భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు | Thunderstorm Threaten India-Pakistan Clash at Eden Gardens | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు

Mar 19 2016 5:53 PM | Updated on Sep 3 2017 8:08 PM

భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు

భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు

వరల్డ్ టీ 20లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరుగనున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు కనబడుతున్నాయి.

కోల్ కతా: వరల్డ్ టీ 20లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం ఈడెన్ గార్డెన్లో జరుగనున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు కనబడుతున్నాయి. తొలుత ఈ రోజు ఉదయం నగరంలో భారీ వర్షం కురవడంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచాల్సి వచ్చింది. ఒక గంట పాటు వర్షం కురిసిన అనంతరం వాతావారణం మళ్లీ సాధారణ స్థాయికి రావడంతో మ్యాచ్ నిర్వాహకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టాస్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆకాశం మరోసారి మేఘావృతం కావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది.

 

ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైన పక్షంలో ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ లభిస్తుంది. ఇలా జరిగితే టీమిండియా జట్టుకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఈ టోర్నీలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో దాదాపు మిగతా మ్యాచ్లను గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో మ్యాచ్ రద్దైతే అది కచ్చితంగా భారత జట్టు నాకౌట్ దశపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్ సేఫ్ జోన్ లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement