వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఆదివారం నేపాల్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ బౌలర్ యువరాజ్ ఖాత్రి వికెట్ తీసిన ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు.
A twist of fate 🫣
When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024
ఓసారి సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్‌లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్‌ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ 4 వికెట్లతో మెరిసినా నేపాల్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో జపాన్ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment