సైల్హెట్: ట్వంటీ20 వరల్డ్ కప్ లో భాగంగా క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు బోణీ చేసింది. జింబాబ్వేతో సోమవారం జరిగిన అర్హత మ్యాచ్ లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 164 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. బోర్డుపై స్కోరు భారీగానే ఉన్నా ఐర్లాండ్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. ఓపెనర్లలో పోర్టర్ ఫీల్డ్ (31), స్టిర్లింగ్ (60) పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం జోయస్(22), పాయింటర్ (23), ఒబ్రెయిన్(17) పరుగులు చేసి గెలుపులో పాలు పంచుకున్నారు. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడింది. జింబాంబ్వే బౌలర్లలో పన్యాంగారా నాలుగు వికెట్లతో మెరిశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగుల చేసింది. జింబాబ్వే ఓపెనర్లలో మసకజ్జా(21), సికిందర్ రాజా(10) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం టేలర్ కెప్టెన్ టేలర్(59) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు.
అర్హత మ్యాచ్ లో జింబాబ్వేకు ఐర్లాండ్ షాక్
Published Mon, Mar 17 2014 6:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement