ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.
యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్‌మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది.
భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment