ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది.
నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment