చిట్టగాంగ్:ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సఫారీలు బ్యాటింగ్ చేపట్టారు. ఈనాటి మ్యాచ్ ఇరు జట్లుకు కీలకం కావడంతో సఫారీలు ఆది నుంచి చెలరేగిపోయారు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(56),డి కాక్ (29)పరుగులు చేసి జట్టుకు చక్కటి పునాది వేశారు.అనంతరం డివిలియర్స్ ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 9 ఫోర్లు,3 సిక్స్ లతో 69 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రెస్నాన్, జోర్డాన్, ట్రేడ్ వెల్, బ్రాడ్ లకు తలో వికెట్టు లభించింది.