టీ 20 మహిళా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా | 2014 t20 women world cup wins australia | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 6 2014 6:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

టీ 20 మహిళల ప్రపంచకప్ లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ రోజు ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ విసిరిన లక్ష్యాన్ని ఆసీస్ మహిళలు 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఆసీస్ మిడిల్ ఆర్డర్ క్రీడాకారిణులు లాన్నింగ్ (44), పెర్రీ (31) పరుగులు చేసి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆస్ట్రేలియా గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఆస్ట్రేలియా మహిళలు వరుసగా మూడు సార్లు ట్వంటీ 20 వరల్డ్ కప్ ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement