కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది.
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది.
అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది
Comments
Please login to add a commentAdd a comment