పరకాల, న్యూస్‌లైన్ : దొరల వ్యవసాయ భూముల్లో ఎర్రజెండాలు పాతి, గ్రామాల్లో బ్యానర్లు కట్టిన మిస్టరీని వారం రోజుల్లో పోలీసులు చేధించారు. ఎర్రజెండాలను ఏర్పాటు చేసిన మాజీ నక్సలైట్లను శుక్రవారం అరెస్ట్ చేశారు. పరకాల డీఎస్పీ పి. సంజీవరావు కథనం ప్రకారం... మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ గతంలో గోదావరిలోయ ప్రతిఘటన గ్రూపులో, మిర్యాల రాజు ప్రతిఘటనలో, కొంగంటి రాజయ్య జనశక్తి దళంలో పనిచేశారు.
ప్రస్తుతం శంకర్, రాజు ఆటో నడుపుతుండగా, రాజయ్య కూలీకి వెళుతున్నా డు. ఇదే మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పల్లెబోయిన చిరంజీ వి గతంలో న్యూడెమోక్రసీ దళంలో పని చేసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే సంపాదన వారి విలాసాలకు సరిపోవ డం లేదు. దీంతో సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని నలుగు రు మాజీలు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. భూస్వాములు, ధనవంతులతోపాటు ప్రజలను భయపెట్టి వారి నుంచి డబ్బు లు సంపాదించాలనే ఆలోచన చేశారు. ఎక్కువ మొత్తంలో డబ్బులను వసూలు చేసి కొత్త విప్లవ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 7 అర్ధరాత్రి న మండలంలోని కంఠాత్మకూర్, కౌకొం డ, ధర్మారం, నడికూడ, ముస్త్యాలపల్లి, చౌటుపర్తి, రాయపర్తి గ్రామాల్లోని బస్టాం డ్ సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాల కు, దొరల భూముల్లో ఎర్రజెండాలు, బ్యానర్లు కట్టారు. ప్రజలు, భూస్వాముల్లో భయాన్ని సృష్టించడమే లక్ష్యం గా వాటిని ఏర్పాటు చేశారు.
ఈ క్రమం లో మండలంలోని నడికూడ-ధర్మారం రోడ్డులో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పై నలుగురు వ్యక్తులు తారాసపడ్డారు. పోలీసుల వాహనాన్ని చూసి పరుగెడుతుండగా వెంబడించి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపా రు. వారిని విచారించగా ఎర్రజెండాల ఘటనకు పాల్పడింది తామేనని వెల్లడించారు. ఎర్రజెండాలను పాతిన వారిని పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.