Vinay kumar
-
మరీ ఇంత బరితెగింపా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు. రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి. ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది. పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్‌కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్‌కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్‌లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు. పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్‌కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది. కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా? -
తాను చనిపోతే తల్లిని చూసేవారు లేరని హత్య
కొత్తగూడెంఅర్బన్: తల్లీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో తాను మరణిస్తే తల్లిని చూసేవారు ఎవరూ ఉండరన్న ఆవేదనతో కుమారుడు తల్లిని హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శని వారం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పట్ట ణంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన తుల్జాకు మారి పాసి (59)కి హారతిపాసి, వినయ్‌కుమార్ పాసి(28) ఇద్దరు సంతానం. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా కూతురు హారతికి పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం తల్లీకొడుకులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తుల్జాకుమారి కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. వినయ్ కూడా అనారోగ్య సమస్యలతో బేకరీ లో పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు హారతి కుటుంబం వారికి సమీపంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వినయ్‌కుమార్ ఇనుప రాడ్‌తో తల్లిని కొట్టి హత్యచేసి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపుమడుగులో తుల్జాకుమారి..అమ్మ మ్మ, మేనమామకు టిఫిన్ ఇచ్చేందుకు హారతి కూతురు సునన్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుల్జాకుమారి ఇంటికి వచ్చింది. ఆమె తలు పు తీసి చూడగా తుల్జాకుమారి రక్తపుమడుగులో పడి ఉంది. వినయ్‌కుమార్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, త్రీటౌన్ పోలీసు లు చేరుకుని ఘటనను పరిశీలించారు. ఇనుపరాడ్ తో కొట్టడం వల్ల తుల్జాకుమారి తలకు తీవ్ర గాయ మై మృతి చెందిందని గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో ఊహించని పేరు! జహీర్ కాదంటే..
టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గంభీర్ స్వయంగా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడనే వార్తల నడుమ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఇతడేనంటూ కొత్త పేరు తెరమీదకు వచ్చింది.టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీ20 ప్రపంచకప్-2024 దాకా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ గెలిచి తన బాధ్యతలకు ఘనంగా వీడ్కోలు పలికాడు ద్రవిడ్.ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీకాలం కూడా ముగిసిన విషయం తెలిసిందే.వీరి స్థానంలో గంభీర్ తనకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుంటాడని, ఈ విషయంలో బీసీసీఐ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్(సౌతాఫ్రికా), అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్(కేకేఆర్‌లో గౌతీ సహచరుడు), బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్‌ను గౌతీ ఎంచుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త వార్త వినిపిస్తోంది. వార్తా సంస్థ ANI అందించిన వివరాల ప్రకారం.. బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐ తమ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్‌కు బదులు మరో దిగ్గజ పేసర్, గంభీర్‌తో కలిసి ఆడిన జహీర్ ఖాన్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన ఈ ముంబై బౌలర్ కోచ్ అయితే జట్టుకు ప్రయోజనకంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ జహీర్ ఖాన్ ఇందుకు సుముఖంగా లేకపోతే.. లక్ష్మీపతి బాలాజీ పేరును కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వినయ్ కుమార్ విషయంలో మాత్రం కరాఖండిగా నో చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు ANIతో పేర్కొన్నాయి.కాగా టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడిన జహీర్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో 311, 282, 17 వికెట్లు తీశాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ రికార్డు సాధించాడు.ఇక చెన్నైకి చెదిన లక్ష్మీపతి బాలాజీ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 43 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టెస్టులాడి ఆయా ఫార్మాట్లలో 27, 34, 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా బాలాజీ బౌలింగ్ కోచ్ రేసులోకి రావడం విశేషం. ఇక బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వినయ్ కుమార్.. గేల్, ఏబీడీ సరసన చోటు
ఆర్సీబీ తమ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో మరో ఆటగాడికి చోటు కల్పించింది. ఫ్రాంచైజీ మాజీ ఆటగాడు వినయ్ కుమార్ కొత్తగా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేరాడు. గతేడాది (2023) మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి చేర్చిన ఆర్సీబీ.. ఈ ఏడాది వినయ్ కుమార్‌ను ఆహ్వానించింది. నిన్న (మార్చి 19) జరిగిన అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ వినయ్ కుమార్‌ను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి ఆహ్వానించి, సత్కరించింది. వినయ్‌ను సత్కరించిన వారిలో ఆర్సీబీ యజమానితో పాటు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన ఉన్నారు. వినయ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఆహ్వానిస్తున్న విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. Vinay Kumar joins the elite company of RCB icons 𝑪𝒉𝒓𝒊𝒔 𝑮𝒂𝒚𝒍𝒆 and 𝑨𝑩 𝒅𝒆 𝑽𝒊𝒍𝒍𝒊𝒆𝒓𝒔✨ pic.twitter.com/mJ8OdaeH6U— CricTracker (@Cricketracker) March 20, 2024 40 ఏళ్ల వినయ్ ఆర్సీబీ తరఫున 2008, 2009, 2010, 2012, 2013 సీజన్లలో ఆడాడు. వినయ్ ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (80) ఉన్నాడు. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లు ఆడిన వినయ్ 105 వికెట్లు పడగొట్టాడు. వినయ్ 2012 (19), 2013 (23) సీజన్లలో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తం 11 సీజన్లు ఆడిన వినయ్.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో కర్ణాటక తరఫున రంజీ అరంగ్రేటం (2004) చేసిన వినయ్.. రంజీ చరిత్రలో 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. దేశవాలీ క్రికెట్లో వినయ్‌ను దావణగెరె ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగిన వినయ్.. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. వినయ్ భారత జట్టు తరఫున 9 టీ20లు, 31 వన్డేలు, ఏకైక టెస్ట్ ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
గూఢచారితో జోడీ
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’ (జీ 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో యిన్‌గా బనితా సంధుని ఫిక్స్ చేసినట్లు యూనిట్ పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న బనితా. ‘జీ 2’లో సరికొత్త పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘నా తొలి పాన్ ఇండియా చిత్రమిది’’ అన్నారు బనితా సంధు. -
'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?
'బిగ్‌బాస్' రియాలిటీ షోలో టీమిండియా స్టార్ క్రికెటర్. అవును మీరు విన్నది నిజమే. గతంలో హిందీ సీజన్లో శ్రీశాంత్ పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ దక్షిణాది బిగ్‌బాస్ రియాలిటీ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇంతకీ ఎవరీ ఆటగాడు? ఏంటి సంగతి? బిగ్‌బాస్‌లోకి ఆ బౌలర్ బిగ్‌బాస్ షోలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొంటారు. కుదిరితే గెలుస్తారు. లేదంటే మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్లో మాత్రం దాదాపుగా అందరూ నటులే వచ్చారు. కానీ అక్టోబరు 8 నుంచి మొదలయ్యే కన్నడ సీజన్లో మాత్రం భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నాడట. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) కన్ఫర్మే కానీ? వినయ్ కుమార్.. టీమిండియా తరఫున 31 వన్డేలు, 9 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 48 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, ముంబై, బెంగళూరు జట్లకు ఆడాడు. చివరగా 2013లో జాతీయ జట్టుకు ఆడాడు. 2021లో మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. మరి ఇది నిజమా కాదా? ఒకవేళ హౌసులోకి వస్తే ఏం చేస్తాడనేది చూడాలి? తెలుగు సీజన్ సంగతేంటి? తెలుగు సీజన్లో ప్రస్తుతం నాలుగో వారం నడుస్తోంది. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయారు. మిగతా 11 మందిలో ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వాళ్లలో రతిక, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? పవరస్త్ర గెలుచుకునేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
జైలులో నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. సుఖేష్ సంచలన లేఖ
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనాకు లేఖ రాశారు. ఈ లేఖలో తనకి జైలులో రక్షణ లేదని.. తనని మరో జైలుకు బదిలీ చేయాలని పేర్కొన్నాడు. దీంతో, సుఖేష్ లేఖ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. మండోలి జైలు నుంచి చంద్రశేఖర్.. లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ లేఖలో జూలై 1న తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక, లేఖలో ‘నా లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతున్నా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నేను చేసిన ఫిర్యాదులను, స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలి.. లేదంటే జైల్లో ఉన్న నన్ను ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారు. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాల్ చేసిన వ్యక్తి కేజ్రీవాల్‌తో పాటు సత్యేంద్రజైన్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారు. జూన్ 23న మా తల్లికి కూడా ఇటువంటి బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ మాజీమంత్రి సత్యేంద్రజైన్ సతీమణి సైతం మా అమ్మకు ఫోన్ చేసింది. నేను చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరించింది. నన్ను జైల్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు బెదిరిస్తున్నారు. మండోలి జైలులో నాకు భద్రత లేదు. దయచేసి నన్ను ఢిల్లీ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయండి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో రాష్ట్రంలోని జైలుకు నన్ను పంపించండి అని వేడుకుంటున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
నూతన పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఆర్మీలో వివిధ పోస్టులకు నియామకాలకు నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. అగ్నివీర్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ నుంచి ఇతర ర్యాంకుల అధికారుల నియామకాలకు మార్చి నుంచి నూతన పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ వినయ్‌కుమార్ బుధవారం ఇక్కడ వివరించారు. ఆర్మీలో వివిధ పోస్టులకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలైందని, మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతన విధానం ప్రకారం తొలిసారిగా ఆన్లైన్ ద్వారా ఆర్మీలో వివిధ పోస్టులు/ర్యాంకులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఫీజుతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం ఆన్లైన్లోనే రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను 10 నుంచి 14 రోజుల్లో అభ్యర్థి చిరునామాకు పంపిస్తామన్నారు. ఆన్లైన్ టెస్ట్ దేశంలో 176 ప్రాంతాల్లో నిర్వహిస్తామని, అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఇందులో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలకు పిలుస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు www.ojinindinarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు హెల్ప్‌డెస్క్ నెంబరు 7996157222 లో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ జీఎస్ రంద్వా తదితరులు పాల్గోన్నారు. -
ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ‘ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి..!, ఏం పీకుతారో చూస్తాను’అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడి అంతిమ యాత్రలో కత్తితో హల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాట్సప్‌లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నగరంలో వైరల్ అయింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న పూర్ణామార్కెట్ దరి గాజులవీధికి చెందిన నాయన తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్ వేడుకలు నిర్వహించుకున్నారు. 18న తెల్లవారుజామున అరకు వెళ్లారు. మంగళపాలెం వద్ద నాయన తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. తరుణ్ తండ్రి మాలవేసి ఉండడంతో 20న శవ పంచనామా చేసి సాయంత్రం అప్పగించారు. మార్చురీ నుంచి ఊరేగింపుగా శవయాత్ర నిర్వహిస్తూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కొబ్బరితోట వద్ద తరుణ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల వినయ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారు మద్యం మత్తులో తరుణ్‌కు జేజేలు పలికారు. ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం మాత్రం ఓ ఇద్దరి వ్యక్తుల భుజాలపై ఎక్కి మాంసం కత్తిని చేతితో చూపిస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. చదవండి: (తిరుమల: ఆన్లైన్లో ప్రత్యేక, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు) నిందితుల అరెస్ట్: కత్తులు, మారణాయుధాలతో హల్చల్ చేస్తూ నగర ప్రజలను భయాందోళనలకు గురి చేసిన 9 మందిని టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు కల్లుపాకలు, పండావీధి, కొబ్బరితోటకు చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు. కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారంతా పోలీసుల విధులకు అడ్డు తగిలారు. నిందితులపై నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి. ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్ తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. -
రోహిత్ తర్వాత నాలుగేళ్లకు ద్రవిడ్ అరంగేట్రం! ఇప్పుడు అతడు కెప్టెన్.. ఇతడేమో!
Rohit Sharma 15 Years Of T20 Journey: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్. ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3620 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు. 28 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ మేటి! ఇక టీ20 ఫార్మాట్లో రోహిత్ అత్యధిక స్కోరు 118. ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్ సొంతం. క్యాష్ రిచ్ లీగ్‌లో 227 మ్యాచ్‌లలో భాగమైన రోహిత్ 5879 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో అతడి అత్యధిక స్కోరు 109. ఇలా పదిహేనేళ్ల క్రితం ఐసీసీ మెగా ఈవెంట్‌తో తన టీ20 ప్రయాణం మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. రోహిత్ తర్వాత అరంగేట్రం.. కానీ! ఇప్పటికే టీమిండియా సారథిగా పలు టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డులు నెలక్పొలిన ఈ హిట్‌మ్యాన్.. ప్రపంచకప్-2022లో తొలిసారిగా టీమిండియా టీ20 కెప్టెన్ హోదాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ తర్వాత టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన 10 మంది భారత ఆటగాళ్లు.. రోహిత్ కంటే ముందే రిటైర్ కావడం విశేషం. వారెవరో తెలుసుకుందాం! యూసఫ్ పఠాన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్.. రోహిత్ శర్మ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజులకే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007 ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్.. ఫిబ్రవరి 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ కార్తిక్ మురళీ కార్తిక్ 2007లో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. ఇక ఐపీఎల్-2014లో భాగంగా తన చివరి టీ20 ఆడిన మురళీ కార్తిక్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా 2008లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు ప్రవీణ్ కుమార్. భారత్ తరఫున మొత్తం 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తరచూ గాయాల బారిన పడిన కారణంగా 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు ప్రవీణ్ కుమార్. ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 2009 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. 2010లో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన ఓజా.. 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అతడు మొత్తం ఆరు టీ20లు ఆడాడు. ఆశిష్ నెహ్రా భారత మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా శ్రీలంకతో మ్యాచ్ ద్వారా 2009లో తన అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆరంభించాడు. మొత్తంగా టీమిండియా తరఫున 27 టీ20 మ్యాచ్‌లు ఆడిన నెహ్రా.. 2017లో తన చివరి టీ20 ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. తొలి సీజన్లోనే క్యాష్ రిచ్లో గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపి.. ఈ ఘనత అందుకున్న తొలి భారత హెడ్‌కోచ్‌గా నిలిచాడు నెహ్రా. సుదీప్ త్యాగి 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సుదీప్ త్యాగి.. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా అదే ఏడాది అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ అదే అతడికి చివరి టీ20 అయింది. 2020లో అతడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. వినయ్ కుమార్ టీ20 వరల్డ్‌కప్-2010 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు వినయ్ కుమార్. భారత్ తరఫున 2010- 12 మధ్యకాలంలో తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. రాహుల్ శర్మ టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ 2012లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆటకు వీడ్కోలు పలికాడు. రాహుల్ ద్రవిడ్ టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం రోహిత్ శర్మ తర్వాత.. నాలుగేళ్లకు అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టడం విశేషం. 2011లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో ద్రవిడ్ తన తొలి టీ20 ఆడాడు. అదే ద్రవిడ్‌కు ఆఖరిది కూడా! ఇక 2012లో అతడు రిటైర్ అయిన విషయం తెలిసిందే. పార్థివ్ పటేల్ పార్థివ్ పటేల్ 2011 వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్లో రెండే రెండు టీ20లు ఆడాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక పార్థివ్ పటేల్ యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా ఇటీవలే ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. -
పార్థివ్ పటేల్‌కు లక్కీ ఛాన్స్.. ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా..
International League T20- MI Emirates Coaching Staff: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నేపథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమించింది. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీతో ప్రయాణం ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ఈ ఫ్రాంఛైజీతో అతడి ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాలుగు సార్లు(2013 మినహా) టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోచ్‌లకు స్వాగతం! ఎంఐ ఎమిరేట్స్ కోచ్‌ల నియామకం నేపథ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్‌లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు దక్కిన గౌరవం! ఇక తన నియామకంపై షేన్ బాండ్ స్పందిస్తూ.. ఎంఐ ఎమిరేట్స్ హెడ్‌కోచ్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ఎంఐ ఎమిరేట్స్ స్థాయిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. కాగా యూఏఈ లీగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ లీగ్ ద్వారా పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ కోచ్‌లుగా ఎంఐ ఎమిరేట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్ అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? 𝘿𝙖𝙫𝙖𝙣𝙜𝙚𝙧𝙚 Express is here 🔥 We are excited to announce that @Vinay_Kumar_R has joined MI Emirates as the bowling coach! 🤩#OneFamily #MIemirates @ILT20Official pic.twitter.com/z5spZNsi4j — MI Emirates (@MIEmirates) September 17, 2022 -
సీబీఐ దాడుల ఎఫెక్ట్?.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతరులపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఆరోపణలపై.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో.. మొత్తం దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేసింది. సుమారు 14 గంటల తనిఖీల తర్వాత మనీశ్ సిసోడియా ఫోన్, కంప్యూటర్లను సీబీఐ సీజ్ చేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంకే ప్రసక్తే లేదని, ఉచిత విద్య-ఆరోగ్యం అందించి తీరతామంటూ ప్రకటన చేశారు. మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమంటూ మండిపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలతో ప్రతీకార దాడులకు పాల్పడుతోందంటూ విమర్శించారు. క్లిక్: సిసోడియాపై దాడులు, కేసు ఏంటంటే.. ఇదిలా ఉంటే.. ఒకవైపు సీబీఐ తనిఖీలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఏఎస్‌లను బదలీలు చేశారు. బదిలీ అయిన వాళ్లలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్ ప్రకాశ్ రాయ్ సైతం ఉండడం గమనార్హం. ఆయన్ని పరిపాలన సంస్కరణల విభాగానికి బదిలీ చేసింది ఢిల్లీ సర్కార్. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఉదిత్ ప్రకాశ్‌రాయ్‌పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఎల్జీ సిఫార్సు చేశారు. వీళ్లతో పాటు మనీశ్ సిసోడియాకు దగ్గరగా ఉండే.. విజేంద్ర సింగ్ రావత్, జితేంద్ర నారాయిన్, వివేక్ పాండేలు, శుభిర్ సింగ్, గరిమా గుప్తా సైతం ట్రాన్స్‌ఫర్డ్ లిస్ట్‌లో ఉండడం గమనార్హం. మొత్తం పన్నెండు మందిని ఆఘమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎల్జీ వినయ్ కుమార్. ఇదీ చదవండి: బీజేపీ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ రియాక్షన్ -
సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం
సాక్షి, నిజామాబాద్: వారిద్దరివీ పక్క పక్క గ్రామాలు. చదువు కోసం నిజామాబాద్ వచ్చి వెళ్తున్న సమయంలో వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కులాలు వేరైనా అన్నా, చెల్లెలి మాదిరి ఉంటున్నారు. వారిద్దరు కలసి మెలసి ఉంటుండటంతో కొందరు చెడుగా మాట్లాడుతుండటంతో తాము అన్నా చెల్లెలం అని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు, యువతి ఈ నెల 8న నగరంలోని దుబ్బ ఏరియాలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్(22) నిజామాబాద్‌లో డీఎల్‌ఎంటీ కోర్సు చేస్తున్నాడు. ఆదే మండలంలోని తొండపూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక (17) జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ చదువుతోంది. రోజూ నగరానికి వచ్చి వెళ్తున్న సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అన్నా చెల్లెలిలా ఉంటున్నారు. అయితే కొందరు మరోలా మాట్లాడుతుండటంతో వారి కుటుంబసభ్యులు అనుమానించారు. ఈ విషయం తెలిసి తాము అవమానానికి గురౌతున్నామని లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మాది అన్నా చెల్లి బంధం అని మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు ఎస్సై భాస్కరచారి తెలిపారు. మృతుడి తండ్రి పుట్ట గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (టీఎన్పీఎస్సీ కోచింగ్.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి..) -
కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..
సాక్షి, సైదాపూర్(హుస్నాబాద్): అర గుంట భూమి కోసం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. తన చావుకు కారకుల పేర్లు సూసైడ్ నోట్లో రాసి, గురువారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని జాగీర్పల్లి గ్రామానికి చెందిన కమ్మం వినయ్‌కుమార్(34) ఎంబీఏ పూర్తి చేశాడు. మండల కేంద్రంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపులో ఆరేళ్లు పని చేశాడు. కొన్ని రోజుల క్రితం పని మానేశాడు. అతడి తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు, వ్యవసాయ భూములు పంపకాలు జరిగాయి. చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..) ఎవరి భూమి వారు కాస్తు చేసుకుంటున్నారు. కాగా వినయ్‌కుమార్ తండ్రి పెద్దన్నకు 20 గుంటల భూమి పట్టా కావడంలేదు. అంతే కాకుండా ఇళ్ల స్థలం రెండు గుంటలు వినయ్ తాత, మేనత్తకు ఇచ్చాడు. ఆమె తమ్మునికి అమ్ముకుంది. తమ్ముడు మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ రెండు గుంటల్లో తన తండ్రికి అర గుంట రావాలని వినయ్‌కుమార్ కొంతకాలంగా మేనత్త, చిన్నాన్నలపై పోరాటం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో పాటు ఆరేళ్లు తాను పని చేసిన ఫర్టిలైజర్ షాపు యజమాని తనను దొంగగా, మోసగాడిగా ముద్రవేశాడని మనస్తాపం చెందాడు. చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..) ‘వేణు అంకుల్ నా గోస తగిలి మీరు, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండమంటూ, తన చావుకు బూర్ల భాస్కర్, కమ్మం సమ్మయ్య, కమల, కమ్మం వినీత్, కమ్మం వివేక్, కమ్మం విశాల్, దొడ్డి సురేష్, దొడ్డి గట్టయ్య, కమ్మం చంద్రయ్య, మహెంద్ర, కమ్మం ఉదయ్, కమ్మం కావ్య, గంజి అలేఖ్యలు కారకులని, తన భూములు ఆక్రమించుకున్నారు’ అని సూసైడ్‌లో పేర్కొన్నాడు. మృతుడికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి కమ్మం జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధూకర్‌రెడ్డి తెలిపారు. -
త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత పి.శివశంకర్ తనయుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ పార్టీ ఏర్పాటు కాబోతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వినయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల్లో కరువయ్యాయని అన్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యాన్ని వ్యాపారం చేశారని, ఆత్మాభిమానం గల రైతును రుణమాఫీ, ఇతర స్కీంల పేరుతో చేతులు చాచే స్థితికి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. నవంబర్‌లో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపక సభ్యులు నరహరి, విఠల్ తదితరులు తెలిపారు. -
దాసరి శిష్యుడు, డైరెక్టర్ వినయ్‌కుమార్ కన్నుమూత
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. ఇప్పటికే సామాన్యులు సహా సినీ ప్రముఖులను సైతం కరోనా పట్టి పీడిస్తుంది. తెలుగు ఇండస్ర్టీలోనూ మరణ మృదంగం కనిపిస్తుంది. తాజాగా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్(65) కరోనాకు బలయ్యారు. గత కొద్ది రోజుల క్రితం కరోనాతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘ఏడంస్తుల మేడ’ సినిమా నుంచి దాసరి నారాయణ రావు వద్ద శిష్యరికం చేసిన ఆయన ‘పవిత్ర’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో అంతరంగాలు, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. వినయ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేశారు. ఇక నిన్న (మే12)ఒక్కరోజే ముగ్గురు సినీ ప్రముఖులు చనిపోవడంతో ఇండస్ర్టీలో విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్రశేఖర్.. డబ్బింగ్ ఇంఛార్జ్ కాంజన బాబు సహా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ కన్నుమూశారు. చదవండి : ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత -
అటు యూసుఫ్... ఇటు వినయ్...
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్‌బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు. యూసుఫ్ పఠాన్ భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్‌పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్‌లలో 142.97 స్ట్రయిక్‌రేట్‌తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్‌జోన్‌పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్‌జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ కుమార్ రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు. కర్ణాటక కెప్టెన్‌గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్‌కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్‌లో అవకాశం రాలేదు. భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ ట్రోఫీతో... -
‘రిటైర్మెంట్ అనే పదం వినడానికి బాధగా ఉంది’
ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ ఆర్. వినయ్ కుమార్ అంతర్జాతీయం సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు శుక్రవారం గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 'రిటైర్మెంట్ అనే పదం వినడానికి బాధగా ఉన్నా.. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈరోజుతో నా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నా. టీమిండియా తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడడం నా గౌరవంగా భావిస్తున్నా. అనిల్ కుంబకలే, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా వినయ్ కుమార్ టీమిండియా తరపున 2010లో అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20ల్లో 10 వికెట్లతో పాటు ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. కాగా ఐపీఎల్లో 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్లో పాల్గొన్న వినయ్ కుమార్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. మొత్తం ఐపీఎల్లో 105 మ్యాచ్‌లాడి 105 వికెట్లు పడగొట్టాడు. కాగా వినయ్ కుమార్ సారధ్యంలో కర్ణాటక జట్టు 2013-14, 2014-15 రంజీ ట్రోపీ టైటిల్స్‌ను సాధించింది. చదవండి: 'నా నిర్ణయం వ్యతిరేకిస్తారా.. ఇప్పుడు చూడండి' -
ఉరి అమలు ఆ ముగ్గురికే..!
-
ఐదు గదులు... ప్రత్యేక కిచెన్
బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటీ నివేదిక ధ్రువీకరించింది. ఆర్టీఐ అర్జీ ద్వారా ఆ కమిటీ నివేదికను సంపాదించానని, శశికళకు ప్రత్యేక మర్యాదలు జరిగిన సంగతి నిజమేనని దీని ద్వారా తెలుస్తోందని నరసింహ మూర్తి చెప్పారు. కాగా ఈ పరిమాణంపై రూప స్పందిస్తూ..తాను ఆనాడు చెప్పిన విషయాల్నే విచారణ కమిటీ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. వినయ్ కుమార్ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. జైలులో శశికళ తనకు నచ్చిన దుస్తులు ధరించి వంట చేసుకునేవారని, ఆమె సెల్లో సుగంధ ద్రవ్యాలు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. జైలులో ఆమె స్వేచ్ఛగా సంచరించేవారని, తన సహచరిణి ఇళవరసితో కలసి బయటికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందని తెలిపింది. 2017 జూన్ 11న తెలుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించిన ఓ వ్యక్తితో శశికళ సుమారు నాలుగు గంటలు మాట్లాడినట్లు పేర్కొంది. కానీ, ఆ వ్యక్తితో శశికళ 45 నిమిషాలే మాట్లాడినట్లు రిజిస్టర్లో నమోదైంది. -
పెళ్లైన మూడు నెలలకే..
‘సంతోషం తప్ప బాధ ఎలాంటిదో తెలియదు. మా అమ్మ కష్టపడి అలా పెంచింది. తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాను. అవతలి నుంచి ఇసుమంత ప్రేమ దొరకలేదు. దూరంగా పెడుతూ వేధించడం మొదలుపెట్టింది. సర్దుకుపోదామనుకున్నా. చివరకు నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మపై చేయిచేసుకునేంత వరకు వెళ్లా. అయినా, ఆమెలో మార్పు రాలేదు. తర్వాత ఆమె మా ఇంట్లోని సంతోషాన్ని తీసుకెళ్లేందుకొచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నన్ను తమ్ముడిలో చూసుకోండి అమ్మా..నాన్నా’ అంటూ సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసి తమ్ముడికి పంపి రైలు కింద పడి తనువు చాలించాడు గోనెగండ్లకు చెందిన వినయ్‌కుమార్. కర్నూలు/గోనెగండ్ల/ పత్తికొండ రూరల్/: కర్నూలు శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీ మెయిన్‌గేట్ వద్ద సోమవారం రాత్రి వినయ్‌కుమార్ (24) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గోనెగండ్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యంశెట్టి , విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వినయ్‌కుమార్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలోని సాయిబాబా గుడి దగ్గర కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. మేనమామ సొంతూరైన వెల్దుర్తిలో సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించి నవంబర్ 1న పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే మరొక యువకుడితో ఆమె ప్రేమలో పడటంతో వినయ్‌కుమార్‌కు దూరంగా ఉంటోంది. పెళ్లి అయినప్పటినుంచి కూడా కాపురం చేయకపోగా విడాకులు కావాలని భర్తతో గొడవ పడేది. 20 రోజుల క్రితం ఇదే విషయంలో ఘర్షణపడి పుట్టింటికి చేరుకుంది. సోమవారం ఉదయం వినయ్‌కుమార్‌కు.. అత్త అమృతవల్లి ఫోన్ చేసి సౌజన్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది. వెంటనే తమ్ముడు వంశీతో కలసి వచ్చి గాయత్రి ఎస్టేట్‌లోని ఆసుపత్రిలో భార్యను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సమయంలో కూడా వారి మధ్య సంసార విషయమై గొడవ జరిగింది. సాయంత్రం తల్లితో కలసి సౌజన్య వెల్దుర్తికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌కుమార్ మద్దూర్‌నగర్‌లో పని ఉంది.. చూసుకుని వస్తానంటూ తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. షర్ట్ జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. శోకసంద్రంలో తల్లిదండ్రులు వినయకుమార్ మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు, తమ్ముడు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లైన దంపతులు సుఖసంతోషాలతో ఉంటారనుకుంటే ఇలా జరిగిందం టూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల ను కంటతడి పెట్టించింది. తర్వాత మృతదేహాన్ని గోనెగండ్లకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న ఆత్మహత్యకు వదిన, ఆమె కుటుంబసభ్యులే కారణమని వంశీ తెలిపారు. -
ఈఎన్టీ కౌన్సెలింగ్
ముక్కులు మూసుకుపోతున్నాయి ఫ్రీ అయ్యేదెలా..? నా వయసు 26 ఏళ్లు. నా ఎడమ చెవిలో వినికిడి సమస్యతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాను. కుడి చెవి బాగానే ఉంది. పదిహేను రోజుల క్రితం ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాను. ఆయన నా చెవులను పరీక్షించి ఎడమ చెవిలో ఎముక కొద్దిగా మందం అయింది, అందువల్లనే మాటలు అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పారు. అంతేకాకుండా ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని, లేజర్ సర్జరీ అవసరం కావచ్చని చెప్పారు. కొన్ని మందులు రాశారు. నా సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు లేజర్ సర్జరీ అవసరమవుతుందా? – మదన్మోహన్, నల్లగొండ మీ సమస్యను విశ్లేషించడానికి మీరు ఇచ్చిన వివరాలు సరిపోవు. మీరు మొదట ఆడియాలజీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిలో మీకు ఉన్న సమస్య తీవ్రత ఎంత, చెవిలోని ఏ భాగంలో సమస్య ఉంది అన్న వివరాలు తెలుస్తాయి. అయితే... మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు ‘ఓటోస్లి్కరోసిస్’ అనే సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. మధ్య చెవిలోని ఎముకల గొలుసులో ఉండే చిన్న ఎముక అయిన ‘స్టెపీస్’లో ఒక ఎముక మందం కావడం, స్పాంజిజోన్ పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఉన్నవారికి శబ్దం, మాటలు వినిపిస్తాయి. కానీ అవి అర్థం కావు. సమస్య తీవ్రత పెరిగే కొద్దీ వినికిడి సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు వెంటనే ప్యూటర్టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెక్స్ ఆడియోమెట్రీ, ఓటోస్కోపీ మొదలైన పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్ చేయించి మీ సమస్యను నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు సాధారణంగా మందులతో తగ్గవు. సమస్య తీవ్రతను, పరిస్థితిని బట్టి చేయాలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పైన చెప్పిన సమస్య ఉన్నట్లయితే మీరు హియరింగ్ ఎయిడ్ వాడటం లేదా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ముక్కుఎప్పుడూ ఏదో అడ్డండి తగ్గేదెలా? నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. – పి. సూర్యనారాయణ, నెల్లూరు ఈమధ్య కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. -డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి –ఈఎన్టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
రోడ్స్‌ను మరిపించిన వినయ్
-
జాంటీ రోడ్స్‌ను మరిపించాడు
న్యూఢిల్లీ: జాంటీ రోడ్స్.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ క్రికెటర్ పేరు వింటేనే అప్పట్లో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఎంతలా అంటే అతను ఫీల్డింగ్ చేస్తున్న చోటుకి బంతిని కొట్టాలంటే స్టార్ ఆటగాళ్లు సైతం భయపడేవారు. అటు అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు మెరుపు రనౌట్లు చేయడంలో అతనికి అతనే సాటి. 1992 ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్ గాల్లో సమాంతరంగా డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేయడం అతని వేగవంతమైన ఫీల్డింగ్‌కు ఒక చక్కటి ఉదాహరణ. అయితే తాజాగా జాంటీ రోడ్స్‌ను భారత ఆటగాడు వినయ్‌కుమార్ మరిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్లో భాగంగా కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి అబ్బురపరిచాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుర్కీరత్ స్క్వేర్‌లెగ్ వైపు షాట్ ఆడి నిదానంగా పరిగెత్తాడు. అక్కడి నుంచి వచ్చిన త్రో వికెట్లను తాకకుండా మిడాఫ్వైపు వెళ్లింది. కాగా, అక్కడే ఉన్న వినయ్ మెరుపులా బంతిని పట్టుకుని రోడ్స్ తరహాలో గాల్లోకి ఎగిరి.. నేరుగా వికెట్లను నేలకూల్చాడు. -
వినయ్‌కుమార్ హ్యాట్రిక్
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు తడబడింది. కర్ణాటక పేసర్ వినయ్‌కుమార్ ‘హ్యాట్రిక్’ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. వినయ్ కుమార్ (6/34) దెబ్బకు 74/7తో కష్టాల్లో పడ్డ ముంబై జట్టును లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ధావల్ కులకర్ణి (132 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. వినయ్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా (2) స్లిప్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా... మూడో ఓవర్ తొలి బంతికి జయ్ గోకుల్ బిస్తా (1), రెండో బంతికి ఆకాశ్ పర్కర్ (0)లను వెనక్కి పంపడంతో కర్ణాటక కెప్టెన్ హ్యాట్రిక్ పూర్తయింది. సిద్ధేశ్ లాడ్ (8), సూర్యకుమార్ యాదవ్ (14), తారే (4) విఫలమయ్యారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి సమర్థ్ (40) వికెట్ కోల్పోయి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (62 బ్యాటింగ్), అబ్బాస్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కర్ణాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మధ్యప్రదేశ్ 223/6 సాక్షి, విజయవాడ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ మ్యాచ్‌లో తొలి రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్ అంకిత్ దానే (59), సీనియర్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా (49) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ వికాస్ మిశ్రా (3/40) ఆకట్టుకున్నాడు. జైపూర్: బెంగాల్, గుజరాత్ల మధ్య జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (129) సెంచరీతో ఆకట్టుకోగా, అనుస్తుప్ మజుందార్ (94) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరి ఆటతో ఆ జట్టు 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. సూరత్: మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, కేరళ మధ్య మ్యాచ్ తొలి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. ముంబై 173 ఆలౌట్ ∙రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ -
హ్యాట్రిక్‌తో 'ఆరే'శాడు
నాగ్‌పూర్: తన పునరాగమనానికి సంబంధించి భారత వెటరన్ పేస్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ గత నెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా జట్టులో తిరిగి చోటు సంపాదించడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఇక్కడ సత్తా ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదంటూ రీ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్నఈ కర్ణాటక బౌలర్.. తాజాగా ముంబైతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటడమే కాకుండా మొత్తంగా ఆరు వికెట్లు సాధించి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా నాల్గో కార్టర్ ఫైనల్లో గురువారం ముంబైతో ఆరంభమైన మ్యాచ్‌లో కర్ణాటక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వినయ్ కుమార్ టాస్ గెలిచిన వెంటనే ప్రత్యర్థి ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు వినయ్ కుమార్ చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ చివరి బంతికి ముంబై స్టార్ ఆటగాడు పృథ్వీ షా అవుట్ చేసిన వినయ్ కుమార్..ఆపై మూడో ఓవర్ మొదటి బంతికి జోయ్ గోకుల్ బిస్తా పెవిలియన్‌కు పంపాడు. ఇక తరువాత బంతికి ఆకాశ్ పర్కకర్ను ఎల్బీగా పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అటు తరువాత సిద్ధేశ్ లాడ్, అఖిల్ హరిద్వార్, సూర్యకుమార్ యాదవ్‌లు ను వినయ్ కుమార్ అవుట్ చేశాడు. ఇది వినయ్ కుమార్‌కు కర్ణాటక తరపున వందో ఫస్ట్ క్లాస్ కావడం ఇక్కడ మరో విశేషం. వినయ్ కుమార్ దెబ్బకు ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే చాపచుట్టేసింది. ముంబై జట్టులో ధావల్ కులకర్ణి(75)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధావల్ ఆదుకోవడంతో ముంబై మోస్తరు స్కోరును సాధించింది. వినయ్ ఘనతలు.. రంజీల్లో వినయ్ కుమార్‌కు ఇది రెండో హ్యాట్రిక్. 2007-08 సీజన్లో మహారాష్ట్రపై వినయ్ కుమార్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. కాగా, రంజీ చరిత్రలో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాల్గో బౌలర్ గా వినయ్ ఘనత నమోదు చేయగా, కర్ణాటక తరపున ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా వినయ్ నిలిచాడు. రంజీల్లో కర్ణాటక తరపున అత్యధిక సార్లు హ్యాట్రిక్ తీసిన వారిలో వినయ్ కంటే ముందు అనిల్ కుంబ్లే ఉన్నాడు. మరొకవైపు రంజీ ట్రోఫీలో ఒక కర్ణాటక బౌలర్ హ్యాట్రిక్ వికెట్లను తీయడం పదోసారి కాగా, ఈ ఫీట్‌ను సాధించిన తొలి కెప్టెన్‌గా వినయ్ కుమార్ ఘనత సాధించాడు. 2013లో భారత్ తరుపున చివరిసారి కనిపించిన వినయ్ మరొకసారి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. తాను తిరిగి కచ్చితంగా జాతీయ జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్న వినయ్ కుమార్ సెలక్టర్లను ఆకర్షిస్తాడో లేదో చూడాలి. -
'అనుమానం లేదు.. మళ్లీ జట్టులోకి వస్తా'
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తన పునరాగమనానికి సంబంధించి భారత వెటరన్ పేస్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న వినయ్ కుమార్.. తిరిగి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఖాయమంటున్నాడు. ఇక్కడ సత్తా ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదంటూ రీ ఎంట్రీపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనను నిరూపించుకుంటానంటూ స్పష్టం చేశాడు. 'నేను ఫిట్ నెస్ ను నిరూపించుకునే పనిలో ఉన్నా. అది కూడా జాతీయ జట్టులో పునరామనం చేసేందుకే. ప్రస్తుతం నా పరిస్థితి ఏమిటో అనే విషయంలో పూర్తిగా స్పష్టత ఉంది. ఒకవేళ నాకు 21-22 ఏళ్లు అయితే మాత్రం భారత జట్టులో చోటు కోల్పోవడాన్ని జీర్ణించుకుని విషయం చాలా కష్టంగా ఉండేది. నాకు ఇప్పుడు 33 ఏళ్లు. ఇక నాకొచ్చే ప్రతీ ఛాన్స్ ఒక దీవెనలాంటిదే. బౌలర్లు ఎప్పుడు ఐదు వికెట్లు సాధించిన అది వారికి ఎక్కువ సంతోషాన్ని తీసుకొస్తుంది. నేను ఆ తరహా బౌలర్‌ని అని కచ్చితంగా చెప్పగలను. ఎవరైనా బ్యాట్స్ మెన్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పుడు వారి వికెట్ తీస్తే చాలా ఆనంద పడతా. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఎంజాయ్ చేస్తా. మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడంపైనే నా దృష్టి ఉంది. గడిచిన మూడేళ్లలో బీసీసీఐ నుంచి రెండు అవార్డులు తీసుకున్నా. 2014-15 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రమంలో అత్యుత్తమ బౌలర్ అవార్డును బీసీసీఐ నుంచి అందుకున్నా. 2013-14 సీజన్ లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డును కూడా అందుకున్నా. ప్రదర్శన పరంగా నాపై ఎటువంటి అనుమానం లేదు. భారత జట్టులోకి వస్తా. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా'అని వినయ్ కుమార్ తెలిపాడు. భారత్ జట్టులో 2013లో చివరిసారి కనిపించిన వినయ్ కుమార్..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 430కి పైగా వికెట్లు సాధించాడు. -
హైదరాబాద్ లో విద్యార్థి అదృశ్యం
ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన రామారావు కుమారుడు వినయ్‌కుమార్(18) కూకట్‌పల్లిలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నాడు. ఈ నెల 11న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టెన్త్ విద్యార్థి మృతిపై తల్లిదండ్రుల ఆందోళన
కృష్ణా జిల్లా కంచికచర్లలోని గౌతమీ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుకున్న వినయకుమార్ అనే విద్యార్థి ఈనెల 22వ తేదీ అనుమానాస్పదస్థతిలో మృతిచెందాడు. అప్పుడు అనుమానాస్పదస్థితి మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే తమ కుమారుని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ సోమవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాలవద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్ : రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేయాలని రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక తీర్మానించింది. ఈ పోరాటంలో జాతీయస్థాయిలో మేధావులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయ నిపుణుల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక అరండల్‌పేట 2వ లైనులోని వైన్ డీలర్స్ కల్యాణ మండపంలో రాజకీయ పార్టీలు, రైతు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కన్వీనర్ వి. లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే), డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఎం నాయకురాలు పుతుంబాక భారతి తదితరులు హాజరై రైతు ప్రయోజనాల పరిరక్షణ, ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన అంశాలపై ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఇంతటి దారుణం చూడలేదు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నడూ ఇటువంటి దారుణ పరిస్థితులను చూడలేదు. రైతు వ్యతిరేకి అనే బ్రాండ్‌ను చంద్రబాబు కొనసాగిస్తున్నారు. అధికార బలంతో బాబు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం ద్వారానే గట్టిగా గుణపాఠం చెప్పాలి. తమకు దిక్కెవరూ లేరని దీనంగా భూములు అప్పగించిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి న్యాయ పోరాటం చేయాలి -మక్కెన మల్లికార్జునరావు,డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వమే దోపిడీదారులా వ్యవహరిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి సాధారణంగా కష్టం వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరతాం. అదే ప్రభుత్వమే దోపిడీదారుగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రైతుల తరపున పోరాడితే రాజకీయాలను ఆపాదించడం ప్రభుత్వానికి తగదు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దారుణాన్ని మేధావుల దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటానికి దిగుతాం. -కొరివి వినయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌కు సాటిరాని సింగపూర్ సింగపూర్ పేరు చెప్పి గొప్పలు పోతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్ ఏ విషయంలోనూ సాటిరాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్లు హామీతో బాండ్లు ఇస్తామంటున్నారు. అసలు పదేళ్ల పాటు అధికారంలో ఉంటామని చంద్రబాబుకు అంత నమ్మకం ఉందా. తరతరాలుగా సాగులో ఉన్న భూములను బలవంతంగా లాక్కొని తిరిగి వారికే భిక్ష వేసినట్లుగా గజాలు చొప్పున స్థలం ఇస్తామంటున్నారు. -పుతుంబాక భారతి, సీపీఎం మహిళా నాయకురాలు రాజధానిని 2,500 ఎకరాల్లో నిర్మించవచ్చు 2500 ఎకరాల్లో నిర్మించగలిగే రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఏ నిపుణుల కమిటీ చెప్పింది. పర్యాటకులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న సింగపూర్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. భూములు ఇవ్వని వారిని సైతం కలుపుకుని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చడం చూస్తుంటే భవిష్యత్‌లో వారి నుంచి భూములను బలవంతంగా లాక్కోవాలనే ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తోంది. -ప్రొఫెసర్ శ్రీరామచంద్రయ్య, సెంటర్ ఫర్ ఎకనామిక్స్, హైదరాబాద్ రైతుల భూములు అమ్మి రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణానికి అవసరమున్నా లేకపోయినా రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములను సేకరించింది. తిరిగి వాటిని విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ధోరణి కనిపిస్తోంది. ప్రతి కట్టడంలో కొంత చొప్పున మిగుల్చుకుని ధనార్జన చేయనున్నారు. ఇదే రాజధానిని పంట పొలాల్లో కాకుండా ప్రభుత్వ భూముల్లో ఎందుకు కట్టకూడదో చెప్పాలి. -కె.విజయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రతిపక్ష నేత మాట్లాడితే వ్యక్తిగత విషయాలను ఆపాదిస్తున్నారు రాష్ట్రంలో సీఎం పదవి అనుభవిస్తున్న చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిలదీస్తున్న ప్రతిపక్షనేతపై వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం ఎంత వరకూ సమంజసం. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటారా. రాజ్యాంగాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -చిట్టిపాటి వెంకటేశ్వర్లు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రైతులు భయపడాల్సిన పనిలేదు తుళ్ళూరులో రాజధాని నిర్మాణం పేరుతో సారవంతమైన భూములను సమీకరించే ప్రక్రియలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. సొంత అజెండాతో వ్యవహరిస్తోంది. రాజధాని నిర్మాణానికి రైతులను భయపెట్టి జరిపిన భూ సమీకరణ రాజ్యాంగ బద్ధం కాదు. రైతులు ఆందోళణ పడవద్దు. ఇది ఏ దశలోనైనా ఆగిపోవచ్చు. రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతుల పక్షాన న్యాయ పోరాటం చేయాలి. -జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పంట పొలాల్లో రాజధాని నిర్మాణం తగదు బలవంతపు భూ సమీకరణ ద్వారా సమీకరించిన భూములను తిరిగి శ్రామిక రైతులకే అప్పగించాలి. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లోనే రాజధాని నిర్మాణం చేయాలి. 2013 భూ సేకరణ చట్టానికి తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. బహుళ పంటల భూములను రాజధాని పరిధి నుంచి తప్పించాలి. -వి.లక్ష్మణ రెడ్డి, కన్వీనర్, రాజధాని ప్రాంత రైతు, కూలీల పరిరక్షణ వేదిక రైతుల పక్షాన న్యాయ పోరాటం రాజధాని నిర్మాణానికి ఇష్టారాజ్యంగా భూములు సమీకరించిన ప్రభుత్వం అసెంబ్లీలో సైతం ఏకపక్షంగా వ్యవహరించే ప్రమాదముంది. పార్లమెంటులో బీజేపీ బలంతో భూ సమీకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే, రాజ్యసభలో అడ్డుకునేందుకు సభ్యులు కృషి చేయాలి. రైతుల హక్కుల పరిరక్షించేందుకు న్యాయ పోరాటం చేస్తాం. -ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే అండగా నిలబడితే రాజకీయం చేస్తున్నామన్నారు. పంట భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలబడితే రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి ఎమర్జెన్సీని తలపిస్తోంది. భూములు ఇస్తే సరి, లేకుంటే మేమే తీసుకుంటామంటూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. పచ్చటి పంట పొలాలను బీడు భూములుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. -మర్రి రాజశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేధావులు, న్యాయనిపుణులను కూడగట్టుకోవాలి ప్రభుత్వ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా జాతీయస్థాయిలో మేధావులు, న్యాయ నిపుణులను కూడగట్టుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ విస్మయం వ్యక్తం చేశారు. రాజధానికి భూములను అప్పగించిన రైతులను ఏప్రిల్ నుంచి పంటలు వేసుకోవద్దనడం దారుణం. రాజధాని నిర్మాణం చేపట్టేవరకు పంట వేసుకోకుండా నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదు. -అంబటి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
పదవుల కోసం పట్టు
ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఒత్తిడి కేపీసీసీ చీఫ్‌తో సీఎం మంతనాలు తొలగింపు జాబితాలో శామనూరు, శ్రీనివాసప్రసాద్, వినయ్‌కుమార్ సొరకె, కిమ్మనె పరిశీలనలో ఎస్ఎస్ మల్లికార్జున, అరకలగూడు మంజు, కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కోసం పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఉప ఎన్నికలకు ముందే మంత్రి వర్గాన్ని విస్తరించాలని వారు పట్టుబడుతున్నారు. ఇటీవలే అనేక మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయం కృష్ణాలో ఆయనను కలుసుకుని తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ సమావేశాలు వచ్చే వారం ముగియనున్నాయి. అనంతరం మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ , కార్పొరేషన్లు, బోర్డులకు నియామకాలపై అధిష్టానంతో చర్చించడానికి వారు ఉభయులూ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కన్నా పునర్వ్యవస్థీకరణపైనే సీఎం ఆసక్తి చూపుతున్నారు. సరిగ్గా పని చేయని కొందరు మంత్రులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. మంత్రులు శామనూరు శివశంకరప్ప, శ్రీనివాస ప్రసాద్, వినయ్ కుమార్ సొరకె, కిమ్మనె రత్నాకర్‌లను తొలగించాలనుకుంటున్నారు. వయో భారంతో అవస్థలు పడుతున్న శివశంకరప్ప తన స్థానంలో తన కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. సీఎం కూడా ఆయన విన్నపం పట్ల సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఆమాత్య యోగం పట్టబోతుందనుకున్న వారి జాబితాలో అరకలగూడు మంజు, కేబీ. కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కూడా తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు. గత ఏడాది ఆయన అయిష్టంగానే ఈ పదవిని చేపట్టారు. ఒక వేళ ఆయన కోరుకున్నట్లు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే, బసవరాజ రాయరెడ్డి కొత్త స్పీకర్ అయ్యే అవకాశాలున్నాయి. శాసన సభ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, పరమేశ్వరలు అధిష్టానంతో జరిపే చర్చల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. -
ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...
డాక్టర్ సలహా నా వయసు 30. సమయానికి భోజనం చేయడం కుదరదు. ఈ మధ్య తరచూ గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. రెండు నెలలుగా గొంతులో మార్పులు వచ్చాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్య ఏమిటో తెలియడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని తెలుపగలరు. - ఎస్. వికాస్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి పరిశీలిస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అనిపిస్తోంది. మన ఆహారపుటలవాట్లు, సమయ నియంత్రణ, మారుతున్న జీవనవిధానాల వల్ల చాలామందిలో ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఆహారం జీర్ణం అయ్యే పక్రియలో ఉపయోగపడే ఆమ్లాలు అవసరానికి మించి ఉత్పత్తి కావడం, అవి పైకి ఉబికి గొంతు భాగంలోకి రావడం జరుగుతుంది. ఇది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఈ కింది లక్షణాలను ఒకసారి గమనించండి ఉదయం నిద్రలేవగానే నోటిలో ఏదో చేదుగా అనిపించడం ఛాతీలో మంట పొడిదగ్గు భోజనం తర్వాత, లేదా పడుకున్న తర్వాత దగ్గు గొంతులో నుంచి కఫం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం అలసట త్రేన్పులు రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక స్వరంలో మార్పులు, గొంతులో నొప్పి లేదా మంట మింగడంలో ఇబ్బందులు. పై లక్షణాల్లో ఏదైనా మీకు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ నిపుణులను సంప్రదించండి. వారి సూచన మేరకు గొంతు పరీక్షలు, ఎండోస్కోపీతోపాటు మరికొన్ని పరీక్షలు అవసరం. వారి సూచనల మేరకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ సమస్యకు యాంటీ ఎసిడిటీ మందులతోపాటుగా ఆహార నియమాలను సరిగా పాటించడం చాలా అవసరం. ఉదయం 8 గంటలకు ఉపాహారం మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం రాత్రి 8 గంటలకు భోజనం తీసుకోవాలి. రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. భోజనాన్ని నెమ్మదిగా ఎక్కువసేపు నములుతూ తినాలి. పులుపు, కారం, మసాలా, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, చాక్లెట్లు, కాఫీ, పిప్పరమెంట్లు, ఉల్లిపాయలు వంటివి తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికీ నిద్రకు మధ్య 2-3 గంటల విరామం ఉండాలి. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు -
హైకోర్టు ఆదేశాలకు లోబడే ‘అక్రమ-సక్రమ’
మంత్రి వినయ్ కుమార్ సొరకె వెల్లడి .. పట్టణ, గ్రామాల్లోని అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తాం ఆ మేరకు రెవెన్యూ చట్టంలో సవరణలు ఇకపై అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు పట్టణాల్లో పరిశుభ్రత, తాగునీటికి రూ.700 కోట్లతో పథకం మహానగర పాలికెలుగా రామనగర, చెన్నపట్టణ ! పాలికెలలో ఖాళీలు దశల వారీగా భర్తీ సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ‘అక్రమ-సక్రమ’ను హైకోర్టు ఆదేశాల మేరకు అమలు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్ కుమార్ సొరకె తెలిపారు. వికాస సౌధలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో 2013 అక్టోబర్ 19 లోపు అక్రమంగా నిర్మించిన భవనాలను జరిమానా విధించి క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. దీనిపై రెవెన్యూ చట్టంలో కొన్ని సవరణలు కూడా చేశామన్నారు. దీనిని హైకోర్టుకు నివేదించామన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు రాజకీయ నాయకులతో పాటు కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులూ కారణమన్నారు. ఇక మీదట ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేయనున్నామని తెలిపారు. కాగా పట్టణాల్లో పరిశుభ్రత, మంచినీటి సరఫరా కోసం రూ.700 కోట్లతో కొత్త పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గుల్బర్గ, హుబ్లీ, ధార్వాడ నగరాల్లో 24 గంటలూ నీటి సరఫరాకు వీలుగా ఓ పథకం రూపొందించనున్నామన్నారు. రామనగర, చన్నపట్టణలను మహానగర పాలికెలుగా స్థాయి పెంచే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. పట్టణాల్లో నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధీకరణ కోసం రూ.250 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మహానగర పాలికెలలో ఖాళీగా ఉన్న దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. -
సిట్టింగ్ రంగ
కాంగ్రెస్ జాబితా.. పదిచోట్ల సిట్టింగ్‌లకే మళ్లీ చాన్స్ దానం, ముఖేష్ పాత స్థానాల నుంచే పోటీ శంకర్రావు, సబితకు దక్కని అవకాశం రాజేందర్, మైనంపల్లికి కలిసిరాని ఫిరాయింపు పాతబస్తీలో కొత్త వారికే టికెట్లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. పాత అభ్యర్థులకే పెద్దపీట వేసింది. గ్రేటర్ పరిధిలోని 24 శాసనసభ స్థానాల్లో పది స్థానాలను.. వాటికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారికే కేటాయించింది. మరో పది చోట్ల పూర్తిగా కొత్త ముఖాలను బరిలోకి దించింది. ఇప్పటికే రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలం కలిగిన వి.హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాన్ని కేటాయించింది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌లో అవకాశమిచ్చింది. మహేశ్వరం, కంటోన్మెంట్ సీట్ల విషయంలో ఒకింత సంచలనానికి తావిచ్చింది. ఈ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ శంకర్రావుకు మొండిచేయి చూపింది. మల్కాజిగిరి సీటును జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నందికంటి శ్రీధర్‌కు కేటాయించింది. ఈ శాసనసభ స్థానం కోసం పోటాపోటీగా టీఆర్ఎస్, టీడీపీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, మైనంపల్లి హన్మంతరావుకు రిక్తహస్తమే మిగిలింది. కూకట్పల్లి స్థానానికి సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరకు ప్రజారాజ్యం నుంచి పాత బోయిన్పల్లి కార్పొరేటర్‌గా గెలిచిన ముద్దం నర్సింహయాదవ్ పేరు ఖరారైంది. ఇక, స్థాన మార్పిడి కోసం యత్నించినా.. దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌కు పాత (ఖైరతాబాద్, గోషామహల్) స్థానాలే దక్కాయి. సికింద్రాబాద్ స్థానం కోసం అనేక మంది పోటీపడ్డా సినీ నటి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ పట్లే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు స్థానాల్లో సిట్టింగ్‌లే మళ్లీ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. ఉప్పల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డికి కేటాయించారు. శంకర్రావు, సబితలకు నో ఛాన్స్ అనేక వివాదాలు, విచిత్రకరమైన వ్యవహారశైలికి కేరాఫ్‌గా నిలిచే డాక్టర్ పి.శంకర్రావుకు టికెట్ దక్కలేదు. తనకు బదులు తన కుమార్తె సుష్మిత పేరైనా పరిశీలించాలని ఆయన చేసిన విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోలేదు. ‘ఒక కుటుంబం- ఒక సీటు’ నినాదం దరిమిలా.. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డికి ఎక్కడి నుంచీ అవకాశం ఇవ్వకుండా, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ కేటాయించింది. మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుటుంబ సభ్యులకూ అవకాశం కల్పించలేదు. ముషీరాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న అంజయ్య సతీమణి మణెమ్మ తనకు బదులు కుమారుడు శ్రీనివాసరెడ్డికి అవకాశమివ్వాలని చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. నాంపల్లి, కార్వాన్లలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన వినోద్, రూప్సింగ్లకు ఈసారీ అవకాశం దక్కగా, మలక్‌పేటలో 1986లో కార్పొరేటర్‌గా గెలిచిన దూదిపాల వెంకటనర్సింహారెడ్డికి టికెట్ కేటాయించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా స్థానాల్లో కొత్త వారిని రంగంలోకి దించారు. అభ్యర్థి పేరు:వి. హనుంతరావు తల్లిదండ్రులు: కోటమ్మ, లక్ష్మయ్య పుట్టిన తేదీ: 16.6.1948 విద్యార్హతలు: బీఏ కుటుంబం: భార్య, ముగ్గురు కుమార్తెలు రాజకీయ నేపథ్యం: 1974 నుంచి 78 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. 1982-83లో బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా,1990-92 పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1992 నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. పేరు: ఎం.ముఖేష్‌గౌడ్ తల్లిదండ్రులు: నర్సింహాగౌడ్, లలిత వయసు: 55 ఏళ్లు కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె రాజకీయ నేపథ్యం: 1985లో జాంబాగ్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1989లో మహరాజ్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో 150 ఓట్ల తేడాతో ఓటమి. 1999లో మరోసారి ఓటమి. 2004లో మహరాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహాల్ నుంచి గెలుపు. అభ్యర్థి పేరు:మర్రి శశిధర్‌రెడ్డి తండ్రి: మర్రి చెన్నారెడ్డి వయసు: 59 ఏళ్లు చదువు: ఎంఎస్ కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు చిరునామా: లాలాగూడ, సికింద్రాబాద్. రాజకీయ నేపథ్యం: 1992లో తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 1999లో శ్రీపతి రాజేశ్వర్ (టీడీపీ) చేతిలో ఓటమి. 2004, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: పి.విష్ణువర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు: పి.జనార్ధన్‌రెడ్డి, ఇందిర విద్యార్హత: పాలిటెక్నిక్ నివాసం: దోమలగూడ కుటుంబం: భార్య, ఓ కూతురు రాజకీయ నేపథ్యం: తండ్రి పి.జనార్ధన్‌రెడ్డి మరణానంతరం విష్ణువర్ధన్‌రెడ్డి ఉప ఎన్నికలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందా రు. నియోజకవర్గాల పునర్విభజనలో భా గంగా 2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తండ్రి: జయచంద్రారెడ్డి కుటుంబం: భార్య, ఇద్దరు కొడుకులు పుట్టిన తేదీ: 27-7-1962 విద్యార్హత: బీఏ రాజకీయ నేపథ్యం: 1980లో కాంగ్రెస్ పార్టీ లో చేరిక. 1986 నుంచి 2004 వరకు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, నగర కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శిగా, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004-2008 మధ్య హుడా చైర్మన్‌గా, 2009లో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: మారబోయిన భిక్షపతి యాదవ్ తండ్రి: సందయ్య పుట్టిన తేదీ: 6-1-1956 విద్య: మెట్రిక్యులేషన్ కుటుంబం: భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు రాజకీయ నేపథ్యం: 1970లో కొండాపూర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం శేరిలింగంపల్లి మున్సిపల్ చైర్మన్, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, శేరిలింగంపల్లి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: బండారి లక్ష్మారెడ్డి తండ్రి: జంగారెడ్డి పుట్టిన తేదీ: 27 నవంబర్ 1967 విద్యార్హత: బి.కామ్ చిరునామా: సైనిక్‌పురి, కాప్రా. రాజకీయ నేపథ్యం: ఉప్పల్ సిట్టంగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డికి ఇతను సోదరుడు. జేఎన్టీయూ హెచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అభ్యర్థి పేరు: ముద్దం నర్సింహ యాదవ్ పుట్టిన తేదీ: 31.12.1969 చదువు: 5వ తరగతి కుటుంబం: భార్య,కొడుకు తల్లిదండ్రులు: శంకరయ్య, లక్ష్మమ్మ రాజకీయ నేపథ్యం: కూకట్పల్లి మున్సిపాలి టీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. ప్రజారాజ్యం ఆవిర్భాంతో అందులో చేరారు. 2009లో ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గ్రేటర్ లో పీఆర్పీ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఈయనే. అభ్యర్థి పేరు:నందికంటి శ్రీధర్ పుట్టిన తేదీ: 2-9-1972 విద్యార్హత: బీకామ్ కుటుంబం: భార్య, ఇద్దరు పిల్లలు రాజకీయ నేపథ్యం: అల్వాల్ యూత్ కాం గ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 2000-2005 కౌన్సిలర్‌గాను, ప్రస్తుతం గ్రేటర్ కో ఆష్షన్ సభ్యులుగా ఉన్నారు. మల్కాజిగిరి సీటు హాట్ ఫేవరెట్‌గా మారిన క్రమంలో ఈయన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అభ్యర్థి పేరు: కె.వెంకటేశ్ తండ్రి: ప్రకాశ్ పుట్టిన తేదీ: 9-8-1970 విద్యార్హత: బీకామ్ కుటుంబం: భార్య, కుమారుడు, కుమార్తె రాజకీయ నేపథ్యం: 2006లో ఆంధ్రప్రదేశ్ రాజీవ్ సేవా సమితిని స్థాపించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అభ్యర్థి పేరు: బి.ఆర్.సదానంద్ ముదిరాజ్ తండ్రి: డి.రాములు పుట్టిన తేదీ: 22-6-1976 విద్యార్హత: బీఏ కుటుంబం: భార్య, కూతురు రాజకీయ నేపథ్యం: 1988 నుంచి పార్టీలో క్రీయాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్ఎస్యూఐ గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఫలక్‌నుమా డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయుసీ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అభ్యర్థి పేరు: సయ్యద్ అబ్దుల్ సమీ (అత్తర్) తండ్రి : అబ్దుల్ హమీద్ పుట్టిన తేదీ : 11-6-1971 విద్యార్హత : బీకామ్ కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు రాజకీయ నేపథ్యం: 2002లో కాంగ్రెస్‌లో చేరారు. 2003లో బహదూర్‌పురా నియోజకవర్గం మైనార్టీ కో-ఆర్డినేటర్‌గా, 2005లో కాంగ్రెస్ గ్రేటర్ కమిటీ వైస్ చైర్మన్‌గా, రాజేంద్రనగర్ డిపో ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అభ్యర్థి పేరు: దూదిపాల వెంకట నర్సింహారెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, అనసూయదేవి పుట్టిన తేదీ: 11-1-1955 విద్యార్హతలు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కుటుంబం: భార్య హేమలత, ఇద్దరు కుమారులు రాజకీయ నేపథ్యం: 1977 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. 1986లో మూసారంబాగ్ కార్పొరేటర్‌గా అటు తరువాత యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అభ్యర్థి పేరు: బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తండ్రి: వెంకటస్వామి పుట్టిన తేదీ: 27-05-1964 విద్యార్హత: బీఏ రాజకీయ నేపథ్యం: 1991-97 వరకు రాజేంద్రనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో బండ్లగూడ గ్రామ జాగీర్ సర్పంచ్, నార్సింగ్ వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అభ్యర్థి పేరు: దానం నాగేందర్ తండ్రి: లింగమూర్తి పుట్టిన తేదీ: 9 ఆగస్టు 1958 విద్యార్హత: ఎంఏ నివాసం: బంజారాహిల్స్ రాజకీయ నేపథ్యం: మూడుసార్లు ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా, 2009లో ఖైరతాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ సీటు దక్కిన సిట్టింగ్‌లు.. దానం నాగేందర్= ఖైరతాబాద్ ముఖేష్‌గౌడ్ =గోషామహల్ మర్రి శశిధర్‌రెడి= సనత్‌నగర్ విష్ణువర్ధన్‌రెడ్డి =జూబీహిల్స్ జయసుధ= సికింద్రాబాద్ సుధీర్‌రెడ్డి =ఎల్బీనగర్ భిక్షపతియాదవ్= శేరిలింగంపల్లి కూన శ్రీశైలంగౌడ్= కుత్బుల్లాపూర్ నందీశ్వర్‌గౌడ్= పటాన్చెరు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి =మేడ్చల్ వీరికి తొలిసారి పోటీకి అవకాశం బండారి లక్ష్మారెడ్డి- ఉప్పల్ ఎం.నర్సింహయాదవ్- కూకట్పల్లి నందికంటి శ్రీధర్- మల్కాజిగిరి వినయ్‌కుమార్- ముషీరాబాద్ క్రిషాంక్- కంటోన్మెంట్ అశ్విన్‌రెడ్డి- చాంద్రాయణగుట్ట కె.వెంకటేష్- చార్మినార్ సదానంద్ ముదిరాజ్ -యాకుత్‌పురా అబ్దుల్ సమీ- బహదూర్‌పురా డీవీఎన్‌రెడ్డి- మలక్‌పేట గతంలో పోటీ.. మళ్లీ చాన్స్.. రూప్సింగ్= కార్వాన్ వినోద్‌కుమార్= నాంపల్లి జ్ఞానేశ్వర్ ముదిరాజ్= రాజేంద్రనగర్ వి.హన్మంతరావు= అంబర్‌పేట మహేశ్వరం= సీపీఐ -
వినయ్ కుమార్‌కు మందలింపు...
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఆట నాలుగో రోజు శనివారం కర్ణాటక కెప్టెన్, భారత జట్టు బౌలర్ వినయ్ కుమార్ మందలింపునకు గురయ్యాడు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వేసుకున్న షూస్ నిబంధనలకు అనుగుణంగా లేవని అంపైర్లు అతణ్ని హెచ్చరించారు. అయితే దానిని పట్టించుకోకుండా వినయ్ ఆట కొనసాగించే ప్రయత్నం చేశాడు. దాంతో అంపైర్లు మళ్లీ కలుగజేసుకొని మార్చాల్సిందేనని గట్టిగా చెప్పారు. వాస్తవానికి వినయ్ బ్యాటింగ్ స్పైక్స్ (హాఫ్ స్పైక్స్) వేసుకోవాల్సి ఉండగా... బౌలింగ్ స్పైక్స్ (ఫుల్ స్పైక్స్)తో బ్యాటింగ్‌కు వచ్చాడు. పైగా బ్యాటింగ్ సమయంలో అతను క్రీజ్ నుంచి చాలా బయటికి వచ్చి నిలబడసాగాడు. అతను వేసుకున్న బౌలింగ్ స్పైక్స్ కారణంగా పిచ్ పాడయ్యే ప్రమాదం ఉంది. దాంతో అంపైర్లు కలుగజేసుకున్నారు. మూడో రోజు కూడా అతను స్టాన్స్ తీసుకున్న తీరుపై అంపైర్లు హెచ్చరించారు కూడా. చివరకు సబ్‌స్టిట్యూట్ ద్వారా షూస్ తెప్పించుకున్న వినయ్, వాటిని మార్చుకునే సమయంలో గ్లవ్స్ విసిరి కొట్టి అంపైర్లతో ఏదో అన్నాడు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా, తాను సరిగ్గానే వేసుకున్నానని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందని అడగ్గా... సమాధానం చెప్పకుండా అసహనం వ్యక్తం చేశాడు. -
సకల కళా సంబరం
సంప్రదాయ కళల సమాహారంగా మారింది విశ్వకళా మహోత్సవం. రెండోరోజు కార్యక్రమాలు ఆద్యంతం రసరమ్యంగా సాగింది. కళారంగంలో ఉన్న మాధుర్యాన్ని ప్రేక్షకులకు పంచింది. శనివారం జరిగిన కార్యక్రమాల్లో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, అసోంకు చెందిన వందలాది మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. ప్రారంభోత్సవంలో విశ్వకళా మహోత్సవ కమిటీ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ప్రసంగించారు. పామర్రు/గుడివాడ, న్యూస్‌లైన్ : తమిళనాడుకు చెందిన పాండిచ్చేరి యూనివర్సిటీ డీన్ నేతృత్వంలో దాదాపు 32మంది కళాకారులు గంటపాటు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. తమిళనాడు ఫోక్ డ్యాన్స్, టప్పాటం డ్యాన్స్, కర్హాటం, పెరియ మేళం డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. అసోంలోని గువహతి నుంచి వచ్చిన యువకులు బిహూ డ్యాన్సుతో ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీలక్ష్మీ నరసింహ కోలాట సమాజం వారి జడకోలాటం ఉత్సాహంగా సాగింది. ఒంగోలుకు చెందిన ఆర్.లయ ఈలపాటతో శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్‌కు చెందిన విభూషణం కల్యాణి గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన శంకర నారాయణ హాస్య కార్యక్రమం కడుపుబ్బ నవ్వించింది. తెనాలికి చెందిన ప్రముఖ హరికథా గాయకుడు చందూ భాస్కర్ తన హరికథా గానంతో ప్రేక్షకులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచెత్తారు. పామర్రుకు చెందిన 77ఏళ్ల కళాకారుడు శ్రీకృష్ణుడు వేషధారణలో పౌరాణిక పద్యాలు వినిపించి ప్రశంసలు పొందారు. లాస్య నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మోహన్‌బాబు చేసిన పప్పేట్ షో ఆశ్చర్యపరిచింది. నృత్యేంద్రజాలం పేరుతో రవళి, రవితేజ చేసిన డ్యాన్స్ అలరించింది. సంప్రదాయ నాట్యం నుంచి మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ వరకు దాదాపు ఐదు రకాల వస్త్రధారణతో వారిద్దరూ ఆకట్టుకున్నారు. అంబిక ప్రదర్శించిన రింగ్ డ్యాన్సు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. కళారూపాలను కాపాడండి పామర్రు : రోజూ టీవీ, సెల్ఫోన్లు వాడుతూ ప్రతి ఒక్కరూ కళలకు దూరమవుతున్న ఈరోజుల్లో కళాలను అందరికీ అందించేందుకు ఐఆర్డీఏ పనిచేయడం అభినందనీయమని రామ్కీ ఫౌండేషన్ సీఈవో ఎంవీ రామిరెడ్డి పేర్కొన్నారు. పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణం, సిద్ధేంద్రయోగి కళావేదిక వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన విశ్వ కళామహోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళా రూపాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఐఆర్డీఏ అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణాలలో ఇటువంటి కార్యక్రమాలకు ఆదరణ తక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకళాపరిషత్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరీ, విశ్రాంత ఇన్కమ్ టాక్స్ కమిషనర్ చుక్కా రామస్వామి, ప్రముఖ కళాకారులు శ్రీ కళాకృష్ణ, డాక్టర్ కుసుమ గాయత్రి, బైసాని నాగే శ్వరరావు, సితార్ విధ్వాంసుడు వినోద్, ఫ్రాన్స్ దేశస్తులు డానియేల్ నెజర్సు తదితరులు పాల్గొన్నారు. -
4,200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు. ‘పట్టణాభివృద్ధిలో-నూతన సాంకేతిక అభివృద్ధి వినియోగం’ అనే అంశంపై విధానసౌధలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... సిబ్బంది కొరత వల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమన్నారు. పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టులతోపాటు జలమండలిలోని 402 పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసే చర్యల్లో భాగంగా గ్రామసభల మాదిరి వార్డు సభలు కూడా నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. పట్టణాల్లో భూస్వాధీన ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుండటం వల్ల అభివృద్ధి పనులు నిదానంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా పట్టణ, నగరాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిచడానికి ఉద్దేశించబడిన పథకాలు నత్తనడకన సాగడానికి ఇదే కారణమన్నారు. సమస్య పరిష్కారం దిశగా జలమండలిలో ‘ల్యాండ్ బ్యాంక్’ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అంగీకరించాని తెలిపారు. పట్టణ, నగర సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఈ విషయమై త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన నివాస కట్టడాలు, వాణిజ్య భవనాలను కొంత అపరాధ రుసుంతో క్రయవిక్రయాలకు అనుమతించనున్నామన్నారు. ఈ విధంగా వచ్చిన సొవ ుు్మతో ఆయా సంస్థల పరిధిలో వలికసదుపాయాలు కల్పించనున్నామని మంత్రి విన య్ కుమార్ తెలిపారు. -
వీడిన ‘ఎర్ర జెండాల’ మిస్టరీ
పరకాల, న్యూస్‌లైన్ : దొరల వ్యవసాయ భూముల్లో ఎర్రజెండాలు పాతి, గ్రామాల్లో బ్యానర్లు కట్టిన మిస్టరీని వారం రోజుల్లో పోలీసులు చేధించారు. ఎర్రజెండాలను ఏర్పాటు చేసిన మాజీ నక్సలైట్లను శుక్రవారం అరెస్ట్ చేశారు. పరకాల డీఎస్పీ పి. సంజీవరావు కథనం ప్రకారం... మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ గతంలో గోదావరిలోయ ప్రతిఘటన గ్రూపులో, మిర్యాల రాజు ప్రతిఘటనలో, కొంగంటి రాజయ్య జనశక్తి దళంలో పనిచేశారు. ప్రస్తుతం శంకర్, రాజు ఆటో నడుపుతుండగా, రాజయ్య కూలీకి వెళుతున్నా డు. ఇదే మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పల్లెబోయిన చిరంజీ వి గతంలో న్యూడెమోక్రసీ దళంలో పని చేసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే సంపాదన వారి విలాసాలకు సరిపోవ డం లేదు. దీంతో సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని నలుగు రు మాజీలు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. భూస్వాములు, ధనవంతులతోపాటు ప్రజలను భయపెట్టి వారి నుంచి డబ్బు లు సంపాదించాలనే ఆలోచన చేశారు. ఎక్కువ మొత్తంలో డబ్బులను వసూలు చేసి కొత్త విప్లవ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 7 అర్ధరాత్రి న మండలంలోని కంఠాత్మకూర్, కౌకొం డ, ధర్మారం, నడికూడ, ముస్త్యాలపల్లి, చౌటుపర్తి, రాయపర్తి గ్రామాల్లోని బస్టాం డ్ సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాల కు, దొరల భూముల్లో ఎర్రజెండాలు, బ్యానర్లు కట్టారు. ప్రజలు, భూస్వాముల్లో భయాన్ని సృష్టించడమే లక్ష్యం గా వాటిని ఏర్పాటు చేశారు. ఈ క్రమం లో మండలంలోని నడికూడ-ధర్మారం రోడ్డులో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పై నలుగురు వ్యక్తులు తారాసపడ్డారు. పోలీసుల వాహనాన్ని చూసి పరుగెడుతుండగా వెంబడించి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపా రు. వారిని విచారించగా ఎర్రజెండాల ఘటనకు పాల్పడింది తామేనని వెల్లడించారు. ఎర్రజెండాలను పాతిన వారిని పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
అజయ్ కల్లాం, జవహర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి వినయ్ కుమార్, కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో సీఎం పేషీలోని మిగతా ఉన్నతాధికారుల శాఖల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా వినయ్ కుమార్ స్థానంలో అజయ్ కల్లాం నియమితులయ్యూరు. అజయ్ కల్లాంతోపాటు వురో ఉన్నతాధికారి జవహర్‌రెడ్డికి కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. ఆ వివరాలు ఇవీ.... ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం: సాధారణ పరిపాలన, హోమ్, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, రెవెన్యూ, ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఇంచార్జి, సీఎం కార్యాలయం ఎస్టాబ్లిష్మెంట్, ఇతర అధికారులకు కేటాయించని శాఖలు. ముఖ్యమంత్రి కార్యదర్శి జవహర్‌రెడ్డి: మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, గనులు-భూగర్భవనరుల శాఖ, రవాణా, రహదారులు-భవనాలు, పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాలు, అటవీ పర్యావరణశాఖ-శాస్త్ర సాంకేతిక శాఖ, న్యాయ- శాసనభ వ్యవహారాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయూలు-పెట్టుబడులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం. సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్. రావత్: విద్య, సాంకేతిక విద్య, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, సాగునీరు, ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక. సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎన్. శ్రీధర్: వ్యవసాయం, ఉద్యానవన శాఖ, ఆరోగ్యం, వైద్య విద్య, సహకార-మార్కెటింగ్, పౌరసరఫరాలు, పశుసంవర్థక శాఖ, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి, క్రీడలు-యువజన సర్వీసులు, గృహనిర్మాణం, కార్మిక-ఉపాధి శాఖలు. ముఖ్యమంత్రి ఉప కార్యదర్శి జె. మురళి: ప్రత్యేక అభివృద్ధి నిధి, నియోజకవర్గాల అభివృద్ధి నిధి, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, ఇందిరమ్మ బాట దరఖాస్తుల పర్యవేక్షణ, సమాచార వ్యవస్థ, ముఖ్యమంత్రి మెయిల్స్, దరఖాస్తులు.