IND Vs ENG: హిట్‌మ్యాన్‌ సూపర్‌ షో.. సిరీస్‌ టీమిండియా కైవసం | Team India Beats England By 4 Wickets In 2nd ODI, Check Score Details And Highlights Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG 2nd ODI: హిట్‌మ్యాన్‌ సూపర్‌ షో.. సిరీస్‌ టీమిండియా కైవసం

Published Sun, Feb 9 2025 9:47 PM | Last Updated on Mon, Feb 10 2025 8:57 AM

Team India Beats England In 2nd Odi  Clinch Series

కటక్‌: ఇంగ్లండ్‌తో  కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌  రోహిత్‌ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు  కోల్పోయి విజయాన్ని అందుకుంది.  రోహిత్‌ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది.  ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్‌ ఉండగానే  కైవసం చేసుకుంది టీమిండియా.

హిట్‌మ్యాన్‌ సూపర్‌ షో..
చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్‌.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న హిట్‌ మ్యాన్‌.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న  విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్‌.  76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు రోహిత్‌. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.

కోహ్లి విఫలం..
శుభ్‌మన్‌ గిల్‌(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్‌. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్‌ కొట్టిన అనంతరం ​‍కోహ్లి ెపెవిలియన్‌  బాట పట్టాడు.  ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ాసాల్ట్‌ుకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్‌.


ఆకట్టుకున్న అయ్యర్‌
కోహ్లి ఔటైన తర్వాత సెకండ్‌ డౌన్‌లోక్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆకట్టుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్‌ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్‌.. స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.  ఈ  జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ ఆడబోయి రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ ను కోల్పోయింది. రోహిత్‌ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్‌ సైతం పెవిలియన్‌ చేరాడు.  47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్‌..రనౌట్‌ అయ్యాడు.

నిరాశపరిచిన రాహుల్‌.. మెరిసిన అక్షర్‌
ఫోర్త్‌ డౌన్‌  లో బ్యాటింగ్‌ కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్‌ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్‌.. జెమీ ఓవర్టాన్‌  బౌలింగ్‌ లో సాల్ట్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అక్షర్‌ పటేల్‌ మాత్రం బ్యాటింగ్‌  లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్‌.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(26), బెన్‌ డకెట్‌(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్‌ తొలి ివికెట్‌ గా పెవిలియన్‌ చేరాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ ఔటయ్యాడు. అనంతరం జో రూట్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్‌. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌ కు పంపాడు.

ఆపై బ్రూక్‌(31), జాస్‌ బట్లర్‌(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు.   జో రూట్‌ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్‌ వరకూ లివింగ్‌స్టోన్‌(41) ఉండటంతో ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా  బౌలర్లలో  రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్‌ రానా, హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది.

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్‌లో బుధవారం జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement