'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!? | Team India Cricketer Vinay Kumar In Bigg Boss 10 Kannada Season | Sakshi
Sakshi News home page

Bigg Boss Show: అప్పుడు క్రికెట్.. ఇప్పుడు బిగ్‌బాస్

Published Fri, Sep 29 2023 6:32 PM | Last Updated on Sat, Sep 30 2023 9:19 PM

Team India Cricketer Vinay Kumar In Bigg Boss 10 Kannada Season - Sakshi

'బిగ్‌బాస్' రియాలిటీ షోలో టీమిండియా స్టార్ క్రికెటర్. అవును మీరు విన్నది నిజమే. గతంలో హిందీ సీజన్‌లో శ్రీశాంత్ పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ దక్షిణాది బిగ్‌బాస్ రియాలిటీ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇంతకీ ఎవరీ ఆటగాడు? ఏంటి సంగతి?

బిగ్‌బాస్‌లోకి ఆ బౌలర్   
బిగ్‌బాస్ షోలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొంటారు. కుదిరితే గెలుస్తారు. లేదంటే మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్‌లో మాత్రం దాదాపుగా అందరూ నటులే వచ్చారు. కానీ అక్టోబరు 8 నుంచి మొదలయ్యే కన్నడ సీజన్‌లో మాత్రం భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!)

కన్ఫర్మే కానీ?
వినయ్ కుమార్.. టీమిండియా తరఫున 31 వన్డేలు, 9 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 48 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, ముంబై, బెంగళూరు జట్లకు ఆడాడు. చివరగా 2013లో జాతీయ జట్టుకు ఆడాడు. 2021లో మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. మరి ఇది నిజమా కాదా? ఒకవేళ హౌసులోకి వస్తే ఏం చేస్తాడనేది చూడాలి?

తెలుగు సీజన్ సంగతేంటి?
తెలుగు సీజన్‌లో ప్రస్తుతం నాలుగో వారం నడుస్తోంది. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయారు. మిగతా 11 మందిలో ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వాళ్లలో రతిక, టేస్టీ తేజ డేంజర్ జోన్‪‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? పవరస్త్ర గెలుచుకునేది ఎవరో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement