
ఓంకార్ మృతదేహం
పరకాల/రేగొండ : బైక్ అదుపు తప్పి వంతెనకు ఢీకొనడంతో వాగులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పరకాలలో ఆదివారం చోటుచేసుకుంది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కన్నెవెన ఓంకార్ ద్విచక్ర వాహానంపై పరకాల నుంచి తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో పట్టణ శివారులోని చలివాగు వంతెనపై రెయిలింగ్‌కు ద్విచక్ర వాహనం రాడ్(ఫుట్ రెస్ట్ ) తగిలింది. దీంతో బైక్ రోడ్డుపై పడిపోగా ఓంకార్ ఎగిరి వాగులోని బండ రాయిపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఓంకార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి సోదరుడు సుమన్‌కు తీవ్రగాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మృతుడికి ఏడాది క్రితమే నాగలక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్‌లైన ఏడాదికే భర్తను కోల్పయిన నాగలక్ష్మి.. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలిచివేసింది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఓంకార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ఆస్పత్రికి తరలించారు. కాగా కొన్నేళ్ల క్రితం ఓంకార్ తండ్రి ఓదెలు కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఇద్దరి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment