ఢాకా: ట్వంటీ-20 వరల్డ్ కప్ రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే ఈ టోర్నీలో తొలిసారి మూడు పసికూన జట్లు తలపడనున్నాయి.దీంతో నేపాల్, హాంకాంగ్, యూఏఈ నిరీక్షణ ముగిసి పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీలో పాల్గొననున్నాయి. అసలుకు ముందు కొసరు అన్నట్లు తొలుత ఎనిమిది పసికూన జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్‌లోకి అడుగుపెడతాయి.
నేపాల్, హాంకాంగ్, యూఏఈ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.