూ ఔరా అనిపించింది.డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఉత్సాహంతో 1992 విశ్వవిజేత పాకిస్తాన్ జట్టును కూడా మట్టికరిపించిన అఫ్గానిస్తాన్ జట్టు తాజాగా 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంకను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పుణే: ప్రత్యర్థి జట్టు గత రికార్డు ఎలా ఉంటేనేమి తమదైన రోజున సమష్టిగా గర్జిస్తే అద్భుత ఫలితం సాధించవచ్చని వన్డే ప్రపంచకప్ టోరీ్నలో అఫ్గానిస్తాన్ జట్టు మూడోసారి నిరూపించింది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ మూడో సంచలన విజయంతో అలరించింది. 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హష్మతుల్లా షాహిది నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి అబ్బురపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (60 బంతుల్లో 49; 5 ఫోర్లు), కెపె్టన్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 39; 3 ఫోర్లు), సమరవిక్రమ (40 బంతుల్లో 36; 3 ఫోర్లు), తీక్షణ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్హక్ ఫారూఖీ (4/34) శ్రీలంక జట్టును దెబ్బ తీశాడు. ఒకదశలో 134/2తో పటిష్టస్థితిలో కనిపించిన శ్రీలంక నిసాంక అవుటయ్యాక తడబడింది. 107 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన రషీద్ ఖాన్ ఒక వికెట్ తీయగా, మరో స్పిన్నర్ ముజీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గుర్బాజ్ (0) డకౌట్‌కాగా... రహ్మత్ షా (74 బంతుల్లో 62; 7 ఫోర్లు), హష్మతుల్లా షాహిది (74 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో అఫ్గానిస్తాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హష్మతుల్లా, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడం విశేషం. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన అఫ్గానిస్తాన్... రెండో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి బోణీ కొట్టింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 149 పరుగుల తేడాతో ఓడిపోయి... నాలుగో మ్యాచ్‌లో విజృంభించి 1992 విశ్వవిజేత పాకిస్తాన్‌పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. అనంతరం అదే ఉత్సాహంతో శ్రీలంకను కూడా మట్టికరిపించి అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మూడోసారి వన్డే వరల్డ్‌కప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఒకే ప్రపంచకప్‌లో మూడు విజయాలు సాధించడం ఇదే ప్రథమం. 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో నెగ్గిన అఫ్గానిస్తాన్... 2019 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ తమ కంటే మెరుగైన జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌లను నెదర్లాండ్స్ (నవంబర్ 3న), ఆ్రస్టేలియా (నవంబర్ 7న), దక్షిణాఫ్రికా (నవంబర్ 10న) జట్లతో ఆడుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 46; దిముత్ కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫారూఖీ 15; కుశాల్ మెండిస్ (సి) నజీబుల్లా (సబ్) (బి) ముజీబ్ 39; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 36; అసలంక (సి) రషీద్ ఖాన్ (బి) ఫారూఖీ 22; ధనంజయ డిసిల్వా (బి) రషీద్ ఖాన్ 14; ఎంజెలో మాథ్యూస్ (సి) నబీ (బి) ఫారూఖీ 23; చమీర (రనౌట్) 1; తీక్షణ (బి) ఫారూఖీ 29; కసున్ రజిత (రనౌట్) 5; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–22, 2–84, 3–134, 4–139, 5–167, 6–180, 7–185, 8–230, 9–239, 10–241. బౌలింగ్: ముజీబ్ ఉర్ రెహ్మాన్ 10–0–38–2, ఫజల్లఖ్ ఫారూఖీ 10–1–34–4, నవీన్ ఉల్ హక్ 6.3–0–47–0, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–37–1, రషీద్ ఖాన్ 10–0–50–1, నబీ 6–0–33–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (బి) మదుషంక 0; ఇబ్రహీమ్ జద్రాన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 39; రహ్మత్ షా (సి) కరుణరత్నే (బి) రజిత 62; హష్మతుల్లా షాహిది (నాటౌట్) 58; అజ్మతుల్లా (నాటౌట్) 73; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–0, 2–73, 3–131. బౌలింగ్: మదుషంక 9–0–48–2, రజిత 10–0–48–1, మాథ్యూస్ 3–0–18–0, చమీర 9.2–0–51–0, తీక్షణ 10–0–55–0, ధనంజయ డిసిల్వా 4–0–21–0. -
WC 2023: పాక్ బౌలర్లను చితకబాదిన లంక బ్యాటర్లు.. ఫ్యాన్స్ సందడి
-
నానో టెక్నాలజీపై కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కిన గౌరవం
-
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్‌లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్‌కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్‌కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్‌లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్‌పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్‌లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్‌ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్‌ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
డిస్నీ స్టార్‌లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్‌యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్
Gautam Gambhir reveals the only time when he felt pressure: టీ20 వరల్డ్‌కప్-2007.. సౌతాఫ్రికా గడ్డపై దాయాది పాకిస్తాన్‌తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులు.. టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో కీలక పాత్ర.. వన్డే ప్రపంచకప్-2011లోనూ అలాంటి ఫలితమే పునరావృతం.. సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. 275 పరుగుల లక్ష్యం స్టార్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్.. సచిన్ టెండుల్కర్ 18 పరుగులకే వెనుదిరగడం టీమిండియా అభిమానులను ఉసూరుమనిపించింది. కానీ తానున్నానంటూ ఆ వన్‌డౌన్ బ్యాటర్ ఫ్యాన్స్ ఆశలకు ఊపిరినిచ్చాడు. అప్పుడలా.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న వేళ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 పరుగులు సాధించాడు.. ఇక ఐదో స్థానంలో వచ్చిన నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో భారత్‌ను మరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ రెండు సందర్భాల్లో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ.. ఒత్తిడిని అధిగమించిన ఆ బ్యాటర్ మరెవరో కాదు గౌతం గంభీర్. ఐసీసీ ఈవెంట్లలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడపడంలో ముందుండి కోట్లాది మంది అభిమానానికి గౌతీ పాత్రుడయ్యాడు. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లలో రాణించిన ఈ స్టార్ ఓపెనర్ తీవ్రమైన ఒత్తిడికి లోనైన సందర్భంగా ఒకటే ఒకటి ఉందట. 2014 ఐపీఎల్ సందర్భంగా తన ప్రదర్శన తనకే సిగ్గు అనిపించిందట. ‘‘నా జీవితంలో నేను అత్యంత ఒత్తిడికి గురైన సందర్భం అదే. 2014లో దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మూడుసార్లు వరుసగా డకౌట్ అయ్యాను. నాలుగో మ్యాచ్ అంటే నాకు కాస్త భయం వేసింది. నా బదులు మనీశ్ పాండేను ఓపెనింగ్ చేయమని అడిగాను. నాలో ఉన్న భయం కారణంగానే.. నేను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని చెప్పాను. నిజానికి నాలో ఉన్న భయం కారణంగానే నేను అతడిని ప్రమోట్ చేశాను. ఈ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ మ్యాచ్‌లో మనీశ్ పరుగుల ఖాతా తెరవలేదు. నేను ఒక్క పరుగు చేసి అవుటయ్యాను. ఆ తర్వాత మనీశ్‌ను పిలిచి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పాను. ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా.. అదే నేనే ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పాను. ఎప్పుడూ లేనిది ఆరోజు నేను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాతి మ్యాచ్‌లో కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫోర్ కొట్టాను. నా ఐపీఎల్ కెరీర్ పొడిగించుకోవడంలో ఆ ఒక్క బౌండరీ ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను’’ అని గౌతం గంభీర్ రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తన చేదు అనుభవం గురించి వెల్లడించాడు. ఇక ఐపీఎల్-2014లో గంభీర్ సేన చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్‌లోనే ఇలా? వీడియో వైరల్ -
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 ట్రోఫీ ఫొటోలు చూశారా
-
కోహ్లీ కొట్టుడు మొదలు పెడితే వరల్డ్ కప్ మనదే
-
టీమిండియా విజయానికి అదానీ ప్రచారం
దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భారత్ క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచారు. రాబోయే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ విజయానికి మద్దతుగా 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టు హీరోలతో కలిసి 'జీతేంగే హమ్' ప్రచారాన్ని ప్రారంభించారు. "భారత క్రికెట్ అభిమానులను ఏకం చేస్తుంది. #JeetengeHum పేరుతో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తుంది. విజయం కోసం జట్టులో తపనను, మనోధైర్యాన్ని పెంచుతుంది" అని ఈ క్యాంపెయిన్ గురించి అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రెండు లక్షణాలు ఉండాలి ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘దేశంలో విస్తృతమైన భావోద్వేగాలను ప్రేరేపించే శక్తి క్రికెట్‌కు ఉంది. పుట్టుకతోనే ఎవరూ లెజెండ్లు కారు.. స్థిరత్వం, పట్టుదలతో కృషి చేసిన లెజెండ్లుగా ఎదుగుతారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఉన్న ఈ రెండు లక్షణాలు వచ్చే వరల్డ్ కప్‌లో ఆడే జట్టుకూ ఉండాలి’ అన్నారు. చరిత్ర పునరావృతం కావాలని కాంక్షిస్తూ రాబోయే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల క్రితం 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్‌ను కపిల్ దేవ్ అదానీకి బహూకరించారు. ‘2023 ODI ప్రపంచ కప్‌లో టీమిండియా విజయానికి మద్దతుగా అదానీ గ్రూప్‌తో ఏకం కావడం గౌరవంగా భావిస్తున్నాం’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ ప్రచారం త్వరలో డిజిటల్ విషెంగ్ వేదికను పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాకు తమ శుభాకాంక్షలను, సందేశాలను ఇక్కడ తెలియజేయవచ్చు. Honoured by the presence of the Heroes of India's 1983 World Cup triumph on Adani Day. Their grit and resilience inspired an entire generation of Indians to think big. Privileged to join them in wishing our team victory at the 2023 Cricket World Cup. #JeetengeHum pic.twitter.com/bUTEQJCNOD — Gautam Adani (@gautam_adani) June 24, 2023 -
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల
మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩 👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR — Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్
-
ఇండియా - పాక్ మెగా ఫైట్‌కి స్పాట్ ఫిక్స్
-
డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత
నేపాల్ క్రికెట్ జట్టుకు డక్‌వర్త్ లూయిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలియర్కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్‌లో నేపాల్‌కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసింది. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. తాజాగా డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో యూఏఈపై విజయం సాధించిన నేపాల్ మూడో స్థానానికి చేరుకొని మూడో జట్టుగా 2023 క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక జింబాబ్వే వేదికగా జూన్‌లో ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీలు జరగనున్నాయి. ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. THE NEPALI RHINOS ARE GOING TO ZIMBABWE! Congratulations to our fearless team on qualifying for the CWC Qualifier, and a great thanks for your love and support! Keep supporting us, and believe that #weCAN!#CWCL2 #NEPvUAE pic.twitter.com/DelaYOttX4 — CAN (@CricketNep) March 16, 2023 చదవండి: క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148 -
ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి!
ఐర్లాండ్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన అతడిని గత ఏడాది కాలంగా సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆడాలని ఉన్నప్పటికీ.. సెలక్టర్ల ఆలోచన వేరే విధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో వెల్లడించాడు కెవిన్. కాగా 2006 నుంచి 2021 వరకు 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో కెవిన్ ఒబ్రెయిన్ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేశాడు. పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేమిటో పరిశీలిద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో ఐరిష్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సాధించిన విజయాలు: ►ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ భారత్ వేదికగా సాగిన వన్డే వరల్డ్‌కప్-2011 సందర్భంగా కెవిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 113(63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో) పరుగులు సాధించాడు. కొండంత లక్ష్యం ముందున్న సమయంలో టాపార్డర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ నేనున్నాంటూ కెవిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో మేటి జట్టు అయిన ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ►మొదటి, ఏకైక బ్యాటర్! అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో శతకం నమోదు చేసిన మొదటి, ఏకైక ఐర్లాండ్ ఆటగాడిగా కెవిన్ ఒబ్రెయిన్ ఘనత సాధించాడు. డబ్లిన్ వేదికగా 2018లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు 118 పరుగులు చేశాడు. #OnThisDay in 2018, Kevin O’Brien became Ireland’s first Test centurion 🌟 He hit a glorious 118 against Pakistan in Dublin. Watch the moment 📽️ pic.twitter.com/x7lJdltWrs — ICC (@ICC) May 14, 2021 ►అరుదైన రికార్డు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఏకైక ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్. పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి, టెస్టుల్లో ఒక శతకం సాధించాడు. 2013లో అవార్డు ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడైన కెవిన్ ఒబ్రెయిన్ తన అద్భుత ఆట తీరుతో.. 2013లో ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. మూడో ఆటగాడిగా.. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. తన కెరీర్లో మొత్తంగా 152 వన్డేల్లో భాగమైన కెవిన్ 141 ఇన్నింగ్స్‌లో 3619 పరుగులు చేశాడు. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో కెవిన్ అత్యధిక స్కోరు 142. సెంచరీలు రెండు. టీ20లలోనూ... 2008లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు కెవిన్ ఒబ్రెయిన్. మొత్తంగా 103 ఇన్నింగ్స్ ఆడి 1973 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐర్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. పొట్టి క్రికెట్లో కెవిన్ అత్యధిక స్కోరు 124. బౌలర్‌గానూ.. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన కెవిన్ ఒబ్రెయిన్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్‌బౌలర్ కూడా. వన్డే క్రికెట్లో అతడు 116 ఇన్నింగ్స్‌లో 114 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/13. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత. ఇక టీ20 ఫార్మాట్లో 52 ఇన్నింగ్స్‌లో కెవిన్ 58 వికెట్లు కూల్చి.. ఈ ఘనత సాధించిన మూడో ఐర్లాండ్ బౌలర్‌గా నిలిచాడు. వీటితో పాటు కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉన్న మరిన్ని రికార్డులు ►వన్డే ఫార్మాట్లో మొదటి బంతికే వికెట్ తీసిన 16వ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్(ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్) ►ప్రపంచకప్ టోర్నీలో అలెక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు(ఇంగ్లండ్ జట్టు మీద) ►ఐర్లాండ్ వన్డే జట్టు నాలుగో కెప్టెన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ ►ఐర్లాండ్ టీ20 జట్టు రెండో సారథిగా కెవిన్ ఒబ్రెయిన్ -వెబ్‌డెస్క్ చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే..