మిర్పూర్: శ్రీలంక- టీమిండియాల మధ్య జరగనున్న ట్వంటీ 20 ప్రపంచకప్ తుది పోరుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ వేయడానికి ముందే వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. స్టేడియం అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నలభై నిమిషాల ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం ఈ రోజు తగ్గకకుండా మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. కోట్లాది మంది భారతీయ అభిమానులు మ్యాచ్ ను వీక్షించేందుకు సన్నద్ధమైన తరుణంలో వర్షం అడ్డుకోవడంతో నిరాశ తప్పలేదు.
2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనిసేన... ఈసారి టి20 ప్రపంచకప్ నెగ్గి మూడు టైటిళ్లను ఏకకాలంలో సంపాదించుకున్న తొలి జట్టుగా అవతరించాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది.