![England Set Target Of 305Runs Against India In 2nd Odi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Ind%20vs%20Eng.jpg.webp?itok=zr16S54B)
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.
ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.
కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్‌లకు ఇంగ్లండ్ మేనేెజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment