
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.
కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.
భారత మాస్టర్స్ జట్టు..
అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్
ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..
ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.
కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.
భారత మాస్టర్స్ జట్టు..
అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్
ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..
ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్
Comments
Please login to add a commentAdd a comment