జాంటీ రోడ్స్.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ క్రికెటర్ పేరు వింటేనే అప్పట్లో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఎంతలా అంటే అతను ఫీల్డింగ్ చేస్తున్న చోటుకి బంతిని కొట్టాలంటే స్టార్ ఆటగాళ్లు సైతం భయపడేవారు. అటు అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు మెరుపు రనౌట్లు చేయడంలో అతనికి అతనే సాటి. 1992 ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్ గాల్లో సమాంతరంగా డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేయడం అతని వేగవంతమైన ఫీల్డింగ్‌కు ఒక చక్కటి ఉదాహరణ.