భారత్ శుభారంభం | Defending champions India beat Bangladesh in opener | Sakshi
Sakshi News home page

భారత్ శుభారంభం

Published Tue, Jan 31 2017 6:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

భారత్ శుభారంభం

భారత్ శుభారంభం

న్యూఢిల్లీ: అంధుల టీ 20 క్రికెట్ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ శుభారంభం చేసింది. సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 129 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

 

భారత ఆటగాళ్లలో ఓపెనర్లు ప్రకాశ్ జే(96), కేతన్ పటేల్(98) రాణించి భారీ స్కోరులో సహకరించారు. అటు బౌలింగ్ లో ఆకట్టుకుని వికెట్ తీసిన కేతన్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement