
ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ ఆర్. వినయ్ కుమార్ అంతర్జాతీయం సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు శుక్రవారం గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 'రిటైర్మెంట్ అనే పదం వినడానికి బాధగా ఉన్నా.. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈరోజుతో నా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నా. టీమిండియా తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడడం నా గౌరవంగా భావిస్తున్నా. అనిల్ కుంబకలే, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు.
కాగా వినయ్ కుమార్ టీమిండియా తరపున 2010లో అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20ల్లో 10 వికెట్లతో పాటు ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. కాగా ఐపీఎల్‌లో 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్‌లో పాల్గొన్న వినయ్ కుమార్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. మొత్తం ఐపీఎల్‌లో 105 మ్యాచ్‌లాడి 105 వికెట్లు పడగొట్టాడు. కాగా వినయ్ కుమార్ సారధ్యంలో కర్ణాటక జట్టు 2013-14, 2014-15 రంజీ ట్రోపీ టైటిల్స్‌ను సాధించింది.
చదవండి: 'నా నిర్ణయం వ్యతిరేకిస్తారా.. ఇప్పుడు చూడండి'
Comments
Please login to add a commentAdd a comment