
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. ఇప్పటికే సామాన్యులు సహా సినీ ప్రముఖులను సైతం కరోనా పట్టి పీడిస్తుంది. తెలుగు ఇండస్ర్టీలోనూ మరణ మృదంగం కనిపిస్తుంది. తాజాగా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్(65) కరోనాకు బలయ్యారు. గత కొద్ది రోజుల క్రితం కరోనాతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘ఏడంస్తుల మేడ’ సినిమా నుంచి దాసరి నారాయణ రావు వద్ద శిష్యరికం చేసిన ఆయన ‘పవిత్ర’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
అలాగే రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో అంతరంగాలు, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. వినయ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేశారు. ఇక నిన్న (మే12)ఒక్కరోజే ముగ్గురు సినీ ప్రముఖులు చనిపోవడంతో ఇండస్ర్టీలో విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్రశేఖర్.. డబ్బింగ్ ఇంఛార్జ్ కాంజన బాబు సహా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ కన్నుమూశారు.
చదవండి : ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి
సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment