సాక్షి, సైదాపూర్(హుస్నాబాద్): అర గుంట భూమి కోసం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. తన చావుకు కారకుల పేర్లు సూసైడ్ నోట్‌లో రాసి, గురువారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని జాగీర్‌పల్లి గ్రామానికి చెందిన కమ్మం వినయ్‌కుమార్(34) ఎంబీఏ పూర్తి చేశాడు. మండల కేంద్రంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపులో ఆరేళ్లు పని చేశాడు. కొన్ని రోజుల క్రితం పని మానేశాడు. అతడి తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు, వ్యవసాయ భూములు పంపకాలు జరిగాయి.
చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..)
ఎవరి భూమి వారు కాస్తు చేసుకుంటున్నారు. కాగా వినయ్‌కుమార్ తండ్రి పెద్దన్నకు 20 గుంటల భూమి పట్టా కావడంలేదు. అంతే కాకుండా ఇళ్ల స్థలం రెండు గుంటలు వినయ్ తాత, మేనత్తకు ఇచ్చాడు. ఆమె తమ్మునికి అమ్ముకుంది. తమ్ముడు మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ రెండు గుంటల్లో తన తండ్రికి అర గుంట రావాలని వినయ్‌కుమార్ కొంతకాలంగా మేనత్త, చిన్నాన్నలపై పోరాటం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో పాటు ఆరేళ్లు తాను పని చేసిన ఫర్టిలైజర్ షాపు యజమాని తనను దొంగగా, మోసగాడిగా ముద్రవేశాడని మనస్తాపం చెందాడు.
చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..)
‘వేణు అంకుల్ నా గోస తగిలి మీరు, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండమంటూ, తన చావుకు బూర్ల భాస్కర్, కమ్మం సమ్మయ్య, కమల, కమ్మం వినీత్, కమ్మం వివేక్, కమ్మం విశాల్, దొడ్డి సురేష్, దొడ్డి గట్టయ్య, కమ్మం చంద్రయ్య, మహెంద్ర, కమ్మం ఉదయ్, కమ్మం కావ్య, గంజి అలేఖ్యలు కారకులని, తన భూములు ఆక్రమించుకున్నారు’ అని సూసైడ్‌లో పేర్కొన్నాడు. మృతుడికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి కమ్మం జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధూకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment