కృష్ణా జిల్లా కంచికచర్లలోని గౌతమీ పబ్లిక్ స్కూల్‌లో పదవ తరగతి చదువుకున్న వినయకుమార్ అనే విద్యార్థి ఈనెల 22వ తేదీ అనుమానాస్పదస్థతిలో మృతిచెందాడు.
కృష్ణా జిల్లా కంచికచర్లలోని గౌతమీ పబ్లిక్ స్కూల్‌లో పదవ తరగతి చదువుకున్న వినయకుమార్ అనే విద్యార్థి ఈనెల 22వ తేదీ అనుమానాస్పదస్థతిలో మృతిచెందాడు. అప్పుడు అనుమానాస్పదస్థితి మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే తమ కుమారుని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ సోమవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాలవద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.