చిట్టగాంగ్:ట్వంటీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ శ్రీలంక 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే చుక్కెదురైంది.తిలకరత్నే దిల్షాన్ (8) పరుగులకే పెవిలియన్ చేరి లంక అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం మరో ఓపెనర్ జనీత్ పెరీరా(16)పెవిలియన్ బాటపట్టడంతో లంకేయులు మరమ్మత్తులు చేపట్టారు. కీలకమ్యాచ్ కావడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు.
తరువాత వచ్చిన ఆటగాళ్లలో జయవర్ధనే(25), తిరుమన్నే (20)మినహా ఎవరూ రాణించకపోవడంతో లంకేయులు 19.2 ఓవర్లలో 119 పరుగులకే పరిమితమైయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ,నిషామ్ లు తలో మూడు వికెట్లతో ఆకట్టుకోగా మెక్ క్లెన్ గాన్ కు రెండు వికెట్లు లభించాయి.