twenty 20 world cup
-
భారత్ శుభారంభం
న్యూఢిల్లీ: అంధుల టీ 20 క్రికెట్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ శుభారంభం చేసింది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 129 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు ప్రకాశ్ జే(96), కేతన్ పటేల్(98) రాణించి భారీ స్కోరులో సహకరించారు. అటు బౌలింగ్ లో ఆకట్టుకుని వికెట్ తీసిన కేతన్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
హైదరాబాద్ లో ప్రపంచ అంధుల టి20 సెమీస్
హైదరాబాద్: వచ్చే నెల 10వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో అంధుల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక సంస్థ సమర్ధనం ట్రస్ట్ ఫర్ డిసేబుల్డ్ వ్యవస్థాపక ట్రస్టీ , క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా సభ్యుడు మహంతేష్ జీకే పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 28వ తేదీన ఢిల్లీలో ప్రారంభమయ్యే పోటీల్లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహిస్తామని తెలిపారు. భారత జట్టు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... దివ్యాంగులకు సానుభూతి కాకుండా అన్ని రంగాల్లో అవకాశాలు ఇచ్చి వారి సత్తాను వెలికితీయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి , సమర్ధనం ట్రస్ట్ నిర్వాహకుడు సుబ్బు, కమిటీ సభ్యులు జెహరా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కప్పు వయసు తొమ్మిదేళ్లు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిదేళ్ల కెప్టెన్సీలో దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన సమకాలికులతోనూ, జూనియర్లతోనూ జట్లను నడిపించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. దాంతో పాటు భారత్ తరపున ఘనమైన రికార్డు కూడా ధోని సొంతం. అయితే ధోని కెప్టెన్ గా ఎంపికైన తొలి ఏడాదే టీ 20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది భారత క్రికెట్ జట్టు. ఆ కప్‌ను గెలిచి సరిగ్గా ఈరోజుకి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్ స్టేడియంలో సెప్టెంబర్ 24 వ తేదీన పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించి తొలి టీ 20 కప్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని 20.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.భారత్ తరపున గౌతం గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఆ తరువాత 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ విజయం అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. ప్రత్యేకంగా చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కావడంతో భారత అభిమానులు ఆశలు వదులుకున్నారు. అందుకు కారణంగా అప్పటికే పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతుండటమే. హర్భజన్ సింగ్ ఓవర్లో మూడు సిక్సర్లు, శ్రీశాంత్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టి పాక్ ను విజయం వైపు పరుగులు పెట్టించాడు. అయితే చివరి ఓవర్‌ను అందుకున్న జోగిందర్ శర్మ తెలివిగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని వైడ్‌గా విసిరినా, తరువాత బంతికి పరుగు రాకుండా నివారించాడు. కాగా, ఆఖరి ఓవర్ రెండో బంతికి మిస్బావుల్ సిక్స్ కొట్టి పాక్ పై ఒత్తిడి తగ్గించాడు. దీంతో చివరి నాలుగు బంతుల్లో పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి.ఆ సమయంలో జోగిందర్ అత్యంత చాకచక్యంగా నెమ్మదిగా వేసిన బంతికి మిస్బా బోల్తా పడ్డాడు. ఆ బంతిని ప్యాడల్ స్కూప్ ద్వారా ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొడదామనుకున్నాడు. అయితే షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ బంతిని ఒడిసి పట్టుకోవడంతో పాక్ ఇన్నింగ్స్ కు తెరపడింది. దాంతో పాక్ నైరాశ్యంలో,భారత్ ఆనందంలో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి. -
విండీస్ ఆటగాళ్లపై ఐసీసీ ఆగ్రహం!
దుబాయ్:ఇటీవల వరల్డ్ టీ 20 కప్‌ను గెలిచిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఆ దేశ క్రికెట్ బోర్డును విమర్శించడం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో కొంతమంది ఆటగాళ్లు మీడియా ముందు శృతిమించి మాట్లాడాన్ని తప్పుబట్టిన ఐసీసీ.. అది బాధ్యతరాహిత్యమైన చర్యగా అభివర్ణించింది. దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో విండీస్ క్రికెటర్ల అంశం చర్చకు వచ్చింది. పురుషుల, మహిళల వరల్డ్ కప్ లతో పాటు, ఫిబ్రవరిలో జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ ను కూడా విండీస్ కైవసం చేసుకోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కు ఐసీసీ అభినందనలు తెలియజేసింది. ఇలా ఒక దేశం మూడు ఈవెంట్లలో కప్ గెలవడం నిజంగా అద్భుతమని కొనియాడింది. మరోవైపు విండీస్ పురుషుల జట్టులోని ఆటగాళ్ల క్రికెట్ బోర్డును బహిరంగంగా విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఒక మెగా టోర్నమెంట్లో ఆటగాళ్లు అలా అమర్యాదగా ప్రవర్తించడం కచ్చితంగా ఐసీసీ కోడ్‌లోని నిబంధల్ని అతిక్రమించడమేనని పేర్కొంది. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో పాటు ఫైనల్లో విండీస్ విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ ను నాన్ స్టైయికర్ ఎండ్‌లో ఉన్న మార్లోన్ శామ్యూల్స్ దూషించడాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తప్పుబట్టారు. శామ్యూల్స్ క్రీడా స్ఫూర్తిని దాటి ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. -
'మా పిల్లలు విరాట్ ఆటను ఆస్వాదించారు'
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20 టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ జట్టని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి పునరుద్ఘాటించాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌ను గెలవడానికి కావాల్సిన అన్ని వనరులు భారత జట్టులో ఉన్నాయని, అందుచేత నూటికి తొంభై తొమ్మిది శాతం టైటిల్ మనదేనని జోస్యం చెప్పాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో తమ పిల్లలు టీవీకి అతుక్కుపోయారన్నాడు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లి ఆడుతున్నప్పుడు ఎక్కడికి కదలకుండా అతని ఆటను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారన్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్‌లో మొత్తం క్రెడిట్ అంతా విరాట్‌కే దక్కుతుందన్నాడు. తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ ఆడిన తీరు నిజంగా అద్భుతమని సెహ్వాగ్ కొనియాడాడు. ఇదిలా ఉండగా, నాగ్ పూర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇదే నాగ్ పూర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి చెందినా , ఆ తరువాత టైటిల్ సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. మళ్లీ అదే రిపీట్ అవుతుందని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్చి 23 వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉందన్నాడు. -
భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
కోల్ కతా: వరల్డ్ టీ 20లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం ఈడెన్ గార్డెన్లో జరుగనున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు కనబడుతున్నాయి. తొలుత ఈ రోజు ఉదయం నగరంలో భారీ వర్షం కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచాల్సి వచ్చింది. ఒక గంట పాటు వర్షం కురిసిన అనంతరం వాతావారణం మళ్లీ సాధారణ స్థాయికి రావడంతో మ్యాచ్ నిర్వాహకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టాస్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆకాశం మరోసారి మేఘావృతం కావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైన పక్షంలో ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ లభిస్తుంది. ఇలా జరిగితే టీమిండియా జట్టుకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఈ టోర్నీలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో దాదాపు మిగతా మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో మ్యాచ్ రద్దైతే అది కచ్చితంగా భారత జట్టు నాకౌట్ దశపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్ సేఫ్ జోన్ లో ఉంది. -
'డివిలియర్స్ కు బౌలింగ్ చేయడమే కష్టం'
కోల్‌కతా: తాను ఎదుర్కొన్న బ్యాట్స్మెన్లలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్సే అత్యంత ప్రమాదకారని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్‌వుడ్ స్పష్టం చేశాడు. అతని సాంకేతిక పరిజ్ఞానంతో కలగలసిన దూకుడు నిజంగా అమోఘమన్నాడు. ప్రత్యేకంగా డివిలియర్స్‌కు బౌలింగ్ వేయడమే చాలా కష్టంతో కూడుకున్న పనిగా అభివర్ణించాడు. 'ప్రత్యర్థిపై తొలి ఆరు ఓవర్లలో డివిలియర్స్ ఎప్పుడూ పైచేయి సాధించడానికే చూస్తాడు. అదే ఆటను చివర్లో కూడా కొనసాగించి బౌలర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాడు. అతనికి బౌలింగ్ చేయడమంటే క్లిష్టమే' అని హాజల్‌వుడ్ తెలిపాడు. ఇదిలా ఉండగా, బౌలింగ్‌లో వైవిధ్యమే ఆటలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. తనదొరకమైన బౌలింగ్ శైలి అయితే.. ఫాల్కనర్ బౌలింగ్ లో కొద్దిగా భిన్నమైన వైవిధ్యం ఉంటుందన్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో వైవిధ్యంపైనే తన సహచర ఆటగాళ్లతో చర్చిస్తున్నట్లు హాజల్‌వుడ్ పేర్కొన్నాడు. తనను ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ పోల్చడాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. -
కివీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం వాంఖేడి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(55; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు), అలెక్స్(44; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తద్వారా తొలి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తరువాత జోయ్ రూట్(12) విఫలమైనా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. కాగా, జాస్ బట్లర్(24 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్), బెన్ స్టోక్స్(8 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(63) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. -
'షమీపై భారీ అంచనాలు'
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న టీమిండియా పేసర్ మొహ్మద్ షమీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా గాయాలతో సతమవుతున్న షమీ..గురువారం వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాల్గొని ఆకట్టుకోవడం నిజంగానే భారత జట్టుకు శుభసూచకమన్నాడు. టీమిండియా జట్టులో మొహ్మద్ షమీ ఒక కీలక బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కచ్చితమైన ప్రణాళికలను అమలు చేయడంలో షమీ దిట్ట అని రోహిత్ కొనియాడాడు. 'మేము ఏదైతే ఆశిస్తామో దాన్ని షమీ నెరవేరుస్తూ ఉంటాడు. అటు బౌన్సర్లు, యార్కర్ల దగ్గర్నుంచి, స్లో బంతులను కూడా సమర్ధవంతంగా సంధిస్తాడు. టీమిండియా తరపున షమీ చివరిసారిగా ఆడేసరికి అతను మా ప్రధాన బౌలర్లలో ఒకడు. తొడ కండరాల గాయం నుంచి ఒక పేస్ బౌలర్ అంత తొందరగా కోలుకోవడం సులువు కాదు. అతని కష్టించే తత్వంతోనే వెస్టిండీస్ మ్యాచ్ లో షమీ ఆకట్టుకున్నాడు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జరిగిన వార్మమ్ మ్యాచ్‌లో షమీ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న షమీ ఫిట్ నెస్ ను పరీక్షించే క్రమంలో అతన్ని విండీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించారు. ఆ మ్యాచ్ లో షమీ ఫర్వాలేదనిపించడంతో అతని స్థానంపై భరోసా ఏర్పడింది. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు!
కరాచీ:త్వరలో భారత్‌లో జరగబోయే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ఖరారు చేసినా మరోసారి పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆసియాకప్ నుంచి పాకిస్తాన్ జట్టు అత్యంత పేలవంగా నిష్క్రమించడం కాస్తా ఆ జట్టు యాజమాన్యాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ జట్టులో మార్పులో చేయాలని భావిస్తున్నారు. వరల్డ్ టీ 20కి ఆరంభమయ్యే నాటికి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కొన్ని మార్పులతో పాటు కఠిన నిర్ణయాలు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. ' పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టును మరోసారి పునఃసమీక్షించేందుకు సన్నద్ధమయ్యాం. గత కొంతకాలంగా అటు వన్డేల్లో, టీ 20ల్లో పాకిస్తాన్ ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కొంటుంది. జట్టులో జవాబుదారీతనం అవసరం. అందుచేత టీ 20 వరల్డ్ కప్‌కు జట్టును సమూలంగా మార్చాలనే యోచనలో ఉన్నాం. ప్రతీ విభాగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టనున్నాం' షహర్యార్ ఖాన్ తెలిపారు. ఆసియాకప్‌లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ప్రజల్ని ఎలా నిరాశకు గురి చేసిందో, మమ్మల్ని కూడా ఆ రకంగానే బాధించింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక మార్పులు చేయదలచినట్లు ఆయన స్పష్టం చేశారు. -
'యువరాజ్ ను ఆడించండి'
సిడ్నీ: టీమిండియా కష్ట సమయాల్లో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సేవలను ట్వంటీ20 వరల్డ్ కప్‌లో వినియోగించుకోవాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో యువరాజ్ పాత్ర అభినందనీయమని గవాస్కర్ పేర్కొన్నాడు. చివరి టీ 20లో ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో యువరాజ్ తొలి రెండు బంతులను ఫోర్, సిక్సర్ గా మలచిన తీరు నిజంగా అద్భుతమన్నాడు. ఈ రెండు షాట్లను కొట్టి సురేష్ రైనాపై ఒత్తిడి తగ్గించడంతోనే టీమిండియా విజయం సాధ్యమైందన్నాడు. యువరాజ్ లో ఇంకా అమోఘమైన శక్తి ఉందనడానికి అతను మూడు విభాగాల్లోనూ(బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్) ఆకట్టుకోవడమే నిదర్శనమన్నాడు. యువరాజ్ ఆట తీరుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటిస్తేనే మంచిదని గవాస్కర్ సలహా ఇచ్చాడు. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్‌లో యువీని జట్టులో సభ్యుడిగా కొనసాగించాలన్నాడు. -
ట్వంటీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: వచ్చే ఏడాది భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో ఆ ట్రోఫీని ముంబైలో శుక్రవారం ఆవిష్కరించారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన అనంతరం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలిసారి భారత్ వేదికగా జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడతుండగా, పాకిస్థాన్-టీమిండియాల మ్యాచ్ మార్చి 19వ తేదీన ధర్మశాలలో జరుగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉండగా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి. ట్వంటీ20 క్రేజ్ అమోఘం.. ప్రస్తుతం ట్వంటీ 20 క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. 2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా మొదటి ట్వంటీ 20 వరల్డ్ కప్ జరిగింది . 2007, సెప్టెంబర్ 11వ తేదీన ఆరంభమై 14 రోజుల పాటు జరిగిన ఆ టోర్నీలో... మొత్తం 12 టీమ్ లు తలపడ్డాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా తొలిసారి ట్రోఫీని చేజిక్కించుకుంది. దాయాది పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది. 2007, సెప్టెంబర్ 24 వ తేదీన ఇరు జట్లు మధ్య చివరివరకూ దోబుచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. దీంతో ట్వంటీ 20 మ్యాచ్ లకు భారత్ లో మరింత ఆదరణ లచించడమే కాకుండా, ధోని నాయకత్వంపై కూడా సెలెక్టర్లకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ టీమిండియా జట్టులో ధోని కీలకంగా మారాడు. ఇప్పటివరకూ ఐదు ట్వంటీ 20 వరల్డ్ కప్ లు జరిగినా.. భారత్ లో ఇంకా ట్వంటీ 20 వరల్డ్ కప్ జరగలేదు. వచ్చే సంవత్సరం జరిగే ఆరో ట్వంటీ 20 వరల్డ్ కప్ కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకుముందు దక్షిణాఫ్రికా(2007),ఇంగ్లండ్(2009), వెస్టిండీస్(2010), శ్రీలంక(2012), బంగ్లాదేశ్(2014) లలో ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నీలు జరగగా.. వరుసగా భారత్ , పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకలు మాత్రమే కప్ ను చేజక్కించుకున్నాయి. -
ఆ వరల్డ్ కప్ ఫైనల్ కు 8 ఏళ్లు పూర్తి!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్వంటీ 20 క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. 2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా మొదటి ట్వంటీ 20 వరల్డ్ కప్ జరిగింది 2007, సెప్టెంబర్ 11వ తేదీన ఆరంభమై 14 రోజుల పాటు జరిగిన ఆ టోర్నీలో... మొత్తం 12 టీమ్ లు తలపడ్డాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా తొలిసారి ట్రోఫీని చేజిక్కించుకుంది. దాయాది పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది. 2007, సెప్టెంబర్ 24 వ తేదీన ఇరు జట్లు మధ్య చివరివరకూ దోబుచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ లో ట్వంటీ 20 మ్యాచ్ లకు మరింత ఆదరణ లచించడమే కాకుండా, ధోని నాయకత్వంపై కూడా సెలెక్టర్లకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ టీమిండియా జట్టులో ధోని కీలకంగా మారాడు. ఇప్పటివరకూ ఐదు ట్వంటీ 20 వరల్డ్ కప్ లు జరిగినా.. భారత్ లో ఇంకా ట్వంటీ 20 వరల్డ్ కప్ జరగలేదు. వచ్చే సంవత్సరం జరిగే ఆరో ట్వంటీ 20 వరల్డ్ కప్ కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకుముందు దక్షిణాఫ్రికా(2007),ఇంగ్లండ్(2009), వెస్టిండీస్(2010), శ్రీలంక(2012), బంగ్లాదేశ్(2014) లలో ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నీలు జరగగా.. వరుసగా భారత్ , పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకలు మాత్రమే కప్ ను చేజక్కించుకున్నాయి. -
ధోని వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి?
జట్టులో ఆడేటప్పుడే అందరూ ఫాం ఉంటారను కోవటం పారపాటే. ఒక టోర్నీ జరిగేటప్పుడు ఆటగాళ్ల ఫాంను కూడా లెక్కించడం కూడా కష్టమే. ఒక మ్యాచ్ లో గెలిస్తే..మరో మ్యాచ్ కి అదే టీంను కొనసాగించడం ఎక్కువగా జరుగుతుంది. ఆ తరుణంలో ఒకరిద్దరి ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కూడా పెద్దగా లెక్కించరు. సమిష్టిగా విజయాలు సాధిస్తున్నప్పుడు టీం లో ఏమీ మార్పులు ఉండవు. ఆ రకంగానే యువరాజ్ చివరి వరకూ జట్టులో కొనసాగాడు. కాగా, చివరి మ్యాచ్.. అదీ ఒక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో జట్టును నైరాశ్యంలోకి నెట్టి యువీ ఆడిన తీరు ఎంతమాత్రం సబబు కాదు. ఒకప్రక్క విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే అతనికి స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కూడా యువీ యత్నించకపోవడమే అతను మానసికంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడనేది అర్దమవుతోంది. ఆటంటే సవాళ్లు..ప్రతి సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే అన్నిరకాలుగా ఫిట్ గా ఉండాలి. మరి ఆ ఆటతీరు ప్రేక్షకులకే చికాకు తెప్పిస్తే జట్టు కెప్టెన్ కు అసహనానికి గురి చేయదా? అదే కనిపించింది నిన్నటి మన టీం ఇండియా కెప్టెన్ ధోని మాటల్లో..ఏ క్రికెటర్ కూడా కావాలని చెత్తగా ఆడడు. కానీ ఆటలో ఇవన్నీ సహజం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటూ యువీకి మద్దతుగా మాట్లాడాడు. కానీ... అదే ధోని పరోక్షంగా యువీ కెరీర్ ముగిసినట్లే అనే సంకేతమిచ్చాడు. యువరాజ్ భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు ‘ఈరోజు గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే భారత క్రికెట్‌కు సీజన్ అయిపోయింది. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడాలి. దాని తర్వాత మళ్లీ భారత జట్టు ఎంపిక సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం’ అన్నాడు. ప్రస్తుతానికి టీం ఇండియా ఆడే మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో సెలక్షన్ సమస్య ఇప్పటికి ఉండదు. అయితే రాబోయే రోజుల్లో యువరాజ్ భవితవ్యం ఏంటనేది ఈపాటికి అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా తుది పోరులో టీమిండియాతో తలపడుతున్న శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత షేర్ బంగ్లా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ నలభై నిమిషాల ఆలస్యంగా ఆరంభం కానుంది. అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనిసేన... ఈసారి టి20 ప్రపంచకప్ నెగ్గి మూడు టైటిళ్లను ఏకకాలంలో సంపాదించుకున్న తొలి జట్టుగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. సూపర్-10 దశలో రెండు గ్రూప్‌లలో విజేతలుగా నిలిచిన జట్లే ఫైనల్‌కు చేరడం ఈ జట్లు టోర్నీలో ఇప్పటి వరకూ చూపించిన నిలకడకు నిదర్శనం. అవడానికి ప్రపంచకప్ అయినా రెండు ఆసియా జట్ల మధ్య ఆదివారం జరిగే ఈ టి20 సమరానికి షేరే బంగ్లా స్టేడియం వేదిక కానుంది. భారత్, శ్రీలంకల మధ్య ఇదే వేదికలో టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇరు జట్లూ అంటున్నాయి. -
టీ 20 ప్రపంచకప్ ఫైనల్ కు వర్షం అంతరాయం
మిర్పూర్: శ్రీలంక- టీమిండియాల మధ్య జరగనున్న ట్వంటీ 20 ప్రపంచకప్ తుది పోరుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ వేయడానికి ముందే వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. స్టేడియం అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నలభై నిమిషాల ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం ఈ రోజు తగ్గకకుండా మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. కోట్లాది మంది భారతీయ అభిమానులు మ్యాచ్ ను వీక్షించేందుకు సన్నద్ధమైన తరుణంలో వర్షం అడ్డుకోవడంతో నిరాశ తప్పలేదు. 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనిసేన... ఈసారి టి20 ప్రపంచకప్ నెగ్గి మూడు టైటిళ్లను ఏకకాలంలో సంపాదించుకున్న తొలి జట్టుగా అవతరించాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. -
టీ 20 మహిళా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
-
టీ 20 మహిళా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
మిర్పూర్: టీ 20 మహిళల ప్రపంచకప్ లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ రోజు ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ విసిరిన లక్ష్యాన్ని ఆసీస్ మహిళలు 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఆసీస్ మిడిల్ ఆర్డర్ క్రీడాకారిణులు లాన్నింగ్ (44), పెర్రీ (31) పరుగులు చేసి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆస్ట్రేలియా గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఆస్ట్రేలియా మహిళలు వరుసగా మూడు సార్లు ట్వంటీ 20 వరల్డ్ కప్ ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. -
తొలి సెమీస్ కు వర్షం అడ్డంకి: ఫైనల్ కు చేరిన శ్రీలంక
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో మరోసారి శ్రీలంక ఫైనల్ కు చేరింది. పొట్టి ఫార్మెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ డే అండ్ నైట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ప్రకటించారు. వెస్టిండీస్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 80 చేసిన దశలో వడగండ్ల వాన మ్యాచ్ ను అడ్డుకుంది. దీంతో కాసేపు మ్యాచ్ తాత్కాలికంగా వాయిదా పడింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు డక్ వర్త్ లూయిస్ పద్దతిని అనుసరించి విజేతను ఖరారు చేశారు. ఈ పద్దతి ప్రకారం శ్రీలంక 27 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 161 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కు నిర్దేశించింది. లంకేయుల పటిష్ట బౌలింగ్ ను ఎదుర్కొడానికి బరిలో దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు క్రిస్ గేల్(3), స్మిత్ (17) పరుగులు మాత్రమే చేసి విండీస్ కు షాకిచ్చారు. అనంతరం సిమ్మన్స్ (4) పరుగులు చేసి వెస్టిండీస్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ తరుణంలో స్కోరును ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను శామ్యూల్స్, బ్రేవోలపై పడింది. వారి ఆచితూచి ఆడుతూ నే అవసరమైనప్పుడు బ్యాట్ ను ఝుళిపించారు. కాగా, బ్రేవో (30) ల వద్ద పెవిలియన్ చేరాడు. శామ్యూల్స్(16), సమీ(0) తో క్రీజ్ లో ఉండగా వడగండ్ల వాన కురవడంతో మ్యాచ్ రద్దయ్యింది. అంతకుముందు టాస్ గెలిచిన లంకేయులు బ్యాటింగ్ చేపట్టారు. ఓపెనర్లు పెరీరా(26), దిల్షాన్(39) పరుగులు చేసి శ్రీలంకకు శుభారంభానిచ్చారు. అనంతరం సంగక్కారా(1), జయవర్థనే(0) కే పెవిలియన్ చేరడంతో లంకేయులు స్కోరు కాస్త మందగించింది. కాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తిరుమన్నే(44), మాథ్యూస్(40) పరుగులు చేయడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. -
టీ 20 ప్రపంచ కప్:పాకిస్తాన్ అవుట్..వెస్టిండీస్ ఇన్
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. ఈ రోజు ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోరంగా ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. విండీస్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు అహ్మద్ షెహ్ జాద్, కమ్రాన్ అక్మల్ లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగి పాక్ కు షాకిచ్చారు. దీంతో ఇక తేరుకోలేని పాకిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. సెమీస్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో చావు రేవో తేల్చుకోవాల్సిన తరుణంలో పాకిస్తాన్ అందుకు తగ్గట్టు ఆడలేదు. మహ్మద్ హఫీజ్(19), షోయబ్ మక్ సూద్ (18), షాహిద్ ఆఫ్రిది(18), తన్వీర్(14) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు నిలకడగా ఆడకపోవటంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమానార్హం. విండీస్ బౌలర్లలో బద్రీ, నరైన్ లకు తలో మూడు వికెట్లు లభించగా, రసూల్, సంతోకీలక చెరో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. డిఫెండింగ్ చాంఫియన్ హోదాలో బరిలోకి దిగిన వెస్టిండీస్ అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుని శ్రీలంకతో సెమీఫైనల్ పోరుకు సిద్దమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (5), స్మిత్ (8)పరుగులు చేసి ఆదిలోనే పెవిలియన్ బాట పట్టినా, సిమ్మన్స్(31), శ్యామ్యూల్స్(20) పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించారు.అనంతర్ బ్రేవో (46), సామీ(42*) మరోమారు ఆకట్టుకోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు కంగుతినిపించిన విండీస్ అదే స్థాయిలో ఆడి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. -
కివీస్ 60 ఆలౌట్: శ్రీలంక సంచలన విజయం
చిట్టగాంగ్: ట్వంటీ 20 ప్రపంచ కప్ లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ రోజు ఇక్కడ న్యూజిలాండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో లంకేయులు 59 పరుగుల తేడాతో ఘన విజయాన్నినమోదు చేసుకుని సెమీఫైనల్ కు దూసుకెళ్లారు. శ్రీలంక విసిరిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీలు ఆది నుచీ ఆపసోపాలు పడ్డారు. లంక బౌలింగ్ ధాటికి నిలబడలేక కివీస్ ఆటగాళ్లు విలవిల్లాడారు. కివీస్ ఆటగాళ్లలో కేన్ విలియమ్ సన్ (42 ) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు రెండంకెల మార్కును దాటలేకపోయారు. దీంతో 15.3 ఓవర్లలో 60 పరుగులకే పరిమితమైన కివీస్ ఘోర ఓటమిని మూటగట్టుకుని సెమీస్ ఆశలను నీరుగార్చుకుంది. లంక ఆటగాళ్లు సమిష్టిగా రాణించి కివీస్ కు షాకిచ్చారు. లంక స్పిన్నర్ రంగనా హెరాత్ ఐదు వికెట్లు తీసి కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చగా, సేననాయకేకు రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ లో 10 మంది కివీస్ ఆటగాళ్లు 5 అంకె మార్కును దాటలేకపోవడం గమనార్హం. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే చుక్కెదురైంది. తిలకరత్నే దిల్షాన్ (8) పరుగులకే పెవిలియన్ చేరి లంక అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం మరో ఓపెనర్ జనీత్ పెరీరా(16)పెవిలియన్ బాటపట్టడంతో లంకేయులు మరమ్మత్తులు చేపట్టారు. కీలకమ్యాచ్ కావడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. తరువాత వచ్చిన ఆటగాళ్లలో జయవర్ధనే(25), తిరుమన్నే (20)మినహా ఎవరూ రాణించకపోవడంతో లంకేయులు 19.2 ఓవర్లలో 119 పరుగులకే పరిమితమైయ్యారు. -
న్యూజిలాండ్ విజయలక్ష్యం120
చిట్టగాంగ్:ట్వంటీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ శ్రీలంక 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే చుక్కెదురైంది.తిలకరత్నే దిల్షాన్ (8) పరుగులకే పెవిలియన్ చేరి లంక అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం మరో ఓపెనర్ జనీత్ పెరీరా(16)పెవిలియన్ బాటపట్టడంతో లంకేయులు మరమ్మత్తులు చేపట్టారు. కీలకమ్యాచ్ కావడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. తరువాత వచ్చిన ఆటగాళ్లలో జయవర్ధనే(25), తిరుమన్నే (20)మినహా ఎవరూ రాణించకపోవడంతో లంకేయులు 19.2 ఓవర్లలో 119 పరుగులకే పరిమితమైయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ,నిషామ్ లు తలో మూడు వికెట్లతో ఆకట్టుకోగా మెక్ క్లెన్ గాన్ కు రెండు వికెట్లు లభించాయి. -
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీఫైనల్ దూసుకెళ్లిన టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వంద పరుగుల లోపే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మరోమారు రాణించడంతో ఆస్ట్రేలియా 86 పరుగులకే చాపచుట్టేసి టోర్నీనుంచి భారంగా నిష్ర్కమించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ (23), వార్నర్(19) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లు సమిష్టిగా పోరాడటంతో ఆసీస్ 16.2 ఓవర్లలోనే 86 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బౌలరల్లో లెగ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించగా, మిశ్రాకు రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, శర్మలకు తలో వికెట్టు లభించాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5) నాలుగో బంతికే హాడ్జ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యువ సంచలనం విరాట్ కోహ్లీ (23), రహానె (19)తో కలసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే వెనుదిరగగా, రైనా (6) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 66/4. ఈ దశలో యువరాజ్‌కు ధోనీ అండ లభించింది. మహీ సంయమనంతో ఆడుతూ యువీకి సహకరించాడు. యువరాజ్ ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తూ తనలో వాడి తగ్గలేదని నిరూపించాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్ ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కాగా చివర్లో ధోనీ (24), యువరాజ్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
భారీ లక్ష్య ఛేదనలో చతికిలబడ్డ ఇంగ్లండ్
చిట్టగాంగ్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 3 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ ఆశలను మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికా విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదిండానికి బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు లంబ్ (18), హేల్స్ (38) పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, ఆలీ(10), మోర్గాన్(14)లు స్వల్ప స్కోరుకే పరిమితమై ఇంగ్లండ్ ను కష్టాలోకి నెట్టారు. అనంతరం బట్లర్ (34) పరుగులు చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. బొపరా, జోర్డాన్ లు క్రీజ్ లో ఉన్న దశలో విజయం ఇంగ్లండ్ తో దోబూచులాడింది. జోర్డాన్(16), బొపరా ( 31) పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో మ్యాచ్ సఫారీలవైపు మొగ్గింది. కాగా చివర్లో బ్రెస్నాన్(17; రెండు సిక్స్ లు, ఒక ఫోర్) తో మెరిపించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 193 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది.దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్ కు మూడు వికెట్లు లభించగా, ఇమ్రాన్ తహీర్ కు రెండు, స్టెయిన్, హ్యండ్రిక్స్ లకు తలో వికెట్టు లభించాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సఫారీలు బ్యాటింగ్ చేపట్టారు. ఈనాటి మ్యాచ్ ఇరు జట్లుకు కీలకం కావడంతో సఫారీలు ఆది నుంచి చెలరేగిపోయారు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(56),డి కాక్ (29)పరుగులు చేసి జట్టుకు చక్కటి పునాది వేశారు.అనంతరం డివిలియర్స్ ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 9 ఫోర్లు,3 సిక్స్ లతో 69 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రెస్నాన్, జోర్డాన్, ట్రేడ్ వెల్, బ్రాడ్ లకు తలో వికెట్టు లభించింది. -
ట్వంటీ 20 ప్రపంచ కప్:ఇంగ్లండ్ విజయలక్ష్యం 197
చిట్టగాంగ్:ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సఫారీలు బ్యాటింగ్ చేపట్టారు. ఈనాటి మ్యాచ్ ఇరు జట్లుకు కీలకం కావడంతో సఫారీలు ఆది నుంచి చెలరేగిపోయారు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(56),డి కాక్ (29)పరుగులు చేసి జట్టుకు చక్కటి పునాది వేశారు.అనంతరం డివిలియర్స్ ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 9 ఫోర్లు,3 సిక్స్ లతో 69 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రెస్నాన్, జోర్డాన్, ట్రేడ్ వెల్, బ్రాడ్ లకు తలో వికెట్టు లభించింది. -
హేల్స్ సూపర్ సెంచరీ:ఇంగ్లండ్ ఘన విజయం
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో మరో ఆసక్తి పోరుకు తెరలేచింది. శ్రీలంకతో గురువారం ఇక్కడ జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఇంగ్లండ్ సూపర్ ఫాంను కొనసాగించి లంకేయులకు షాకిచ్చింది. శ్రీలంక విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇంకా నాలుగు బంతులుండగానే ఛేదించింది. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి తడబడిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు హేల్స్ అబేధ్యమైన సెంచరీతో జట్టు గెలుపును సునాయాసం చేశాడు. ఆదిలో లంబ్ (0), ఆలీ(0), వికెట్లు కోల్పోయినా, హేల్స్ మాత్రం లంకేయులకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన హేల్స్(116) పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో ఉండి ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతనికి మోర్గాన్ (57) పరుగులతో చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులకు ఆదిలోనే పెరీరా(3) ను వికెట్టును చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ దిల్షాన్ కు జయవర్దనే జత కలవడంతో జట్టు స్కోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇరువురూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దిల్షాన్ (55), జయవర్దనే(89) పరుగులతో ఆకట్టుకుని శ్రీలంకకు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో తిషారా పెరీరా(23) బాధ్యతగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, డెర్న్ బ్యాచ్ చెరో రెండు వికెట్లు లభించాయి. -
ట్వంటీ 20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ విజయలక్ష్యం 190
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ గురువారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులకు ఆదిలోనే పెరీరా(3) ను వికెట్టును చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ దిల్షాన్ కు జయవర్దనే జత కలవడంతో జట్టు స్కోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇరువురూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దిల్షాన్ (55), జయవర్దనే(89) పరుగులతో ఆకట్టుకుని శ్రీలంకకు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో తిషారా పెరీరా(23) బాధ్యతగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, డెర్న్ బ్యాచ్ చెరో రెండు వికెట్లు లభించాయి. -
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
చిట్టగాంగ్: పొట్టి ఫార్మెట్ లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. ఆద్యంతం రక్తికట్టించిన దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండు పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ కు ఓపెనర్లు మంచి ఇన్నింగ్స్ తో పునాది వేశారు. గుప్తిల్(22), విలియమ్ సన్ (51) పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు.అనంతరం రాస్ టేలర్(62) పరుగుల మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు. చివరి బంతికి వరకూ దోబూచులాడిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. స్టెయిన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు బంతికి మూడు పరుగులు చేయాల్సి తరుణంలో రాస్ టేలర్ క్రీజ్ లో ఉన్నాడు. ఆ సమయంలో కివీస్ అవలీలగా గెలుస్తుందని అంతా భావించారు. కాగా, స్టెయిన్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి బంతి సంధించి కివీస్ ను బోల్తా కొట్టించాడు. రెండు పరుగుల చిరస్మరణీయ విజయాన్ని జట్టుకు అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు నాలుగు వికెట్లు లభించగా, ఇమ్రాన్ లో రెండు వికెట్లు దక్కాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే ఓపెనర్ డీ కాక్ (4)పరుగులకే పెవిలియన్ చేరి సఫారీలు షాకిచ్చాడు. తర్వాత డుప్లిసెస్ కూడా (13) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో స్కోరును చక్కదిద్దే బాధ్యతను ఆమ్లా తన భుజాలపై వేసుకున్నాడు. ఓ ప్రక్క ఆమ్లా క్రీజ్ లో నిలకడగా ఆడుతుండగా సఫారీలు డివిలియర్స్(5) రూపంలో మరో వికెట్టును చేజార్చుకుంది. ఆమ్లా (41) పరుగులు చేసి పెవిలియన్ చేరాకే దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. అప్పటికే క్రీజ్ లో ఉన్న డుమినీ (86) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. -
ట్వంటీ 20 వరల్డ్ కప్: కివీస్ విజయలక్ష్యం 171
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డీ కాక్ (4)పరుగులకే పెవిలియన్ చేరి సఫారీలు షాకిచ్చాడు. తర్వాత డుప్లిసెస్ కూడా (13) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో స్కోరును చక్కదిద్దే బాధ్యతను ఆమ్లా తన భుజాలపై వేసుకున్నాడు. ఓ ప్రక్క ఆమ్లా క్రీజ్ లో నిలకడగా ఆడుతుండగా సఫారీలు డివిలియర్స్(5) రూపంలో మరో వికెట్టును చేజార్చుకుంది. ఆమ్లా (41) పరుగులు చేసి పెవిలియన్ చేరాకే దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. అప్పటికే క్రీజ్ లో ఉన్న డుమినీ (86) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అండర్ సన్, సౌతీలకు తలో రెండు వికెట్లు లభించగా, మిల్స్ , మెక్ కల్లమ్ లకు చెరో వికెట్టు దక్కింది. -
చాంపియన్‌కు టీమిండియా షాక్
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయం నమోదు చేసి సెమీస్ రేసులో ముందంజ వేసింది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో ధోనీసేన ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. 130 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ ధవన్ (౦) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (62 నాటౌట్), యువ సంచలనం విరాట్ కోహ్లీ (54) హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించారు. తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్లకు 129 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు స్మిత్, క్రిస్ గేల్ లు ఆదిలో చెత్త బంతులపై మాత్రమే అటాక్ చేస్తూ వికెట్లను కాపాడుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే స్మిత్(11) పరుగుల వద్ద ఉండగా అశ్విన్ కు దొరికిపోయాడు. మంచి దూకుడుమీద ఉన్న క్రిస్ గేల్ (34) అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్ రూపంలో వికెట్టు సమర్పించుకున్నాడు. అనంతరం శ్యామ్యూల్స్ (18), సిమ్మన్స్(27) పరుగులు చేసి జట్టు స్కోరును చక్కదిద్దారు. చివరి వరుస ఆటగాళ్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో జడేజాకు మూడు వికెట్లు లభించగా, అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. -
ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ విజయం
-
ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ విజయం
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. పాకిస్తాన్ విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్లు చతికిలబడ్డారు. ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) వికెట్టును ఆసీస్ కోల్పోయి నిరాశకు లోనైంది. అనంతరం షేన్ వాట్సన్(4) అదే బాటలో పయనించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తరుణంలో ఓపెనర్ ఫించ్ కు జతకలిసిన మ్యాక్ వెల్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోప్రక్క ఫించ్ నెమ్మదిగా ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆసీస్ కు పునాది వేశాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడిన మ్యాక్ వెల్(74;౩౩ బంతుల్లో 6 సిక్స్ లు, 7 ఫోర్లు), ఫించ్ (65; 54 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు) చేసి కొద్ది పాటి వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఇక అప్పటి వరకూ నల్లేరు మీద నడకలా సాగిన ఆసీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైన ఆసీస్ కు ఓటమి తప్పలేదు. ఆసీస్ ఆటగాళ్లలో 9 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. పాక్ బౌలర్లలో బిలావతి భట్టి, షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గుల్, జుల్పికర్ బాబర్ లు తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఉమర్ అక్మల్ (94), కమ్రాన్ అక్మల్ (31), షాహిద్ ఆఫ్రిది(20) పరుగులు సాయంతో 191 పరుగులు చేసింది. -
ట్వంటీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక బోణీ
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బోణీ కొట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న లంకేయులు ఐదు పరుగుల తేడాతో సఫారీలను కంగుతినిపించారు. లంకేయులు విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలోసఫారీలు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కాక్ (25), ఆమ్లా (23) పరుగులతో ఫర్వాలేదనిపించారు. అనంతరం డుమినీ(39),డివిలియర్స్(24) పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టేందుకు యత్నించారు. కాగా చివరి వరుస ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్లలో సేననాయకే రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, మలింగా, కులశేఖరాలకు తలో వికెట్టు లభించింది. టాస్ గెలిచిన లంకేయులు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ దిల్షాన్(0)పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి ఆదిలోనే లంకను నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పెరీరా మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. పెరీరా ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసి లంక ఇన్నింగ్స్ కు జీవం పోశాడు. అనంతరం జయవర్ధనే(9), సంగక్కారా(14) పరుగులు మాత్రమే చేసి లంకను మరోసారి కష్టాల్లోకి నెట్టారు.ఈ క్రమంలో క్రీజ్ లోకి మాథ్యూస్ (43) పరుగులు చేయడంతో లంకేయులు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. -
దక్షిణాఫ్రికా విజయలక్ష్యం166
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫిక్రాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన లంకేయులు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ దిల్షాన్(0) పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి ఆదిలోనే లంకను నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పెరీరా మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడిన పెరీరా 61 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం జయవర్ధనే(9), సంగక్కారా(14) పరుగులు మాత్రమే చేసి లంకను మరోసారి కష్టాల్లోకి నెట్టారు. ఈ క్రమంలో క్రీజ్ లోకి మాథ్యూస్ (43) పరుగులు చేయడంతో లంకేయులు తిరిగి కోలుకున్నారు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు తీయగా,మోర్కెల్ , స్టెయిన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శనివారం దక్షిణాఫిక్రాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియాకప్ ను కైవసం చేసుకుని మంచి ఊపుమీద ఉన్న శ్రీలంకతో పోరుకు సఫారీలు సిద్ధమైయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లిసెస్ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీంతో దక్షిణాఫ్రికా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా గాయం నుంచి తిరిగి కోలుకున్న బౌలర్ డేల్ స్టెయిన్ జట్టులో చేరాడు. ప్రధాన రౌండ్ పోటీలు నిన్నటి నుంచి ఆరంభమైయ్యాయి. శుక్రవారం జరిగిన పాకిస్తాన్-భారత్ ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి మజాను ఆస్వాదించారు. ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా ఆసక్తికరంగా జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
-
టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ధోనీసేన మరో 9 బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (24), శిఖర్ ధవన్ (30), విరాట్ కోహ్లీ (36 నాటౌట్), సురేష్ రైనా (35 నాటౌట్) రాణించారు. ఓపెనర్లు రోహిత్, ధవన్ జట్టుకు శుభారంభం అందివ్వగా, కోహ్లీ, రైనా విజయతీరాలకు చేర్చారు. టాస్ గెలిచిన టీం ఇండియా ముందుగా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. కమ్రాన్ అక్మల్(8) పరుగులకే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్ స్కోరును నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్లాడు. షెహజాద్(22) పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ మ్యాచ్ పై పట్టు సాధించింది. స్కోరును పెంచే క్రమంలో మహ్మద్ హఫీజ్(15), ఉమర్ అక్మల్(33) దూకుడుగా ఆడి పెవిలియన్ బాటపట్టారు.చివర్లో షోయమ్ మాలిక్(18), షోయబ్ మస్సూద్(21) పరుగులు చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 130పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, జడేజా, షమీ, భువనేశ్వర్ కుమార్ లకు తలో వికెట్ తీశారు. -
వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ విజయం
మిర్పూర్: ట్వంటీ20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై అపజయం చూసిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో ఆకట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా 179 పరుగుల లక్ష్యాన్నిఇంగ్లండ్ కు నిర్దేశించారు. భారీ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు లంబ్ (36), హేల్స్ (16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అనంతరం ఆలీ(46), మోర్గాన్ (16), బట్లర్ (30) పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్ 158 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సమీ,అశ్విన్ ,రైనాలకు తలో ఒక వికెట్టు లభించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా విరాట్ కోహ్లి(74), సురేష్ రైనా(54)లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. -
అర్హత మ్యాచ్ లో జింబాబ్వేకు ఐర్లాండ్ షాక్
సైల్హెట్: ట్వంటీ20 వరల్డ్ కప్ లో భాగంగా క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు బోణీ చేసింది. జింబాబ్వేతో సోమవారం జరిగిన అర్హత మ్యాచ్ లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 164 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. బోర్డుపై స్కోరు భారీగానే ఉన్నా ఐర్లాండ్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. ఓపెనర్లలో పోర్టర్ ఫీల్డ్ (31), స్టిర్లింగ్ (60) పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం జోయస్(22), పాయింటర్ (23), ఒబ్రెయిన్(17) పరుగులు చేసి గెలుపులో పాలు పంచుకున్నారు. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడింది. జింబాంబ్వే బౌలర్లలో పన్యాంగారా నాలుగు వికెట్లతో మెరిశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగుల చేసింది. జింబాబ్వే ఓపెనర్లలో మసకజ్జా(21), సికిందర్ రాజా(10) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం టేలర్ కెప్టెన్ టేలర్(59) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. -
అర్హత మ్యాచ్ లో బంగ్లాదేశ్ బోణి
మిర్పూర్: ట్వంటీ-20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ -ఏ లో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఆఫ్ఘానిస్తాన్ తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘాన్లకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు మహ్మద్ షాహజాద్(0) పరుగులేమీ చేయకుండా, నజీబ్ తరాకై(7) పరుగులకే పెవిలియన్ దారిపట్టడంతో ఆఫ్ఘాన్ కు కష్టాలు ఆరంభమైయ్యాయి. అనంతరం గుల్బదీన్ నాయబ్ (21) పరుగులు, కరీం సాథిక్(10), షఫికుల్హా(16)పరుగులు మాత్రమే చేయడంతో 17.1 ఓవర్లలో ఆఫ్ఘాన్ లు కేవలం 72 పరుగులకే చాపచుట్టేశారు. ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమై భారీ స్కోరు చేయడంలో విఫలమైయ్యారు. అదనపు పరుగుల రూపంలో వచ్చిన 12 పరుగులు ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ లో మూడో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. బంగ్లా బౌలర్లలో షకిబుల్ హసన్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అబ్దుల్ రజాక్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఆటగాళ్లు ఒక్క వికెట్టు మాత్రమే కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. తమీమ్ ఇక్భాల్ (21), అనాముల్ హకీ(44) పరుగులతో రాణించి బంగ్లాకు విజయాన్ని సాధించిపెట్టారు. -
క్రికెట్ పండగొచ్చింది!
ఢాకా: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండగొచ్చేసింది. ఉపఖండంలో జరిగే ఈ టోర్నీకి రంగం సిద్ధమైంది. మామూలు మ్యాచ్ లు భిన్నంగా ఉండే ట్వంటీ-20 మ్యాచ్ లు అంటేనే అనిశ్చితి మారుపేరు. కేవలం ఒక్క ఓవర్ లో నే మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోయే ట్వంటీ 20 అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఈ మెగా ఈవెంట్ లోఎవరు విజేతగా నిలుస్తారో చెప్పడం కష్టమే. ఇందులో మూడు పసికూన జట్లు కూడా తమ ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించేందుకు సన్నద్ధమైయ్యాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ జట్లు తొలిసారి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గత కొన్నేళ్లు క్రికెట్ బరిలో అడుగుపెట్టాలన్న ఆ మూడు జట్ల నిరీక్షణ ముగిసి పొట్టి ఫార్మెట్ వరల్డ్ కప్ లో పాల్గొననున్నాయి. ముందుగా ఎనిమిది పసికూన జట్ల మధ్యే క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా ఈ టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు మాత్రమే అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్లోకి అడుగుపెడతాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్లో తమ సత్తాను నిరూపించుకుంటాయి. ఈ మధ్య కాలంలో పేలవమైన ప్రదర్శనతో వెనకబడిపోయిన టీం ఇండియా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ముఖ్యంగా ఈ మెగా టోర్నీ మాత్రం కొంతమంది భారత ఆటగాళ్లకు పరీక్షా కాలంగానే చెప్పవచ్చు. టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించి కెప్టెన్ గా వెనుకంజలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనికి సవాల్ గా నిలవనుంది. ఎప్పుడూ సమస్యలను సవాల్ గా స్వీకరించే అలవాటు ఉన్న ధోని ఈ టోర్నీతో విజయాలబాట పట్టాలని ఆశిద్దాం. -
ట్వంటీ-20 వరల్డ్ కప్ రంగం సిద్ధం
ఢాకా: ట్వంటీ-20 వరల్డ్ కప్ రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే ఈ టోర్నీలో తొలిసారి మూడు పసికూన జట్లు తలపడనున్నాయి.దీంతో నేపాల్, హాంకాంగ్, యూఏఈ నిరీక్షణ ముగిసి పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీలో పాల్గొననున్నాయి. అసలుకు ముందు కొసరు అన్నట్లు తొలుత ఎనిమిది పసికూన జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్లోకి అడుగుపెడతాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.