మిర్పూర్: ట్వంటీ20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై అపజయం చూసిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో ఆకట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా 179 పరుగుల లక్ష్యాన్నిఇంగ్లండ్ కు నిర్దేశించారు. భారీ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు లంబ్ (36), హేల్స్ (16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అనంతరం ఆలీ(46), మోర్గాన్ (16), బట్లర్ (30) పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్ 158 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సమీ,అశ్విన్ ,రైనాలకు తలో ఒక వికెట్టు లభించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా విరాట్ కోహ్లి(74), సురేష్ రైనా(54)లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.