parakala
-
పరకాలలో జరిగిన అభివృద్ధే మళ్లీ నన్ను గెలిపిస్తుంది: చల్ల ధర్మారెడ్డి
-
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
నాటి తెలంగాణ పోరాటానికి ప్రతీక పరకాల అమరధామం
-
ఆ రోజు నేను తప్పించుకున్నా..
పరకాల: తెలంగాణ సాయుధ పోరాటంలో 1947 సెప్టెంబర్ 2న పరకాలలో జరిగిన పోరాటం చిరస్మరణీయంగా నిలిచింది. ఎంతో మంది ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల రక్తసిక్తమై నేటికి 76 ఏళ్లు. మరో జలియన్‌వాలా బాగ్గా పిలిచే నాటి పోరాటంలో పాల్గొన్న వ్యక్తి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన 98 ఏళ్ల పోలీస్‌పటేల్ రేగూరి చంద్రారెడ్డి. పోలీస్‌గా పనిచేసిన ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్శితులై నిజాం సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. పరకాలలో ఆ రోజు ఏం జరిగింది? అంత మారణహోమం జరగడానికి దారి తీసిన పరిస్థితులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణలో రజకార్ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయేది. గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్రహారాలు మానేవారు. ఎప్పుడు ఏ గ్రామంపైనా.. ఎవరిని ఏం చేస్తారో తెలియని భయానక వాతావరణం ఉండేది. నేను నిజాం సర్కార్‌లోనే పోలీస్ పటేల్‌గా పనిచేసేవాడిని. అప్పటి పరిస్థితులను చూసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మారుపేరు రంజిత్‌తో తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కేవీనర్సింగరావుకు సన్నిహితమయ్యా. వారి పోరాట కార్యాచరణలో భాగస్వాముడినయ్యా. సాయుధ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకార్ల ఆగడాలపై సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. మూడు కిలోమీటర్ల పొడవుతో ఊరేగింపు ఆ రోజు 1947 సెప్టెంబర్ 2. అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు నిజాం నిరంకుశ పాలనను, రజకారులను ఎదిరిస్తూ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక గ్రామాలనుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. యూనియన్ పతాకాలు, వడిసెలు, చేతి కర్రలు పట్టుకుని పతాక వందనానికి కదం తొక్కారు. తొలుత చాపలబండ నుంచి దగ్గు వీరగోపాల్‌రావు నాయకత్వాన ఊరేగింపు నిర్వహించాం. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన మా ఊరేగింపులో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినాదాలు చేశాం. గర్జించిన నిజాం పోలీసుల తుపాకులు మా ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. రజాకారులు కత్తులు, బరిసెలతో సిద్ధమై ఉన్నారు. తహసీల్దార్ విష్ణువేశ్వర్‌రావు ఊరేగింపు వద్దకు వచ్చి వెనక్కి తిరిగి రావాల్సిందిగా మా అందరికి (ఉద్యమకారులకు) హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తహసీల్దార్ అనుమతి మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతిలోని పిస్తోల్ ధన్మని పేలడంతో నిజాం పోలీసుల తుపాకులు గర్జించాయి. మా కంటే ముందు వరుసలో ఉన్న శ్రీశైలంతోపాటు అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాపలబండ ప్రాంతం రక్తంతో తడిసిముద్దయింది. అక్కడినుంచి నేను తప్పించుకున్న. వారం రోజులకు నన్ను దొరకబట్టి చిత్రహింసలకు గురిచేశారు. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. నాటి ఉద్యమ ఫలితంగా తెలంగాణకు విముక్తి లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. -
పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!
పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజకీయపరమైన అంశాలు : పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నిరుద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు ధరణి పోర్టల్ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ కొండ సురేఖ (ఆశావాహులు) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు) బీజేపీ పార్టీ పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు మేజారిటీ ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. చలివాగు ఉంది చంద్రగిరిగుట్టలు చెన్నకేశవ స్వామి జాతర కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర -
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట లభించింది. అనుమతులు లేకుండా పరకాలలో సభ నిర్వహించి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు షర్మిల, విజయమ్మపై నమోదైన కేసును కొట్టేసింది. (చదవండి: వైఎస్ విజయమ్మ సైకత శిల్పం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టేసింది. చదవండి: నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి -
ఇది ‘తెలంగాణ జలియన్‌వాలాబాగ్’
సాక్షి, హైదరాబాద్: మూడు కిలోమీటర్ల భారీ మానవహారం. సమీప ఊళ్ల నుంచి పోగైన నాలుగు వేలమంది ముందుకు కదులుతున్నారు. చేతుల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా, వందేమాతరం, నిజాం వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. వారు జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిన మైదానం సమీపంలోకి రాగానే నిజాం పోలీసులు, రజాకార్లు విరుచుకుపడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు పారిపోతున్నవారిపై కత్తులతో దాడి.. చూస్తుండగానే రణరంగమైందా ప్రాంతం. 15 మంది అక్కడికక్కడే చనిపోగా, పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరో ఎనిమిది మంది అసువులుబాశారు. ఇది పాశవిక నిజాం సైన్యం సృష్టించిన నరమేధం. తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో నిలిచిపోయిన రక్తపుమరక. బ్రిటిష్ సైన్యం దేశభక్తులపై విచక్షిణారహితంగా కాల్పులు జరిపి వందలమందిని పొట్టనపెట్టుకున్న జలియన్ వాలాబాగ్ నరమేధాన్ని పోలిన ‘తెలంగాణ జలియన్ వాలాబాగ్’ ఘటన. సొంత హవా కోసం తహతహలాడి బ్రిటిష్ పాలకులకు తొత్తుగా మారి జనానికి ప్రత్యక్ష నరకం చూపిన నిజాం పాలనకు ఇదో ఎర్రటి గుర్తు. అలనాటి భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోని ఆ ప్రాంతం పరకాల. ఘటన జరిగింది 1947 సెప్టెంబరు 2. సరిగ్గా నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన ఘటన ఇది. స్మారకం ఏదీ? స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందే ఈ పరకాల ఘటనకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వరకు పరకాలలో కనీసం స్మారకం కూడా లేదు. అప్పట్లో చిన్నస్తూపం, చనిపోయినవారి పేర్లతో ఫలకం మాత్రం ఏర్పాటుచేశారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేత విద్యాసాగరరావు తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ ఓ స్మారకాన్ని నిర్మించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఆరోజు చేయిచేయి పట్టుకుని మానవహారంగా వచ్చిన అమరవీరులకు గుర్తుగా అక్కడ ర్యాలీగా వెళ్తున్నట్లుగా మనుషుల బొమ్మలు ఏర్పాటు చేయించారు. జలియన్ వాలాబాగ్‌తో పోల్చదగింది పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్‌లో దేశభక్తులపై కాల్పులు జరిపించి వందలమంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్ రాక్షసత్వానికి, పరకాలలో ‘జాయిన్ ఇండియా’ ఉద్యమంలో రాక్షసంగా వ్యవహరించి పదుల సంఖ్యలో పోరాట యోధుల మృతికి కారణమైన నిజాం పోలీసు సీఐ జియాఉల్లా ఉన్మాదానికి పోలిక ఉంది. చరిత్రలో పరకాల మరో జలియన్ వాలాబాగ్‌గా నిలిచిపోయింది. కానీ చాలామందికి నాటి గాథ తెలియకపోవటం విచారకరం. ఇక్కడి స్మారకాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. – రాచర్ల గణపతి, చరిత్ర విశ్లేషకుడు -
పాఠశాలలో నాగుపాము కలకలం
చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట హైస్కూల్లో పాము కలకలం రేపింది. పాఠశాలలోని ఓ గదిలో నాగుపాము దర్శనమిచ్చింది. బుధవారం అన్ని గదులు శానిటైజర్ చేశారు. తొమ్మిదో తరగతి గదిని గురువారం శానిటైజర్ చేయడానికి తలుపులు తీయగా ఆ గదిలో నాగుపాము కనిపించింది. ఇన్ని రోజులు పాఠశాలలు తెరిచి లేకపోవడంతోనే పాము కిటికి నుంచి లోపలకి వచ్చి ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం పామును సురక్షింతంగా పంట పొలాల్లోకి వెళ్లగొట్టినట్లు హెచ్ఎం స్వామి, వేణు, నాగరాజు, ఎస్ఎంసీ చైర్మన్ జాటోత్ యాకూబ్, జీపీ సిబ్బంది జున్న శ్రీను, తదితరులు ఉన్నారు. -
ఫ్రిజ్‌లో వృద్ధుడి శవం.. డబ్బుల్లేక మనవడే..
-
ఉద్రిక్తంగా ‘పరకాల జిల్లా పోరాటం’.. పోలీసుల దాడి
పరకాల: రజాకార్లను తరిమికొట్టిన పోరాటాల గడ్డగా పేరొందిన పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ‘పరకాల జిల్లా సాధన సమితి’ ప్రతినిధులు శనివారం ఆందోళన కొనసాగించారు. పది రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులు శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం కూడా మద్దతు ప్రకటించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా పరకాలలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు వారిపై దాడులు చేశారు. వారి నిరసనను తీవ్రంగా అణచివేస్తున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులను పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్‌స్టేషన్‌కు లాకెళ్లారు. పోలీసుల దౌర్జన్యంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మహేందర్ రెడ్డి తీరు సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తోంది. ఉద్యమం నేపథ్యం పరకాల డివిజన్‌ను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని పరకాలవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా అనుమకొండ జిల్లా ప్రస్తావన తెరపైకి వచ్చిన తర్వాత పరకాల రెవెన్యూ డివిజన్లో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను హనుమకొండలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలింది పరకాలలో దామెర, నడికూడా మండలాలు మాత్రమే. ఈ రెండు మండలాలతో పరకాలను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించడం సాధ్యపడుతుందా లేదా డివిజన్ కూడా కనుమరుగు చేస్తారా అనే అనుమానం ఏర్పడింది. ఈ సమయంలోనే రాష్ట్రంలో మళ్లీ జిల్లాల విభజన వార్తలు రావడంతో పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నారు. గతంలోనూ ఉద్యమం చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదనే ఆరోపణ ఉంది. అప్పట్లో కేవలం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ జిల్లా ప్రకటిస్తారనే వార్తలు రావడంతో పరకాల జిల్లా ఉద్యమం ఊపందుకున్నది. అందులో భాగంగానే శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. -
కరోనా విషాదం: కోట్ల ఆస్తి ఉన్నా తీరని చివరి కోరిక
సాక్షి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఓ బంగారం వ్యాపారి (48) కరోనాతో వారం రోజులపాటు పోరాడి బుధవారం మృతి చెందాడు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన తాను మృతిచెందాక రేగొండ మండలం దమ్మన్నపేటలో ఉన్న ఎర్రచందనం వనంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు దమ్మన్నపేటకు చేరుకోగా, ఆ గ్రామస్తులు సరిహద్దులోనే అడ్డుకున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు తమ గ్రామంలో నిర్వహించవద్దని తేల్చి చెప్పారు. గుంత తవ్వకానికి జేసీబీ డ్రైవర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో మళ్లీ మృతదేహాన్ని పరకాల శివారు చలివాగు ఒడ్డున ఉన్న శ్మశాన వాటికకు తీసుకొచ్చి దహనం చేశారు. మృతుడికి పరకాల పట్టణంలో మూడు చోట్ల రూ.కోట్ల విలువైన మూడంతస్తుల భవనాలతో పాటు, వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రూ.కోటి విలువైన భవన సముదాయం ఉంది. (చదవండి: మాస్కు ధరించలేదని చిన్నారులతో కప్పగంతులు) -
కరోనాతో మృతి: కన్న కూతురే అంత్యక్రియలకు రాలే
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి రాజిపేటలో ఓ వృద్ధురాలు (75) కరోనాతో శనివారం మృతి చెందింది. స్థానికంగా ఉండే ఆమె ఏకైక కుమార్తెకు విషయం తెలిసినా రాకపోగా మిగతా బంధువులూ స్పందించలేదు. దీంతో కౌన్సి లర్ దామెర మొగిలి మున్సిపల్ సిబ్బంది సాయం తో మృతదేహాన్ని ఖననం చేయించారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని ట్రాక్టర్లో శ్మశాన వాటికకు తరలించి ఖననం చేశారు. చదవండి: షాకింగ్: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య -
విషాదం నింపిన అమెరికా పర్యటన..
పరకాల/ వరంగల్: కొడుకు కుటుంబంతో కొన్నాళ్లు గడుపుదామని అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం రాత్రి 9గంటల (అమెరికాలో తెల్లవారుజామున 4గంటలు)కు జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) హన్మకొండ గోపాలపూర్‌లో నివాసముంటూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్. మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు పవన్‌కుమార్ వద్దకు రాజమౌళి తన భార్య తో కలసి మార్చి 5న వెళ్లాడు. న్యూయార్క్, వాషింగ్టన్‌లను కారులో కొడుకుతో వెళ్లి సందర్శించారు. ఈ క్రమంలో, ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై నివాసానికి రెండు మైళ్ల దూరం లో ఉండగా వర్షానికి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో కారులోని నలుగురూ సురక్షిత మని భావించి పవన్‌కుమార్, డ్రైవింగ్ చేస్తున్న ఆయన మిత్రుడు కారు దిగి పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమను కాపాడేందుకు పవన్ ప్రయత్నించాడు. తల్లి ప్రాణాలతో బయటపడగా, తండ్రి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం సంగతి పరకాలలోని బంధువులకు తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు
సాక్షి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. కొన్ని కులాల ఉద్యోగులపై ఆయన వాడిన పదాలు మంటలు రేపుతున్నాయి. ఓసీ జేఏసీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుండగా, నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్‌కే పరిమితమైన ఆందోళనలు బుధవారం తెలంగాణలోని పలు జిల్లాలను తాకాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లగా, బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు పరకాల బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల బాధ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ) శాంతించని సంఘాలు వరుస వివాదాలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు వేదికలుగా మారాయి. పరకాలలో జరిగిన ఓ సమావేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట నిధుల సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తొలుత వివాదాస్పదమయ్యాయి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, విరాళాలు సేకరిస్తున్న నేతలే జేబులు నింపుకుంటున్నారని అన్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం అట్టుడికిపోగా, హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలోనూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో వివాదానికి తెరలేపారు. ‘ఆ కులాల అధికారులకు అక్షరం ముక్క రాదు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అనడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆందోళనలకు దిగారు. ‘సారీ’తో ఆగని ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ‘ఆ సమావేశంలో నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆ మాటలు ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నా’ అని అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దీంతో వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ తమ మనోభావాలకు సంబంధించిన అంశంగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ఉద్యోగసంఘాలు ఆందోళనలను కొనసాగిçస్తున్నాయి. కాగా, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యల వివాదం సమయంలో స్పందించిన టీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో స్తబ్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా బీసీ, దళిత వర్గాల ఉద్యోగులను అవమానపరిచేలా పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయంటూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. -
ఓరుగల్లులో హోరాహోరీ..
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంద్, అరెస్టులు, పోటాపోటీ కార్యక్రమాలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు హోరెత్తించారు. ఆదివారం అర్ధరాత్రి పరకాలలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా టీఆర్ఎస్ పరకాల బంద్‌కు పిలుపునివ్వడం.. మరోవైపు బీజేపీ నేతల అరెస్టులతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే చల్లా వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలోని ఆయన ఇంటిపై ఆదివారం బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం.. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి దిగిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. చదవండి: గ్రామ సింహాలు.. పరుగో పరుగు రాముడిని అవమానపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేయగా.. రాముని పేరుతో రాక్షస పనులు చేస్తే తమ కేడర్ చూస్తూ ఊరుకోదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. అంతకుముందు వారు ఎమ్మెల్యే చల్లా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాగా, హన్మకొండకు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఆలేరులో, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను జనగామ బైపాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకుల ఇళ్లు, రెండు పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం 44 మందికి రిమాండ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. తమ నాయకులను వదిలిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య హన్మకొండ కోర్టుకు తీసుకెళ్లారు. బీజేపీ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ సహా 44 మందిని సోమవారం కోర్టులో పరచగా.. న్యాయమూర్తి ఈనెల 15 వరకు రిమాండ్‌కు అదేశించారు. కాగా, ఈ కేసులో మరో 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. చదవండి: (ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్) ‘మా ఓపికకూ ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించినం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నం. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దు’అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరముందని తెలిపారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు పాల్పడిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శల పరిధిని దాటి, బీజేపీ పదేపదే భౌతిక దాడులకు పాల్పడుతుండటం రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనించి, బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు) విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నా. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించాం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కాగా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి వసూలు చేసే చందాలను బీజేపీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోందంటూ ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. రాళ్లుతో ఇంటి పరిసర ప్రాంతాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనను మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్ : రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దేవుని పేరుతో అకౌంట్ బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి రామాలయంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందన్నారు. రాముడిగుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదన్నారు. రాముడు అందరి వాడు హిందువైనా ప్రతి వారు రాముని పూజిస్తారని, రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా అని అన్నారు. బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే అన్నారు. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో 29వేలకోట్లు ఏం చేస్తారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేస్తుందని వరంగల్ ఎంపీ దయాకర్ అన్నారు. ఖాజీపేటలో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటుకు, వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట లో టెక్స్ టైల్స్ పరిశ్రమకు నిధులు కేటాయించేందుకు కేంద్రంపై వత్తడి చేస్తామని స్పష్టం చేశారు. ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి.. మరోవైపు ధర్మారెడ్డి వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడిచేసిన నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ కార్యకర్తుల చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. -
చెరిగిపోని నెత్తుటి ధార
స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం. ఇందులో పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల నాడు రక్తసిక్తమైంది. 1947 సెప్టెంబర్ 2న జాతీయజెండా ఎగురవేసేందుకు బయలుదేరిన ఉద్యమకారులపై రజాకార్ల తూటాల వర్షం కురిపించగా 15 మంది అమరులయ్యారు. ఇదే ఘటనలో 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన పరకాల మరో జలియన్‌వాలా బాగ్గా గుర్తింపుపొందింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమంపై కథనం. జాతీయ పతాకంతో ఊరేగింపు అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు గ్రామాల్లో నిజాం నిరంకుశ పాలనను రజాకారులను ఎదిరిస్తూ ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. రగులుకున్న ఈ మహోద్యమం చారిత్రక పోరాటానికి దారి తీసింది. ఉద్యమ నేతల పిలుపుమేరకు త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన ఊరేగింపులో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినదించారు. చెట్టుకు కట్టి మరీ.. పతాక వందనానికి హాజరయ్యారనే కోపంతో గ్రామాలపై రజాకార్ల సైన్యం దాడి చేసింది. ప్రజలను అనేక విధాలుగా వేధింపులకు గురిచేశారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపడం సంచలనం కలిగింది. చంద్రగిరి గుట్టల కేంద్రంగా సాయుధపోరాటం పిస్తోళ్లు, మందు గుండు సామగ్రి సేకరించిన స్థానికులు ఉద్యమకారులు పోరాటం చేపట్టారు. చంద్రగిరి గుట్ట లను కేంద్రంగా చేసుకుని సాయుధ పోరాటం జరిపారు. చంద్రగిరి గుట్టలపై ఉద్యమకారులు నిర్వహించిన సా యధ శిక్షణ శిబిరాలపై దాడులు చేసి చేయడానికి ప్రయత్నించి అనేక సార్లు రజాకారులు విఫలమయ్యారు. అయితే, సాయుధ దాడులను తట్టుకోలేక నిజాం పోలీ సులు గ్రామాల్లో ప్రజలను విచక్షణారహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లబాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అమరవీరుల స్మారకార్థం అమరధామం పరకాల ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించేలా అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్ ఎదురుగా రెండేళ్లు శ్రమించి నిర్మాణం చేపట్టారు. అమరధామం పేరిట చేపట్టిన ఈ నిర్మాణాన్ని 2003 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం ఎలాంటి ఉద్యమ కార్యక్ర మం జరిగినా ప్రజా సంఘాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఏటా సెప్టెంబర్ 2న అమరవీరులకు నివాళుల ర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దూసుకొచ్చిన తూటాలు ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేర తుపాకులు ఎక్కుపెట్టా రు. ఉద్రేకం, ఉత్సాహంగా ఊరేగింపు జరుపుతున్న ఉద్యమకారులు తహసీల్దార్ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా తమ బలగాలను మోహరించారు. నిజాం పోలీసుల తుపాకులు గర్జించడంతో చాపల బండ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది. రజాకారుల కసాయి చర్యల్లో శ్రీశైలం సహా పదిహేను మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఊరుకోకుండా నిజాం పోలీసులు, రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. -
కన్న తల్లిపై ఉపాధ్యాయుడి దాడి..
సాక్షి, పరకాల: చిన్న కుమారుడికి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. దాడిపై పరకాల ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు నల్లెల సుశీల తెలిపింది. ఆమె కథనం ప్రకారం.. సీతారాంపూర్ గ్రామానికి చెందిన నల్లెల సూరయ్యకు ముగ్గురు సంతానం. వారికి 7.28 ఎకరాల భూమి ఉండగా కూతురుకు ఎకరం రాసిచ్చారు. సుశీల పేరుపై ఎకరం ఉంది. మిగిలిన భూమిని ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సి ఉండగా పెద్ద కుమారుడు నల్లెల రవీందర్ ఎక్కువ తీసుకున్నాడు. దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్ తన వాటాకు రావాల్సిన మిగతా భూమి కోసం అన్నతో పోరాడుతున్నాడు. ఈ విషయంలో చిన్న కుమారుడికి సుశీల అండగా నిలిచింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రవీందర్ పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై భార్యతో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు శ్రీధర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. కాగా, దాడికి సంబంధించిన వీడియోతో ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలితోపాటు శ్రీధర్ తెలిపారు. కొందరు స్థానిక పోలీసు అధికారుల అండతో దాడులకు పాల్పడుతున్నాడని జూలై 28న సీఎం కేసీఆర్‌కు, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
బిర్యానీ గొడవ.. ఆపై హత్య
సాక్షి, గీసుకొండ(పరకాల): గ్రేటర్ వరంగల్ నగరం జాన్‌పిరీలు వద్ద ఉన్న సాయివైన్స్‌లో పని చేసే వర్కర్ సంగ రమేశ్ హత్య కేసులో నిందితుడు రామగిరి ప్రభాకర్‌ను అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయివైన్స్ వద్ద గడిచిన ఆరు సంవత్సరాలుగా రామగిరి ప్రభాకర్ పాన్‌షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అదే వైన్స్‌లో సంగ రమేశ్ క్లీనర్‌గా పని చేస్తుండగా.. ఈ నెల 9న హోళీ పండుగ రోజు రాత్రి 12.30 గంటలకు మృతుడు రమేశ్ అక్కడే ఉన్న ప్రభాకర్‌ను బిర్యానీ కావాలని అడగటంతో తన సెల్‌ఫోన్ ద్వారా ఆర్డర్ చేయడానికి ప్రయత్నింగా ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడంతో వీలు కాలేదు. వేరే వారి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తానని రమేశ్ కోరగా అందుకు ప్రభాకర్ ఒప్పుకోకపోగా డబ్బులు ఇవ్వనని బుకాయించాడు. అయితే బిర్యానీ తెప్పిస్తానని చెప్పి ఎందుకు మాటమార్చావని రమేశ్ అతడిని తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గతంలో తన పాన్‌షాపును తీసివేయిస్తానని బెదరించిన అతడిని ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి వైన్‌షాపు ముందు నిద్రిస్తున్న రమేశ్‌ను తిట్టి, కాళ్లతో తన్ని, బీరుసీసా పగులగొట్టి దాంతో రమేశ్ మెడపై పొడవడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ అక్కడినుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తించి సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శివరామయ్య తెలిపారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని గీసుకొండ పోలీసులు పట్టుకోవడం విశేషం. విలేకర్ల సమావేశంలో ఎస్సైలు అబ్దుల్ రహీం, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
69 ఏళ్ల చరిత్ర @ పరకాల
ఎందరో స్వాతంత్య్ర ఉద్యమకారులకు జీవం పోసిన పోరాటాల గడ్డ పరకాల మున్సిపాలిటీకి 69 ఏళ్ల చరిత్ర ఉంది. 1950 సంవత్సరంలో పరకాల మున్సిపాలిటీ కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుండేది. 1965లో కరీంనగర్ నుంచి పూర్వపు వరంగల్ జిల్లాలో విలీనంతో గ్రామపంచాయతీగా మారింది. స్వాతంత్య్ర ఉద్యమకారుల చేతుల్లోనే పరకాల గ్రామపంచాయతీ పరిపాలన కొనసాగిందని చెప్పకతప్పదు. అంతేకాకుండా సర్పంచ్‌లుగా పరిపాలించిన వారిలో పలువురు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. వరంగల్ జిల్లాలో విలీనం చేసిన సమయంలో విస్తీర్ణం తగ్గిపోయి 15 వేల జనాభా కంటే తక్కువగా ఉండడం చేత మున్సిపాలిటీ నుంచి మేజర్ గ్రామపంచాయతీగా మార్చారు. అయితే, క్రమంగా జనాభా పెరుగుదలతో 2011లో నగర పంచాయతీగా, 2018 సంవత్సరంలో పరకాల శివారులోని రాజీపేట, సీతారాంపూర్ గ్రామాల విలీనంతో మళ్లీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయి పూర్వవైభవం సంతరించుకుంటోంది. – పరకాల నేడు 50 వేల జనాభా సాక్షి వరంగల్ : 1969లో పరకాలలో 15వేల జనాభా ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం 34,318 మంది ఉన్నారు. కానీ నేడు 50 వేల వరకు జనాభా ఉంటుందని అంచనా. దీనికి తోడు ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పరకాలలో రెండు గ్రామాలు రాజీపేట, సీతారాంపూర్ గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్య 22 వరకు పెరిగాయి. 25,255 మంది ఓటర్లలో 12,327 మంది పురుషులు, 12,928 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలకు 44 పోలింగ్ బూత్‌లు సిద్ధం చేశారు. పరకాలలో మళ్లీ రెవెన్యూ డివిజన్ కార్యాలయం 1950 సంవత్సరంలోనే మున్సిపాలిటీగా ఉన్న పరకాలకు జిల్లాల పునర్విభజనలో తీరని అన్యాయం జరిగిందని పరకాల ప్రజలు ఏడాది పాటు ఉద్యమాలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 సంత్సరంలో మళ్లీ రెవెన్యూ డివిజన్‌ను పరకాలలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికుల నుంచి సంతోషం వ్యక్తమైంది. వందేళ్ల తర్వాత బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన గ్రామదేవతలు, బొడ్రాయి పునఃప్రతిష్ఠ వేడుకలు పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో 2017లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పరకాల పట్టణానికి చెందిన 70 వేల మంది పాలుపంచుకున్నారు. సర్పంచ్‌లు, చైర్మన్లు వీరే.. 1950 సంవత్సరంలో మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎం.ఎన్.రంగాచారి ఉన్న క్రమంలో నాటి ఎమ్మెల్యే కటంగూరు కేశవరెడ్డి మధ్య ఏర్పడ్డ విభేదాలు అవిశ్వాసానికి దారితీశాయి. 1953లో అవిశ్వాసంలో ఎం.ఎన్.రంగాచారి ఓటమితో ఏకు మైసయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1960లో చైర్మన్‌గా నర్సింహారెడ్డి ఎన్నికయ్యాడు. 1965లో విలీనంతో గ్రామపంచాయతీ మొదటి సర్పంచ్‌గా జంగేటి ఓదెలు ఎన్నికయ్యారు. 1970, 1975 సంవత్సరాలలో వరుసగా మూడు సార్లు సర్పంచ్‌గా జంగేటి ఓదెలు విజయం సాధించారు. 1980లో జంగేటి ఓదెలుపై ఇంద్రాసేనారెడ్డి విజయం సాధించాడు. రెండోసారి కూడా 1990లో ఇంద్రాసేనారెడ్డి విజయం సాధించగా ఆయనపై అవినీతి ఆరోపణల వచ్చాయి. దీనికి తోడు 1992లో ఆయన హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఉప సర్పంచ్‌గా ఉన్న బండి అయిలు సమ్మయ్యపై జంగేటి ఓదెలు విజయం సాధించారు. దీంతో నాలుగు సార్లు, 18 ఏళ్లుగా జంగేటి ఓదేలు సర్పంచ్‌గా పరిపాలించినట్లయింది. 1995, 2000 సంవత్సరాలలో జంగేటి ఓదెలు, సంతోష్‌కుమార్‌పై మొలుగూరి భిక్షపతి విజయం సాధించారు. ఏడాది పాటు ఎన్నికల నోటిఫికేషన్లో జాప్యం జరగగా 2006లో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మేజర్ పంచాయతీలో పనిచేసే బిల్ కలెక్టర్ బొచ్చు చందర్ తన సతీమణి బొచ్చు రూపను పోటీకి దింపి గెలిపించారు. 2010లో రూపపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది. 2010– 2011 ఏప్రిల్ మాసం వరకు ఉపసర్పంచ్ సిరంగి సతీష్‌కుమార్ సర్పంచ్‌గా కొనసాగారు. 2011– 2013 సంవత్సరం వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. మేజర్ పంచాయతీ నగర పంచాయతీగా 2013లో అప్‌గ్రేడ్ కావడంతో పరకాల నగర పంచాయతీ చైర్మన్‌గా 2014 జూలై 3న మార్త రాజభద్రయ్య ఎన్నికయ్యాడు. 2018 సంవత్సరంలో సొంత పార్టీ పాలకవర్గ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టగా అనేక హైడ్రామాలతో చోటుచేసుకున్న తర్వాత మళ్లీ రాజభద్రయ్యనే చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన హయాంలో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నాడు సర్పంచ్‌గా పోటీ చేయాలంటే అభివృద్ధి అజెండాతో వెళ్లేవాళ్లం. ప్రచారానికి వెళ్తే ప్రజలు కూడా అభివృద్ధి పనులు కోరుకునేవాళ్లు. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికల్లో డబ్బు ఆశించడం మంచి సంప్రదాయం కాదు. రెండు సార్లు సర్పంచ్‌గా ప్రజలు మెచ్చిన అభివృద్ధిచేసినందుకే నాకు ఆ తర్వాత జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చారు. – మొలుగూరి భిక్షపతి, పరకాల మాజీ ఎమ్మెల్యే ► జనాభా 34,318 (2011 లెక్కల ప్రకారం) ► కుటుంబాలు 7,798 ► ఓటర్లు 25,255 ► పురుషులు 12,327 ► మహిళలు 12,928 ► బీసీలు 16,176 ► ఎస్సీలు 6,556, ఎస్టీలు 268 ► ఇతరులు 2,255 ► ఏటా ఆదాయం రూ.3 కోట్లు ► వ్యయం రూ.2.70 కోట్లు ► రోజువారీగా సేకరించే చెత్త 3 టన్నులు ► రోడ్లు 40 కిలోమీటర్లు (అంతర్గత రోడ్లు) ► స్లమ్ ఏరియాలు 15 ► డ్రెయినేజీలు 30 కిలోమీటర్లు ► వాటర్ ట్యాంకులు 7 ► నల్లా కనెక్షన్లు 5వేలు -
పరకాల కమిషనర్‌పై వేటు
పరకాల: వార్డుల పునర్విభజన డాక్యుమెంటేషన్ అందించడంలో జరిగిన జాప్యంపై పరకాల పురపాలక సంఘం కమిషనర్ బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త కమిషనర్‌గా పురపాలక శాఖ ఆడిట్ విభాగం సీనియర్ అధికారి ఎల్.రాజాకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 17న అందించిన వార్డుల పునర్విభజన, మ్యాప్ వంటి డాక్యుమెంటేషన్ లో జరిగిన పొరపాట్లపై వివరణ కోరేందుకు సీడీఎంఏ ప్రయత్నించగా కమిషనర్ అందుబాటులో లేకపోవడం.. పైగా ఫోన్ చేసినా స్పందిం చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్పులు చేసిన డాక్యుమెంటేషన్‌ను మరుసటి రోజు కమిషనర్ శ్రీనివాస్ కార్యాలయంలో అందజేయకుండా కింది స్థాయి అధికారులతో పంపడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణి స్తూ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సీడీ ఎంఏ అధికారి శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. -
మెరిసి మాయమైన సాయిపల్లవి
సాక్షి, పరకాల: సమయం ఉదయం 8 గంటలు.. ఓ అందమైన అమ్మాయి పరకాల బస్టాండ్‌కు కారులో చేరుకొని ప్రయాణికురాలిలా ప్లాట్‌ఫాంపై వేచి చూస్తోంది. ఆమెను ఎక్కడో చూసినట్లు ప్రయాణికులు గుర్తు చేసుకునే లోపే.. ఫిదా సినిమా హిరోయిన్ సాయిపల్లవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. విరాట పర్వం సినిమా షూటింగ్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల బస్టాండ్‌లో సాయిపల్లవి ఆర్టీసీ బస్సు కోసం ఎదరుచూసే దృశ్యాలను బుధవారం చిత్రీకరించారు. ఆమెను స్థానికులు గుర్తిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జ్ నుంచి చిత్రీకరించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ దృశ్యాలను ఫొటో తీయగా అక్కడే ఉన్న సినిమా షూటింగ్ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను బలవంతంగా తొలగించారు. మరికొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లో సాయిపల్లవిని బంధించే ప్రయత్నం చేసేలోపే.. ఆమె షూటింగ్ పూర్తి చేసుకుని సొంత వాహనంలో కాళేశ్వరం వెళ్లిపోయారు. ఓ ప్రయాణికుడు తీసిన సాయిపల్లవి ఆరు సెకన్ల విడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గణపేశ్వరాలయంలో.. గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో బుధవారం విరాట పర్వం సినిమాకు సంబంధించి హిరో దగ్గుపాటి రాణా, హీరోయిన్ సాయిపల్లవిపై పలు సన్నివేశాలు, పాట చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ మరో రెండు రోజుల పాటు ఇక్కడే జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
మరిచిపోని ‘రక్తచరిత్ర’
సాక్షి, పరకాల: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ .. భుమి కోసం.. భుక్తి కోసం బానిస బంధాల విముక్తి కోసం పోరాడి ఎందరో ఉద్యమకారుల వీర మరణంతో 1947 సెప్టెంబర్ 2న పోరాటాల గడ్డ పరకాల నేల రక్తసిక్తమైంది. వందలాది మంది మంది క్షతగాత్రులయ్యారు. నెత్తుటి ముద్రల తాలుకు గుర్తులు ఇంకా ఉద్యమకారుల స్మతి పథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. మరో జలియన్‌వాలా బాగ్గా తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందంటూ పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. అమరవీరుల స్మారకార్థం.. 1947 సెప్టెంబర్ 2న జరిగిన మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిర్మాణం చేసిన అమరధామాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం పరకాల పట్టణంలో ఎలాంటి ఉద్యమ కార్యక్రమం జరిగిన ఇక్కడి నుంచి ప్రారంభం కావడం గొప్ప విశేషం. -
ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
సాక్షి, పరకాల: ఏటా ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు తరలివచ్చారు. జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరుకాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీఆర్డీఓ సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, వీహబ్ చైర్మన్ శకుంతల పాల్గొన్నారు. ఈ మేళాను మంత్రి దయాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కష్టపడే తత్వం ఎక్కువ గ్రామీణ యువతకు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు నిరుద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అర్హత తగిన రంగంలో స్థిరపడాలని సూచించారు. అలాంటి వారి కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ నేటి యువత సెల్‌ఫోన్ మోజులో పడి విలువైన సమయం, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, ఇన్చార్జి ఏసీపీ సునీతా మోహన్, ఎంపీపీలు టి.స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యులు సిలువేరు మొగిలి, కోడెపాక సుమలత, సుదర్శన్‌రెడ్డితో పాటు బొల్లె భిక్షపతి, బొచ్చు వినయ్ తదితరులు పాల్గొన్నారు. 1,632 మందికి ఉద్యోగనియామక పత్రాలు పరకాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు 4,761 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,632 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయగా మరో 873 మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. కాగా, జాబ్‌మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులతు వారి కుటుంబ సభ్యులతో హాజరుకావడంతో కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 55 కంపెనీల బాధ్యలు హాజరై నిరుద్యోగులను అర్హత తగిన ఉద్యోగాలకు ఎంపిక చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సాక్షి, పరకాల(వరంగల్) : శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల పట్టణానికి చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పరకాల పట్టణానికి చెందిన గోవింద మణికంఠ(25) హన్మకొండ నుంచి పరకాల వైపు ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు వస్తున్న తవేరా వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు పలువురికి కంటతడి పెట్టించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంను ఢీ కొట్టగానే అక్కడి నుంచి తవేరా డ్రైవర్ పరారీ అయినట్లు స్థానికులు తెలిపారు. తండ్రీకొడుకులు కానరాని లోకాలకు.. పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కూల్‌డ్రింక్స్ అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న గోవిందా రమాదేవి భర్త భద్రయ్య ఏడాదిన్న క్రితం అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు మణికంఠ మరణం తీరని విషాదం నెలకొల్పింది. తన కుటుంబానికి పెద్దదిక్కుఅవుతాడనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో కుమారుడు సైతం కానరాని లోకాలకు వెళ్లడంతో రమాదేవి, కూతుళ్లు కన్నీటిని ఆపటం ఏవరితరం కాలేదు. రమాదేవికి నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి వివాహం జరిగింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్ కోరారు. -
33 మందిపై పిచ్చికుక్క దాడి
సాక్షి, పరకాల(వరంగల్) : ఒకే కుక్క 33మందిని తీవ్రంగా గాయపరిచి భయాందోళనకు గురిచేసిన సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. పరకాల, నడికూడ మండలంలో గత కొద్ది రోజులుగా పిచ్చికుక్కల దాడులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఓ పిచ్చికుక్క వరికోల్ గ్రామస్తులను వనికించింది. 33 మందికి తీవ్రంగా గాయపరిచి వారి రక్తం కళ్లచూసింది. ఈ దాడిలో 15 మంది వృద్ధులు, ముగ్గురు బాలికలు ఉండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో గ్రామ శివారు నుంచి వచ్చిన పిచ్చి కుక్క కనబడిన వృద్ధులు, చిన్నారులపై దాడి చేసింది. అంతేకాకుండా గ్రామంలోని ఇతర కుక్కలు, పశువులుపై సైతం దాడిచేసి గాయపరిచింది. దాడిలో గాయపడిన వారిలో 17 మందిని వెంటనే పరకాల సివిల్ ఆస్పత్రికి, మిగతా వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మరికొందరిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పరకాల సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పోచంపల్లి వెంకటనర్సమ్మ, రాచమల్ల చేరాలు, పోచంపల్లి చిన్నమల్లారెడ్డి, దిడ్డి కొమ్మాలు, రామంచ స్వర్ణలత, దాట్ల సరోజన, వంగ రామయ్య, పోశాలు సరోజన, శంకర్రావు, కుసుమ సాంబశివరావు, చెనుమల్ల శంకరమ్మ, లడె సునిత, గుండెకారి లచ్చమ్మ, బల్గు రవిందర్, గుండెకారి శంకరమ్మ, చిన్నారులు పర్శ గౌతమి, పకిడె అమ్ములు, దొగ్గె విక్టోరియాలు ఉన్నారు. వీరందరికీ ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు సిఫారసు చేశారు. రెండు కుక్కలు హతం పచ్చి కుక్క దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ వారిని కుక్క కరించిందని తెలియగానే పొలం పనులు వదిలి గ్రామంలోకి చేరుకున్నారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలించగా, గ్రామస్తులతో దాడిచేసిన పిచ్చి కుక్క కోసం గాలించారు. అనుమానంగా ఉన్న రెండు కుక్కలను హతమార్చారు. -
మృత్యువులోనూ వీడని పేగుబంధం
బాలుడి ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈత కోసం చెరువులోకి దిగిన కొడుకు తన కళ్లెదుటే నీటమునుగుతుంటే కన్నతల్లి తల్లడిల్లింది. కొడుకును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తల్లీకొడుకులను చెరువు మింగేసింది. తాను చూస్తుండగానే భార్య, కొడుకు నీట మునిగిపోతుంటే వికలాంగుడైన భర్త నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తల్లి, తమ్ము డిని కాపాడేందుకు మరో బాలుడు సాహసం చేసినా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి వారించాడు. దీంతో ఆ బాలుడి నిండు ప్రాణాలు దక్కాయి. సాక్షి, ఆత్మకూరు(పరకాల): పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... వరంగల్ నగరంలోని సుందరయ్య కాలనీకి చెందిన బుధవారపు రామకృష్ణ తన భార్య భాగ్యలక్ష్మి(40), కుమారులు సంతోష్, రాహుల్(11)తో కలిసి గురువారం తన తోడల్లుడు రాజు దశదినకర్మకు ములుగు జిల్లా పస్రా వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత బైక్‌పై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని కటాక్షపూర్ సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న చెరువు వద్దకు కాసేపు సేదతీరుదామని ఆగారు. అందరూ కలిసి కూల్‌డ్రింక్ తాగారు. చెరువులో కాళ్లు చేతులు కడుక్కున్నారు. ఇంతలో రాహుల్ ఈత కొడతానని బట్టలు విప్పి చెరువులోకి దిగాడు. కొద్ది దూరంలోనే మునుగుతుండగా గమనించిన తల్లి భాగ్యలక్ష్మి కొడుకును కాపాడేందుకు నీటిలోకి దిగింది. అప్పటికే రాహుల్ చెరువులో మునిగిపోగా, భాగ్యలక్ష్మి కూడా నీటముగినింది. ఇది గమనించిన పెద్దకుమారుడు సంతోష్ నీటిలో దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి అతడిని వారించాడు. రామకృష్ణ వికలాంగుడు కావడంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కొద్దిసేపటల్లోనే తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. రాహుల్ ఆరో తరగతి, సంతోష్ ఏడో తరగతి చదువుతున్నారు. సీఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సాయంతో తీయించి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘చల్ల’గా చరిత్ర తిరగరాశారు..
సాక్షి, వరంగల్ రూరల్: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు 29 యేళ్ల తరువాత మళ్లీ రెండో సారి ఒకే వ్యక్తికి పట్టంకట్టారు. 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటి నుంచి నేటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండు సార్లు గెలిచే అవకాశం దక్కింది. 2018 ఎన్నికల్లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుచి మూడో వ్యక్తిగా నిలిచాడు. 2014లో పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో సమ్మయ్య రెండోసారి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి జయపాల్‌ను విజయం వరించింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిధ్యం వహించగా సమ్మయ్య, జయపాల్, చల్లా ధర్మారెడ్డిలే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భారీ మెజార్టీ సాధించిన ధర్మారెడ్డి.. పరకాల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 46వేల మెజార్టీతో గెలుపొందడం ఇదే తొలి సారి. గతంలో రెండో సారి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో సైతం చల్లా ధర్మారెడ్డికి వచ్చిన మెజార్టీ ఎవరికి రాలేదు. 1989లో 1600, 1985లో 17,132 ఓట్లతో జయపాల్ గెలుపొందారు. 1978లో 8,787, 1983లో 7,295 ఓట్లతో సమ్మయ్య గెలుపొందారు. 2014లో 9,108, 2018లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.. పరకాల నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 1952లో గోపాల్‌రావు (పీడీఎఫ్), 1957లో కె.ప్రకాష్‌రెడ్డి (కాంగ్రెస్), 1962లో ఆర్.నర్సింహరామయ్య (కాంగ్రెస్), 1967లో సీహెచ్. జంగారెడ్డి (బీజేపీ), 1972లో పి. ధర్మారెడ్డి (కాంగ్రెస్), 1978లో బొచ్చు సమ్మయ్య (కాంగ్రెస్), 1983లో బి.సమ్మయ్య (కాంగ్రెస్), 1985లో ఒంటేరు జయపాల్ (బీజేపీ), 1989లో ఒంటేరు జయపాల్ (బీజేపీ), 1994లో పోతరాజు సారయ్య (సీపీఐ), 1999లో బొజ్జపెల్లి రాజయ్య (టీడీపీ), 2004లో బండారి శారారాణి (టీఆర్ఎస్), 2009లో కొండా సురేఖ (కాంగ్రెస్), 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మొలుగూరి బిక్షపతి (టీఆర్ఎస్) తరపున గెలిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి (టీడీపీ), 2018లో చల్లా ధర్మారెడ్డి(టీఆర్ఎస్) విజయం సాధించారు. -
అంతుపట్టని పరకాల తీర్పు
సాక్షి, పరకాల రూరల్: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచలనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పరకాలలో గెలుపోటములను అంచనా వేయడం కష్టం. ఇక్కడి నుంచి ఇద్దరు మాత్రమే రెండోసారి విజయం సాధించారు. మిగతావారు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 1952లో పరకాల నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరుగగా ఇద్దరికి మాత్రమే రెండోసారి గెలుపు వరించింది. జిల్లా నుంచి తొలి మహిళ మంత్రిని అందించిన ఘనత పరకాలకే దక్కింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి రాష్ట్రమంత్రి వర్గంలో అవకాశం దక్కింది.1952లో జనరల్ సీటుగా ఉన్న పరకాల ఆ తరువాత ఎస్సీకి రిజర్వుడ్ అయింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత మళ్లీ జనరల్ సీటుగా మారింది. పోరుగడ్డగా ఉన్న పరకాల గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లితోపాటు రేగొండ మండలంలోని తొమ్మిది గ్రామాలు మినహా మిగితా మండలం ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో అప్పటి శాయంపేట నియోజవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట నియోజకవర్గంలోని సంగెంతో పరకాల నియోజకవర్గం ఏర్పాటుచేశారు. 1952 నుంచి 72 వరకు జనరల్‌గా, 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు కేటాయించగా 2009 నుంచి జనరల్ స్థానంగా కొనసాగుతుంది. 15 సార్లు ఎన్నికలు జరిగితే పీడీఎఫ్ ఒక్కసారి, కాంగ్రెస్ ఆరు సార్లు, బీజేపీ మూడు సార్లు, టీఆర్ఎస్ రెండు సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఐ ఒక్కసారి గెలుపొందాయి. తొలి మహిళా మంత్రి సురేఖ... పరకాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆరు నెలల పాటు పనిచేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం వైఎస్సార్ మంత్రివర్గంలో చోటు లభించడంతో సురేఖ జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో గెలిచిన బొచ్చు సమ్మయ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1972లో గెలిచిన పి ధర్మారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు మంత్రివర్గంలో పనిచేశారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు మంత్రి పదవులు చేజిక్కించుకున్నారు. సమ్మయ్య, జయపాల్‌కు రెండోసారి అవకాశం... 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటినుంచి నేటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండుసార్లు గెలిచే అవకాశం దక్కింది. మొదట్లో జనరల్ స్థానంలో ఉన్న పరకాల 1978లో ఎస్సీ రిజర్వుడ్ అయింది. దాంతో 78లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి మంత్రి పదవి పొందారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం వరించింది. అప్పటి నుంచి పొత్తులతో సీట్లు తారుమారుతూ వచ్చాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిథ్యం వహించగా సమ్మయ్య, జయపాల్ మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పరకాలకు మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరే... నియోజకవర్గ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ ఫలితంగా అనూహ్యంగా టీఆర్ఎస్ తరపున అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న బండారి శారారాణి 34వేల 597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సష్టించారు. ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానానికే వ్యతిరేక గళం వినిపించారు. 2009లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తిరుగులేని నేతగా ఎదిగిన జంగన్న.. పరకాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు ఎదురులేని నేతను చేసింది. 1967లో జనసంఘ్ నుంచి దీపం గుర్తుతో గెలుపొందిన జంగారెడ్డి సంచలనం సృష్టించారు. ఆ తదుపరి శాయంపేట నుంచి రెండు సార్లు విజయం సాధించారు. హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావును ఓడించి చరిత్ర సష్టించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండుస్థానాల్లో గెలువగా అందులో ఒకటి జంగారెడ్డిదే కావడం విశేషం. -
బాత్రూమ్లో జారిపడిన తాజా మాజీ ఎమ్మెల్యే
సాక్షి, పరకాల : బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కింద పడిపోయారు. తలకి గాయం అవ్వడంతో వెంటనే కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
నెరవేరనున్న 37 ఏళ్ల కల
పరకాల : 37 సంవత్సరాల క్రితం పరకాల నుంచి తరలించుకుపోయిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఈ నెల 27న ప్రారంభించుకోబోతున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలి పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వపరిపాలనే లక్ష్యంగా 10 జిల్లాల తెలం గాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా, కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ములుగుకు తరలించడంలో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉండగా ప్రస్తుత జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలతో ఉన్న పరకాల నియోజకవర్గాన్ని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలు చేసి పరకాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు. పరకాలలోని అన్నివర్గాల ప్రజల పోరాటాలతో 2017 అక్టోబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం శంకుస్థాపన సభలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ప్రకటించి 2018 ఏప్రిల్ మొదటి వారంలో గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న సోమవారం ఆర్డీఓ కార్యాలయ ప్రారంభంతో పరకాల రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కార్పొరేషన్ చైర్మన్లు లింగంపల్లి కిషన్‌రావు, రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్రావు, వాసుదేవరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నడికూడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించిన తర్వాత 10.30 గంటలకు పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొంపెల్లి ధర్మారాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, మార్కెట్ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. -
కేసీఆర్ పాలనలో తెలంగాణ అధోగతి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా పాలి స్తూ తెలంగాణను అధోగతిపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు. బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో పరకాల మున్సిపల్ చైర్మన్ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఉత్తమ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. టీఆర్ఎస్ తప్పుడు విధానాలకు విరక్తి చేందే పరకాల చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు. -
నమ్మించి మోసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి
పరకాల : మాయమాటలతో వృద్ధురాలి మెడలోని రెండు తులాల పుస్తెల తాడు అపహరించిన సంఘటన ఆదివారం పరకాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శాయంపేట మండలం జోగంపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం సంత కావడంతో పరకాల పట్టణానికి చేరుకుంది. ఎండకు భరించలేక కాసేపు సేదతీరేందుకు బంగారం దుకాణం ముందు కూర్చున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి .. తెలిసిన వ్యక్తిలా ఎంతో అప్యాయంగా పలకరించాడు. ‘బాగున్నావా.. అంటే బాగున్నాను..’ అంటూ సమాధానం ఇచ్చింది. కొంతసేపు ముచ్చటపెట్టినట్టే పెట్టి తన భార్య ఫొటో దిగుతుందని..మెడలో పుస్తెల తాడు ఇస్తే మళ్లీ తీసుకొచ్చి ఇస్తానని నమ్మపలికాడు. అరగంట సేపయినా తిరిగి రాకపోవడంతో వృద్ధురాలు లబోదిబోమనటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ జానీ నర్సింహులు, ఎస్సై రవీందర్‌లు వృద్ధురాలు కూర్చున్న స్థలం వద్ద బంగారం దుకాణం ఉండటంతో సీసీ çఫుటేజీని పరిశీలించారు. వృద్ధురాలి మెడలో పుస్తెలు తాడు ఉన్న మాట వాస్తవంగా నిర్ధారణ చేసుకొని..మాయమాటలతో ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి గాలించారు. తెలిసిన వ్యక్తే వృద్ధురాలి పుస్తెలు తాడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
అయిన వారి కోసం ఎదురుచూపులు
పరకాల : మానసిక స్థితితో బాధపడుతున్న వృద్ధురాలు రెండు రోజులుగా అమాయకపు చూపులు..చేతులు చాపలేని దుస్థితి. పట్టించుకునేవారు ఒక్కరూ లేరు. వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాతోనే రెండు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది. బస్టాండ్‌లో అందరూ యాచకురాలిగానే చూస్తున్నారు తప్పా ఆమె ఆకలి బాధను, ఆవేదనను గుర్తించేవారే లేరు. బస్టాండ్‌లో అనుమానస్పదంగా కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చావని, ఎటు వెళ్లాలని సాక్షి విలేకరి ప్రశ్నించగా ఏదో చెప్పాలని ఉన్నా నోటి మాట రాక తల్లడిల్లిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో అరటి పండ్లు, భోజనం అందజేశారు. ఆర్టీసీ సెక్యూరిటీ వృద్ధురాలు బంధువుల జాడ కోసం ఆరా తీస్తున్నారు. -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం
పరకాల రూరల్ : తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు రైతులు ఆదివారం పురుగు మందు డబ్బాలతో మండలంలోని సీతారాంపురం పరకాల–కంఠాత్మకూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు మేల్ ఫిమేల్ వరి రకాన్ని 60 ఎకరాల్లో సాగు చేశారు. పంట పూర్తయిన అనంతరం 25 మందికి చెందిన 28 ఎకరాల వరి పంటను హార్వెస్టింగ్ చేసి మిగిలిన 32 ఎకరాల పంట విషయంలో రేపు, మాపు అంటూ కంపెనీ ఆర్గనైజర్ కాలం గడిపాడు. ఈ క్రమంలో ఈనెల మూడో తేదీన కురిసిన అకాల వర్షంతో 32 ఎకరాల్లో ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి.ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను అడగితే పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఆర్గనైజర్ రఘుపతి తమ మిషన్‌తోనే హార్వెస్టింగ్ చేసుకోవాలని షరతు పెట్టడంతోపాటు కోతకు వచ్చిన తమ పంటలను వదిలి అధిక రేట్లతో ఇతర గ్రామాల్లో హార్వెస్టింగ్ చేశాడని, దీంతో తాము నష్టపోయామని వాపోయారు. -
చలివాగులో పడి యువకుడి మృతి
పరకాల/రేగొండ : బైక్ అదుపు తప్పి వంతెనకు ఢీకొనడంతో వాగులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పరకాలలో ఆదివారం చోటుచేసుకుంది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కన్నెవెన ఓంకార్ ద్విచక్ర వాహానంపై పరకాల నుంచి తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో పట్టణ శివారులోని చలివాగు వంతెనపై రెయిలింగ్‌కు ద్విచక్ర వాహనం రాడ్(ఫుట్ రెస్ట్ ) తగిలింది. దీంతో బైక్ రోడ్డుపై పడిపోగా ఓంకార్ ఎగిరి వాగులోని బండ రాయిపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఓంకార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి సోదరుడు సుమన్‌కు తీవ్రగాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఏడాది క్రితమే నాగలక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్తను కోల్పయిన నాగలక్ష్మి.. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలిచివేసింది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఓంకార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ఆస్పత్రికి తరలించారు. కాగా కొన్నేళ్ల క్రితం ఓంకార్ తండ్రి ఓదెలు కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఇద్దరి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
అంజన్న పెళ్లికొడుకాయనె..
పరకాల రూరల్: ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణానికి వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయం వేదిక కానుంది. లోక కల్యాణం కోసం బ్రహ్మచారులకు వివాహ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అంజన్న కల్యాణం నిర్వహి ంచండం ఆనవాయితీగా వస్తోంది. శనివారం నిర్వహించే ఈ కల్యాణ వేడుక కోసం అవసరమైన ఏర్పాట్లును నిర్వాహకులు చేపట్టారు. కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తాంజనేయస్వామి ఆలయంలో సువర్చలాదేవి–హనుమంతుడి కల్యాణం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం చలువ పందిళ్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. మహా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పెరిగిన భక్తుల తాకిడి.. పరకాల ప్రాతంలో తొలిసారి హనుమాన్ దీక్షలు ఈ ఆలయంలో చేపట్టడంతో భక్తులు పెరిగారు. పట్టణానికి చెందిన కాటూరి జగన్నాథచార్యులు 1988లో చెట్టుకింద ఉన్న హనుమాన్ విగ్రహానికి పూజలు అభిషేకాలు చేయడం ప్రారంభించారు. 1991లో జగనాన్నథచార్యులుతోపాటు మరో నలుగురు విజయవాడకు వెళ్లి 41రోజుల హనుమాన్ దీక్ష చేపట్టారు. మరుసటి సంవత్సరం నుంచి ఈ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 1997లో 108 కలశాలతో దుర్గాప్రసాద్ స్వామీజీ చేత యజ్ఞాలు చేయించారు. 2000 సంవత్సరంలో 1108 కలశాలతో హోమాలు చేయించారు. 2013లో 108 వినాయక విగ్రహాలతో 41రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఆలయంతో సుమారు పది వేలకు పై బడి భక్తులు హనుమాన్ మాలాధారణ చేస్తున్నారు. ఆలయానికి వందేళ్ల చరిత్ర.. ఈ ఆలయానికి నూరు సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు ఒక చెట్టు కింద విగ్రహ రూపంలో వెలిసిన హనుమంతుడికి ఆలయం కట్టించారు. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి(ఇల్లంతకుంట పౌర్ణమి) రోజున ఆలయం చుట్టుపక్కల ఉన్న మల్లక్కపేట, రాయపర్తి, నాగారం, నర్సక్కపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. కాల క్రమేనా ఆలయ విశిష్టత పెరిగి ప్రసిద్ధి గాంచిన హనుమాన్ దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. బ్రహ్మచారి అయిన హనుమంతుడి కల్యాణం చాలా శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే హనుమంతుడి కల్యాణం నిర్వహిస్తున్నాం. హోమంతో ప్రారంభమై పూర్ణాహుతి అనంతరం సువర్చలాదేవితో ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. – కాటూరి జగన్నాథచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు -
రెవెన్యూ డివిజన్ సాధనకు పోరాటం
పరకాల: పరకాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈనెల 18న ఆత్మగౌరవ యాత్ర, 21న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పెస్టర్‌ను మంగళవారం అమరధామంలో అఖిలపక్ష నాయకులు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాత తాలుక మండలాలతో కలిపి రెవెనూ డివిజన్ చేయాలని కోరుతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా పరకాల మండలాన్ని రెండు ముక్కలు చేశారని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్ శంఖుస్థాపన చేయడానికి సీఎం కేసీఆర్ స్పందించి పరకాలకు న్యాయం చేసేలా బంద్‌లో ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, బొచ్చు కృష్ణారావు, దేవునూరి మేఘనా«థ్, బొచ్చు భాస్కర్, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, ముదిరాజ్ సంఘం నాయకులు జంగేటి సారంగఫాణి, బోయిని పోశాలు తదితరులు పాల్గొన్నారు. -
‘పరకాల’ కమిషనర్‌కు వారెంట్
పరకాల : సంతల వేలంలో అవకతవకాలపై విచారణకు హాజరు కాకపోవడంతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల నగర పంచాయతీ కమిషనర్ తాళ్లపెల్లి రాజేశ్వర్‌కు లోకయుక్త కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ప్రస్తుత పరకాల మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో పశువుల, గొర్రెలు, మేకలు, కూరగాయాల సంతల(2009–2010 సంవత్సరం) టెండర్ల ప్రక్రియలో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట డబ్బుల వసూళ్లపై తెలుగు రైతు సంఘం నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు జిల్లా అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో ఆయన 2013లో లోకయుక్తను ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. వేలం పాట నిబంధనలు పాటిస్తే రూ.32లక్షలు సంబంధిత కాంట్రాక్టర్లు చెల్లించేవారు.. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముకై కేవలం రూ.9లక్షలు వసూలు చేసి పంచాయతీకి దక్కాల్సిన రూ.22లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్ తన సంజాయిషీ ఇచ్చుకుని విచారణ నుంచి తప్పుకోగా డీపీఓ, నగర పంచాయతీ అధికారులు హాజరుకాకపోగా సంజాయిషీ ఇవ్వలేదు. దీంతో నగర పంచాయతీ కమిషనర్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 25న కోర్టు ముందు హాజరుపర్చాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాల్సిందేనని రాజేశ్వర్‌రావుతో పాటు తెలుగు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
పరకాలలో ఉద్రిక్తత
► జిల్లా కేంద్రం ఏర్పాటుపై బంద్‌కు అఖిలపక్షం పిలుపు ► రోడ్లపైకి చేరిన అన్ని వర్గాల ప్రజలు ► ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన పట్టణం ► నాయకుల అరెస్ట్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు ► లాఠీ ఝుళిపించి చెదరగొట్టిన పోలీసులు పరకాల: పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం శనివారం ఇచ్చిన బందు పిలుపు ఉద్రిక్తంగా మారింది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందగా బందులో పాల్గొనగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళలు రోడ్లపైకి చేరి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పాలకుల వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. యువకులు రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో పట్టణంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నాయకులను తీసుకెళ్లకుండా జీపులకు మహిళలతో యువకులు అడ్డుతగలటంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. వాహనాలవైపు ఆందోళనకారులు దూసుకురావడంతో పోలీసులు రోడ్లపై జనం ఉండకూడదంటూ హెచ్చరిస్తూనే లాఠీలకు పనిచెప్పారు. అఖిలపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు గొడవకు దిగారు. పరకాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతుంటే ఏందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదం చేశారు. నాయకుల అరెస్ట్.. విడుదల చివరకు ఆందోళనలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, చాడ రవీందర్‌రెడ్డి, పసుల రమేష్, పిట్ట వీరస్వామి, సారయ్య, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, కక్కు రాజు, యాట నరేష్, శ్రీకాంత్, బొచ్చు భాస్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఆందోళకారులు నిరసన తెలపడానికి ప్రయత్నించగా నాయకులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు పరకాలకు న్యాయం జరిగే వరు తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, నక్క చిరంజీవి, బొచ్చు భాస్కర్ స్పష్టం చేశారు.పోరాటల గడ్డ పరకాలకు పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్‌తో పోరాడుతుంటే పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. మొగిలిచర్లలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పరకాలలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పరకాలలో ఉద్రిక్తత
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపడుతున్న పరకాల బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. పరకాలను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ర్యాలీ సాగుతుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరస్థితి నెలకొంది. -
ఎండలో ఆమ్లెట్ !
పరకాల: భగభగ మండుతున్న ఎండలు.. బయటకు రావాలంటే భయపడిపోతున్న జనం.. ఈ ఎండకు మనుషులు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. వేడెక్కిన రోడ్డుపై ఎలాంటి మంట లేకుండానే ఆమ్లెట్ వేశారు వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన యువకులు. పరకాలకు చెందిన యువకుడు నరేశ్ కల్లు మండువా ఎండలో కొద్ది సేపు స్టీల్ ప్లేట్ పెట్టి కోడిగుడ్డు పోశాడు. కొద్ది సేపటికే అది ఆమ్లెట్ అయింది. దీంతో కల్లు తాగేందుకు వచ్చిన పలువురు ఒకరిని చూసి మరొకరు ఆమ్లెట్ వేయడం కనిపించింది. 22 పీఆర్కేఎల్ 04, 05 : ఎండ వేడికి ఆమ్లెట్ వేస్తున్న యువకులు -
కొనసాగుతున్న కొమ్మాల జాతర
గీసుకొండ(పరకాల) : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా రెండో రోజైన సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు భక్తులు లక్ష్మీనర్సింహ స్వామి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్వామి వారిని దర్శించుకోగా అధికారులు, అర్చకులు, స్వాగతం పలికి పూజలు చేయించారు. కాగా, పోలీసులు జాతరలో రాజకీయ ప్రభలను నిషేధించినట్లు ప్రకటించినా వివిధ పార్టీల నాయకులు పలు ప్రాంతాల నుంచి జాతరకు తరలించారు. ఇక తెలంగాణ జాగృతితో పాటు కొమ్మాల సర్పంచ్ జూలూరి సంధ్య– కేదారి దంపతులు రెండు ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీటి సరఫరా చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, కొమ్మాల ఆలయం వారు సంయుక్తంగా రథశాల వద్ద భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 16వ తేదీన స్వామి వారి రథ్సోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ కమల, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబు తెలిపారు. ఈస్ట్ డివిజన్ డీసీపీ ఇస్మాయిల్, మామునూరు ఏసీపీ శోభన్‌కుమార్, గీసుకొండ సీఐ ప్రభాకర్‌రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబురెడ్డి పాల్గొన్నారు. భారీగా తరలిన దేవుని బండ్లు, ప్రభబండ్లు దుగ్గొండి(నర్సంపేట): దేవుడి బండ్లు, చక్రపుబండ్లు, గుర్రపు బాణాలు, ఏనుగ బాణాలు, మేక పోతుల బండ్లు, పాలారాపు బండ్లు ఇలా అందమైన అలంకరణలో ప్రభ బండ్లు గ్రామగ్రామాన సందడి చేశాయి. పలు గ్రామాల నుంచి అలంకరణలో ఉన్న బండ్లతో భక్తులు కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి సన్నిధికి బయలుదేరారు. కాగా, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభబండ్లను గిర్నిబావిలో సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అద్యక్షుడు ఆకుల శ్రీనివాస్, శానబోయిన రాజ్‌కుమార్, కాట్ల భద్రయ్య, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఆరె జైపాల్‌రెడ్డి, గుడిపెల్లి జనార్దన్‌రెడ్డి, నాతి వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా, కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో 2004 నుండి రాజకీయ ప్రభలపై పోలీసులు నిషేధం విధించడంతో జాతర వెలవెలబోయింది. ఈసారి ఆంక్షలు విధించినా పార్టీల ఆధ్వర్యంలో భారీ రాజకీయ ప్రభలను ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు రాజకీయ ప్రభలను పోటాపోటీగా తరలించారు. కాంగ్రెస్ ప్రభలను మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అయితే అనుమతి లేకపోవడంతో గిర్నిబావిలో ఎస్సై భాస్కర్‌రెడ్డి రెండు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు పార్టీల జెండాలు తీసివేసి అనుమతించారు. -
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
పరకాలకు జరిగిన అన్యాయంపై నిలదీయండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పరకాల : పోరాటాల పురిటిగడ్డ పరకాలను జిల్లాల పునర్విభజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లిన లక్ష్మణ పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రెవెన్యూ డివిజన్ సమితి, బీజేపీ నాయకులు వేర్వేరుగా రెవెన్యూ డివిజన్ కోసం వినతి పత్రాలు అందజేశారు. పరకాలకు జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ రేపాల నర్సింహరాములు, బీజేపీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన పరకాల ప్రాంత ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమాలు చేయడం బాధగా ఉందన్నారు. సీఎం దృష్టికి పరకాల సమస్య తీసుకెళ్తానని లక్ష్మణ్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, సాధన సమితి నాయకులు రేపాల నర్సింహరాములు, ఎడ్ల సుధాకర్, ఆడగాని జనార్దన్‌రావు, బీజేపీ నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ ఆర్పీ.జయంత్‌లాల్, బీజేపీ నాయకులు మేకల రాజవీర్, పల్లెబోయిన సురేష్ , కానుగుల గోపినాథ్, వంగాల సంగమేశ్వర్, జయపాల్‌రెడ్డి, కాచం గురుప్రసాద్, బీజేవైఎం నాయకులు యాట నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు కాళోజీ సెంటర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు రూరల్ జిల్లా నేతల ఘనస్వాగతం పలికారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు హైదరాబాద్ నుంచి హన్మకొండ మీదుగా వెళుతున్న సందర్భంగా రూరల్ జిల్లా అ« ద్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. -
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
∙ర్యాలీలతో హోరెత్తిన పోరుగడ్డ ∙జేఏసీ బంద్ సంపూర్ణం ∙స్తంభించిన జనజీవనం పరకాల: పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని పార్టీలకతీతంగా ప్రజలు నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలతో పోరుగడ్డ హోరెత్తింది. జేఏసీ, డివిజన్ సాధన సమితి ఇచ్చిన బంద్ శనివారం విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ ఆకాంక్షను తెలిపారు. బంద్ సందర్భంగా పట్టణంలోని బట్టల దుకాణాలు, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, కిరాణషాపులు, హోటళ్లు మూతపడ్డాయి. బంద్‌లో జనజీవనం స్తంభించింది. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, డీవైఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపోవరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు నక్క చిరంజీవి, దుప్పటి సాంబయ్య మాట్లాడుతూ నాడు చందూలాల్ ప్రాంతీయ అభిమానంతో ఆర్డీవో కార్యాలయాన్ని తరలించుకుపోయారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల రాములు, మహేందర్, కృష్ణంరాజు, మల్లయ్య, చంద్రమౌళి, వినయ్, కళ్యాణ్, రమేష్, సంజీవ్, ఐలయ్య, కుమార్, భద్రయ్య పాల్గొన్నారు. న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో.. రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో పరకాల–హన్మకొండ ప్రధానరోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ డివిజన్ కోసం ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలన్నారు. విజయపాల్‌రెడ్డి, వెంకటరమణ, చంద్రమౌళి, శ్రీనివాస్, పరమేశ్వర్, సుదర్శన్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. డివిజన్ ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదు : ‘ఇనుగాల’ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు కోసం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ వద్ద ఇనుగాల శనివారం 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా వచ్చి దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రెవెన్యూ డివిజన్ కోసం పోరాడడం లేదన్నారు. గతంలో ఉన్న హోదానే తిరిగి కల్పించాలని కోరుతున్నామన్నారు. భవిష్యత్‌లో మూడు జిల్లాలకు కేంద్రం కాబోతున్న పరకాలను డివిజన్‌గా ప్రకటించాలన్నారు. ఈ విషయంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిల వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుకూల ప్రకటన రాకపోతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. పుట్టగతులుండవ్ : గన్నోజు శ్రీనివాసచారి, టీడీపీ ఇన్చార్జి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయకపోతే ఎమ్మెల్యే ధర్మారెడ్డికి పుట్టగతులుండవని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గన్నోజు శ్రీనివాసచారి అన్నారు. ఇనుగాల చేపట్టిన నిరవధిక దీక్షను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షల్లో పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏపీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ గోల్కొండ సదానందం, పి.సంతోష్, రజాక్, శ్రీనివాస్, శ్రీను, రమేష్, రఘుపతి, సాంబశివుడు, సుమన్ పాల్గొన్నారు. దీక్షకు పలువురి సంఘీభావం ఇనుగాల చేపట్టిన దీక్షకు బీజేపీ నుంచి మేకల రాజవీరు, కానుగుల గోపినాథ్, ఆర్పీ జయంత్‌లాల్, సీపీఐ నుంచి దుప్పటి సాంబయ్య, సీపీఎం నుంచి నక్క చిరంజీవి, బీఎంఎస్ నుంచి జనార్ధన్‌రావు, నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసచారి, కిరాణావర్తక సం ఘం, ఫర్టిలైజర్స్ వ్యా పారులు, బట్టల వర్తక సంఘం, పా¯Œషాపు యాజమానుల సంఘం, నాÄæూబ్రాహ్మణుల సంఘం, పండ్ల వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం, నగర పంచాయతీ కార్మికులు సంఘీభావం ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
పరకాల: వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పరకాల నుంచి కామారెడ్డిపల్లి వైపు వెళ్తోన్న మోటారు సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పరకాలకు చెందిన రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూరియా నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతి
పరకాల (వరంగల్) : పంట పొలంలో యూరియా కలిసిన నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం అలియాబాద్ గ్రామ శివారులో సోమవారం వెలుగుచూసింది. పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఇది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రసాయనాలు కలిసిన నీళ్లు తాగడం వల్లే చనిపోయి ఉంటాయిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి
-
కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి
-
కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి: వైఎస్ జగన్
పరకాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో రోజు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పరకాలలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ మోజుతోనే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. ఎంపీకి మంత్రి పదవి ఇచ్చి ఉప ఎన్నిక తెచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ 18 నెలల పరిపాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు. రైతు కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 5 ఏళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టిస్తే... కేసీఆర్ 18 నెలల పాలనలో 396 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు. వరంగల్ లో టీఆర్ఎస్ గెలిస్తే తన పాలన అంతా బాగుందని కేసీఆర్ భావిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. టీడీపీ ఓటు అడిగే అధికారం లేదన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీని నిలదీయాలని సూచించారు. ఓటు అడిగే అధికారం తమ పార్టీకే ఉందని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాలి ఒక సవాలు విసిరి ఎన్నికలు జరిపి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అనేవాళ్లం కానీ ఓ ఎంపీతో రాజీనామా చేయించడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయి. మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వారికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంపీని రాజీనామా చేయించి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ పాలనలో కొచ్చిన 18 నెలల్లో ఒక్క వరంగల్ జిల్లాలోనే 158 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తిరైతుల బాధను సీఎం కేసీఆర్ ఒక్కసారైనా ఆలకించారా? పత్తి క్వింటాలుకు రూ. 4,500 మద్దతు ధర అని చెప్పి.. రూ 3,500లకు కూడా పత్తి కొనడం లేదు దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు పత్తి క్వింటాలుకు రూ. 6,500 దాకా పలికింది. కేసీఆర్ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాల భూమిని దళితులకు పంచారు? ఈ 18 నెలల పాలనలో 1600 ఎకరాలు కూడా పంచలేదు అదే వైఎస్ఆర్ హయాంలో 20లక్షల 60 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు పేదవాళ్లు ఎందుకు అప్పులపాలు అవుతారని ఎప్పుడైనా కేసీఆర్ గారు ఆలోచించారా? అనారోగ్యం, రోగాల చికిత్స కోసం వడ్డీలకు అప్పులు తేవడం వల్లే పేదవాళ్లు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు అందుకే పేదలందరినీ ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్ఆర్ 108 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. కుయ్యికుయ్యిమని అంబులెన్స్ వచ్చేలా ఏర్పాటు చూశారు. ఒక్కపైసా ఖర్చు లేకుండా పెద్దాస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ పాలనలో ఒక్క కొత్త అంబులెన్సును కూడా కొనలేదు. 8, 9 ఏళ్లుగా వాడుతున్న పాత అంబులెన్సులనే తిప్పుతున్నారు. ఈ రోజు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు మీ పాలనలో ఎందుకీ పరిస్థితి అని కేసీఆర్‌గారిని ప్రజలు ప్రశ్నించాలి చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ సంవత్సరం మొదలై ఆరు నెలలైంది. విద్యార్థులు కూడా కాలేజీలకు కూడా వెళుతున్నారు. అయినా గత సంవత్సరం ఫీజు బాకాయిలనే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఫీజులు, స్కాలర్షిప్పులు విడుదల చేయడం లేదు. ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి అని కేసీఆర్‌ను నిలదీయండి మార్కెట్‌కు ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడైనా కందిపప్పు కొన్నారా? కేసీఆర్ గారు? అని అడుగండి. కందిపప్పు ధర ఇప్పుడు రూ. 200 దాటింది. ఈనాడు నిత్యావసర వస్తువుల రేట్లని ఆకాశాన్నంటుతున్నాయి. ఎలా సరుకులు కొనాలి? వరి కనీస మద్దతు ధర కన్నా తక్కువకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటు వేసినా, వేయకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు. కానీ పొరపాటున కేసీఆర్ పార్టీ గెలిస్తే మాత్రం తమ ప్రభుత్వ పాలన బాగుందని ఆయన ప్రజలను మరింతగా పట్టించుకోకుండా వదిలేసే అవకాశం ఉంది. 18 నెలల పాలనలో అది హైదరాబాద్‌లో మాత్రమే అక్షరాల 3,090 డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రమే ప్రారంభించారు. ఇన్ని రోజుల పాలనలో మీరు కట్టించిన కొత్త ఇళ్లు ఎన్ని అని కేసీఆర్ గారు నిలదీయండి దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఈ ఉప ఎన్నికలో ఓడిపోతేనే కేసీర్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్‌ది చేతగాని పాలన కాంగ్రెస్ అంత అధ్వాన్న పార్టీ దేశంలోనే ఉంది. బతికున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడ్డారు. ఆయన బ్రతికున్నంతకాలం మంచివారిగా పేర్కొన్న కాంగ్రెస్‌కు ఆయన చనిపోగానే చెడ్డనేతగా మారారు చంద్రబాబు ప్రభుత్వం కేసీఆర్ కన్నా దారుణమైన అబద్ధాలు చెపుతున్నది చంద్రబాబు ప్రభుత్వం మోసం, దారుణం తప్ప మరేమీ కాదు రాష్ట్రాన్ని విభజన సమయంలో బీజేపీ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే నైతిక అర్హత, విలువలు గల ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా. -
జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..
-
జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమిపూజకు ముహుర్తం ఖరారైంది. జూన్ 6వ తేదీ ఉదయం 8.49 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ 144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాలను మహా పుష్కరంగా పరిగణిస్తామన్నారు. 198 ఎంట్రీలను పరిశీలించాక పుష్కరాల లోగోను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఇకపై అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో ఈ లోగోను వాడుతామని పరకాల పేర్కొన్నారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారని తెలిపారు. 3.5 కోట్లమంది గోదావరి పుష్కరాలకు హాజరవుతారని భావిస్తున్నట్లు పరకాల చెప్పారు. ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల కోసం రూ.1471 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల లోగోను ఆవిష్కరించారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న టిప్పర్
పరకాల : వరంగల్ జిల్లా పరకాల శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..స్థానిక శారదా స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ డిపో వద్ద ఆగింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులోని ముగ్గురు విద్యార్థులకు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను మరో బస్సులో పాఠశాలకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. స్తానికలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేలివెన్నులో 18న స్మార్ట్ విలేజ్ ప్రారంభం
ఈ నెల 18 వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ పథకానికి మరింత ప్రచారం కోసం 18 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతారని తెలిపారు. ఆయన యాత్రకు మద్దతుగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారివారి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పరకాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే దాతలకోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ లో పర్యటిస్తారని ప్రకటించారు. -
పరకాలలో అగ్ని ప్రమాదం
* అగ్గిపెట్టెల గోదాంలో షార్ట్ సర్క్యూట్ * రూ.4 లక్షల ఆస్తి నష్టం పరకాల : అగ్గిపెట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన పట్టణంలోని సాయినగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎర్రం కైలాసం, దొంతుల రమేష్, తణుకు నవీన్, జూలూరి బిక్షపతి, ఎర్రం రవి, ఎర్రం జగదీశ్వర్లు నాలుగేళ్ల నుంచి సాయినగర్‌కాలనీలో అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, ఇండియన్ టోబా కో కంపెనీ(ఐటీసీ)కి చెందిన సిగరెట్లను ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అందులో రూ. 14 లక్షల విలువ చేసే వస్తువులను భద్రపరిచారు. అయితే సదరు గోదాంకు వచ్చే కరెంటు తీగలు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు షార్టసర్క్యూట్ గురై ఇన్వర్టర్పై పడ్డాయి. దీంతో నిప్పురవ్వలు అగ్గిపెట్టెలపై పడి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ సంఘటనలో రూ.4లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా, అగ్గిపెట్టెల గోదాం నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతిలేనట్లు తెలిసింది. కాగా, ఉదయం పూట సంఘటన జరుగడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. నిర్వాహకులపై సీఐ సీరియస్.. జనావాసాల మధ్య అగ్గిపెట్టెల గోదాంను పెట్టడంపై పరకాల సీఐ బి. మల్లయ్య నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, గోదాంకు అసలు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా... లేదా అనే విషయంపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే గోదాంను ఇక్కడి నుంచి తరలించాలని నిర్వాహకులను హెచ్చరించారు. -
పరకాల పేదల కల నెరవే‘రే’
రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద మూడు కాలనీల ఎంపిక రూ. 5లక్షలతో అందమైన సొంతిల్లు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పరకాల :పరకాల పట్టణంలోని మురికివాడలకు మహర్దశ పట్టనుంది. స్లమ్ ఫ్రీ సిటీ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై) పథకానికి పరకాల నగర పంచాయతీలోని మూడు మురికివాడలు ఎంపికయ్యూరుు. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేలో తొమ్మిది కాలనీలను మురికివాడలు(నోటిఫైడ్ స్లమ్స్) గుర్తించినప్పటికీ అందులో మొదటి దశలో మూడు కాలనీల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మురికివాడలు లేని పట్టణాలు, నగరాలను నిర్మించే లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఎలాంటి వసతులు లేని మురికివాడల్లో ప్రజలు ఉండడానికి ఇళ్లు, రోడ్లు, మం చి నీటితోపాటు మౌళిక వసతులన్ని కల్పించడమే ఈ పథకం ముఖ్యోద్ధేశము. ఇందులో భాగం గా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ము నిసిపల్ ఏరియాస్(మెప్మా) పరిధిలో పని చేసే పట్టణ మహిళ సమాఖ్యతో ఈ ఏడాది జనవరి లో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పట్టణంలోని హరిజనవాడ(కొత్తకాలనీ), బీసీ కాలనీ, రాజీపేట ఎస్సీ కాలనీ, వడ్లవాడ, కుమ్మరివాడ, వెలుమ, గౌడవాడ, మా దారం హరిజనవాడ, గండ్రవాడ, మోరేవాడ ను మురికివాడల కింద గుర్తించారు. అంతేగాక అప్పటి మెప్మా ఏఎండీ కే. విద్యాధర్ జనవరి 23న నగర పంచాయతీని సందర్శించి స్థాని కుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు కాలనీలు ఎంపిక సర్వే, అధికారుల పర్యటన అనంతరం పట్టణంలోని మూడు కాలనీలు ఈ పథకం అమలుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ కాలనీ, సీఎస్ఐ, హరిజనవాడల్లో రే పథకం కింద గృహాలను నిర్మించడానికి ఎంపిక చేశారు. బీసీ కాలనీలో 338, సీఎస్ఐ, హరిజనవాడల్లో 380 గృహాలు నిర్మించనున్నారు. ఒక్క గృహానికి రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్ గదులు ఉండేలా నిర్మాణం చేస్తారు. ఎంపికైన ఆ మూడు కాలనీల్లో ఒకే తీరులో ఉండే గృహాలు, రోడ్లు, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. మరో రెండు మూడు నెలల్లో నిర్మాణాలను చేపట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రే పథకం ప్రారంభిస్తే పట్టణ రూపురేఖల్లో మార్పులు కన్పిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.5 లక్షలు కాగా.. ఇందులో కేంద్రం వాటా రూ.3.75 లక్షలు(75%), రాష్ట్రం వాటా రూ.75 వేలు((15%), లబ్ధిదారుడి వాటా రూ.50 వేలు(10%) ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది రే పథకం కింద మా కాలనీ ఎంపిక కావడం ఆనందంగా ఉంది. 30 ఏళ్ల నుంచి బీసీ కాలనీ అభివృద్ధికి దూరంగా ఉంది. ప్రభుత్వం రెండు వందల గజాల చొప్పున ఉచితంగా స్థలం, గృహాలు నిర్మించి ఇచ్చింది. గతంలో నిర్మించిన ఇల్లు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు రే పథకం కింద మోడల్ కాలనీ కోసం ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉంది. - అల్లె దశరథం, కౌన్సిలర్, బీసీ కాలనీ -
ఎంబీఏ చదివినా.. కులవృత్తి మానలే..
ఈత కల్లు గీస్తున్న ఈ యువకుడి పేరు బండి రమేష్. ఊరు పరకాల. అయితే ఏంటి..? అనేగా మీ అనుమానం. ఏమీ లేదు కానీ.. అతను చదువుకున్నది ఎంబీఏ మరి. పెద్ద చదువులు చదువుకున్నా కులవృత్తిపై ఉన్న మక్కువతో చెట్లు ఎక్కడం, కల్లు గీయడం నేర్చుకున్నాడు. సీజన్లో మోకు ముత్తాదు కట్టుకుని ఇలా కల్లు గీస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బీఏ జర్నలిజం చేసిన తర్వాత ఎంబీఏ పూర్తిచేశాడు. సర్కారు కొలువు దక్కకపోవడంతో కులవృత్తికి అంకితమైపోయాడు రమేష్. -
బంగారు తెలంగాణా కోసం అందరూ ఏకం కావాలి
-
మురిసిన నర్సక్కపల్లి
‘సిరికొండ’ సొంతూరులో సంబురాలు పరకాల: నిన్నమొన్నటి వరకు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకే సుపరిచితుడైన సిరికొండ మధుసూదనాచారి నేడు తెలంగాణ రాష్ట్ర తొలిస్పీకర్‌గా అత్యున్నత పదవిని అలంకరించబోతున్నారు. తమ పల్లెబిడ్డ శాసనసభాపతిగా వ్యవహరించబోతుండడంతో పరకాల మండలంలోని నర్సక్కపల్లి మురిసిపోతోంది. గ్రామస్తులు ఆనందంతో స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరం చేసుకున్నారు. చారి కుటుంబ నేపథ్యం ఇదీ.. నర్సక్కపల్లికి చెందిన సిరికొండ వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య దంపతుల ఎనిమిదిమంది సంతానంలో మధుసూదనాచారి నాలుగోవాడు. తండ్రి స్వర్ణకారుడి గా కులవృత్తి చేసుకుంటూ కు టుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ముం దుండే మధుసూదనాచారి ప్రతీ తరగతిలో ఫస్ట్ రావడంతో కొ డుకును ప్రోత్సహిస్తూ తండ్రి వెంకటనర్సయ్య ఉంగరం బహుమానంగా ఇచ్చేవారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న ‘సిరికొండ’ ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు పరకాలలో, డిగ్రీ వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో, కేయూలో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం మేనేజ్మెంట్ డిప్లొమాలో పీజీ చేసిన చారి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 1994లో తొలి విజయం 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన చారి మాజీ మంత్రి మందాడి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ చీలిక తరువాత ఎన్టీర్ టీడీపీలో చేరారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావానికి విశేష కృషి చేశారు. 2009లో భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో కొనసాగారు. రెండుసార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. కేసీఆర్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ సన్నిహితమే ఇప్పుడు ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టింది. స్పీకర్ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరకు సిరికొండ వైపే మొగ్గుచూపారు. దీంతో ఆయన ఒక్కరితోనే నామినేషన్ వేయించి ఎన్నిక లాంఛనప్రాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా నర్సక్కపల్లి బిడ్డకు అవకాశం రావడంతో గ్రామస్తులు పొంగిపోతున్నారు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నా శిష్యుడి ఎదుగుదల సంతోషంగా ఉంది ఎమ్మెల్యేగా మధు ఎన్నికైనప్పుడు దగ్గరుండి అభినందించా. 1999 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొంత బాధనిపించినా రాజకీయాల్లో రాణిస్తాడనే నమ్మకం ఉండేది. ఇంగ్లిష్‌పై పట్టున్న చారికి శాసనసభలోనే పెద్ద పదవి రావడం గొప్ప విషయం. జిల్లాలోనే ఎవరికీ ఇంతటి అరుదైన అవకాశం దక్కలేదు. చారి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. - బాసాని వీరస్వామి, రిటైర్డ ఉపాధ్యాయుడు పిలిచి మాట్లాడతాడు మధు నా కళ్లముందే పెరిగాడు. పండుగలకు మా ఊరు వచ్చినప్పుడు నన్ను పిలిచి మాట్లాడతాడు. ఆయన మాటతీరు ఎంతో బాగుం టుంది. నాయనా, బాపూ అంటూ పలకరిస్తాడు. ఇప్పుడాయన కు పెద్ద పదవి రావడం ఆనందంగా ఉంది. - కేశిరెడ్డి గోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు వచ్చేముందే ఫోన్ చేస్తాడు చిన్నప్పటి నుంచి మధు అన్నతో కలిసి బాయిలళ్ల, చెరువులళ్ల ఈత కొట్టేది. ఊళ్లో ఆటలాడుకునేది. బాగా చదువుకున్న మధన్న పట్నం పోయిండు. ఎప్పుడైనా ఊరికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఉండమని చెప్తాడు. పెద్ద పదవి వచ్చిదంటే చానా సంబురమైతంది. మా ఊరికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. - ఆముదపు రాజీరు, బాల్యస్నేహితుడు మా ఊరు రాష్ట్రానికి తెలిసింది మధన్న స్పీకర్‌గా ఎన్నికవడంతో మా గ్రామం గురించి రాష్ట్రానికి తెలి సింది. గ్రామంలో అందరికీ రాజకీయాలపై అవగాహన ఉంది. తెలంగాణ రా ష్ట్రంలో మొదటి స్పీకర్‌గా సిరికొండ రికార్డు సృష్టించారు. సభను సజావుగా నడిపించి మంచి స్పీకర్‌గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. - పాడి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు -
ఎమ్మెల్యే భిక్షపతికి దక్కని చోటు
హైదరాబాద్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే భిక్షపతికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కొండా సురేఖకు వరంగల్ ఈస్ట్ సీటును కేటాయించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారికి కేసీఆర్ ఈసారి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తొలి జాబితాలో చోటు కల్పించారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. అసెంబ్లీకి 69మంది అభ్యర్థుల తొలి జాబితాతో పాటు పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లతో పాటు మైనార్టీల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. పది జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరిస్తామన్నారు. వచ్చే అయిదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, ప్రభుత్వ ఖర్చుతో అమరవీరులకు స్థూపాలు నిర్మిస్తామని తెలిపారు. లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, ఆటో రిక్షాలపై రవాణా పన్ను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నామన్నారు. వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని, ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని, బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించారు. -
మినీ మేడారం
సరకాల : అగ్రంపహాడ్ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా అగ్రంపహాడ్(రాఘవాపురం) సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. రెండేళ్లకోసారి సంప్రదాయబద్ధంగా జాతర నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతోంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పుట్టినతావు అగ్రంపహాడ్ అని పూర్వీకులు చెప్పుకునేవారు. ఆ నమ్మకంతోనే భక్తులు మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని వెళుతూ ఇక్కడ కూడా తల్లులకు మొక్కులు సమర్పిస్తారు. ఇక్కడికి రాగానే దేవుడు పూనేది.. ప్రస్తుతం జాతర జరుగుతున్న ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శివసత్తులకు పూనకాలు వచ్చేవని పెద్దలు చెబుతారు. ‘నేను పుట్టింది ఇక్కడే.. నన్నెవరూ పట్టించుకుంటలేరు’ అంటూ పూనకంలో చెప్పేవారట. ఇక్కడ ఓ పుట్ట ఉండేదని, అక్కడ వనం(లంక చెట్టు) మొలిచిందని చెబుతున్నారు. దీంతో ఇక్కడి పెద్దలు బాగా ఆలోచించి ఇక్కడ సమ్మక్క, సారలమ్మలకు గద్దెలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతంగా ఉండేదని, సమ్మక్క, సారమ్మలు కొలువైన తర్వాత ఇక్కడ పాములు, తేళ్లు తిరిగినా తల్లుల దయతో ఎవరినీ ఏమీ చేయలేదని చెబుతున్నారు. ప్రజలను రోగాలబారి నుంచి తల్లులు కాపాడేవారని భక్తుల నమ్మకం. అప్పుడు మొలిచిన వేపచెట్టు ఇప్పటికి గద్దెలో ఉంది. కాగా, అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మలకు మట్టితో వందేళ్ల కింద గోనెల బాలయ్య, సమ్మయ్య, నర్సయ్య, గొల్లపెల్లి నరహరి గద్దెలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ముదిరాజ్‌లే పూజారులు.. అగ్రంపహాడ్ జాతరలో ప్రధాన పూజారులు ముదిరాజ్‌లు కావడం విశేషం. మేడారంలో కోయలు పూజారులు కాగా.. ఇక్కడ ముదిరాజ్‌లు. గోనెల సారంగపాణి, నర్సింహరాములు, రవీందర్, రేగుల బిక్షపతి, గోనెల లక్ష్మి, ఉడుతలబోయిన గోవర్ధన్ ముదిరాజ్‌లు. గొల్లపెల్లి సాంబశివరావు మాత్రం మున్నూరుకాపు కులస్తుడు. ఎడ్లబండ్లు ఎక్కువగా వచ్చేవి.. గతంలో అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు ఎడ్లబండ్ల పై వచ్చేవారు. ఇప్పుడు వివిధ వాహనాల్లో భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. -
వరంగల్ కోర్టుకు హాజరు కానున్న కేసీఆర్
వరంగల్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు వరంగల్ కోర్టుకు హాజరు కానున్నారు. పరకాల శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు విచారణ నిమిత్తం ఆయన నేడు కోర్టుకు రానున్నారు. 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాలు, కులాలు, మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే అభియోగాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసీఆర్ తరపున న్యాయవాది రవికుమార్ వాదించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు మడికొండకు చేరుకోనున్నారు. అనంతరం హన్మకొండలోని పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని తర్వాత కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళతారు. -
వీడిన ‘ఎర్ర జెండాల’ మిస్టరీ
పరకాల, న్యూస్‌లైన్ : దొరల వ్యవసాయ భూముల్లో ఎర్రజెండాలు పాతి, గ్రామాల్లో బ్యానర్లు కట్టిన మిస్టరీని వారం రోజుల్లో పోలీసులు చేధించారు. ఎర్రజెండాలను ఏర్పాటు చేసిన మాజీ నక్సలైట్లను శుక్రవారం అరెస్ట్ చేశారు. పరకాల డీఎస్పీ పి. సంజీవరావు కథనం ప్రకారం... మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ గతంలో గోదావరిలోయ ప్రతిఘటన గ్రూపులో, మిర్యాల రాజు ప్రతిఘటనలో, కొంగంటి రాజయ్య జనశక్తి దళంలో పనిచేశారు. ప్రస్తుతం శంకర్, రాజు ఆటో నడుపుతుండగా, రాజయ్య కూలీకి వెళుతున్నా డు. ఇదే మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పల్లెబోయిన చిరంజీ వి గతంలో న్యూడెమోక్రసీ దళంలో పని చేసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే సంపాదన వారి విలాసాలకు సరిపోవ డం లేదు. దీంతో సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని నలుగు రు మాజీలు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. భూస్వాములు, ధనవంతులతోపాటు ప్రజలను భయపెట్టి వారి నుంచి డబ్బు లు సంపాదించాలనే ఆలోచన చేశారు. ఎక్కువ మొత్తంలో డబ్బులను వసూలు చేసి కొత్త విప్లవ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 7 అర్ధరాత్రి న మండలంలోని కంఠాత్మకూర్, కౌకొం డ, ధర్మారం, నడికూడ, ముస్త్యాలపల్లి, చౌటుపర్తి, రాయపర్తి గ్రామాల్లోని బస్టాం డ్ సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాల కు, దొరల భూముల్లో ఎర్రజెండాలు, బ్యానర్లు కట్టారు. ప్రజలు, భూస్వాముల్లో భయాన్ని సృష్టించడమే లక్ష్యం గా వాటిని ఏర్పాటు చేశారు. ఈ క్రమం లో మండలంలోని నడికూడ-ధర్మారం రోడ్డులో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పై నలుగురు వ్యక్తులు తారాసపడ్డారు. పోలీసుల వాహనాన్ని చూసి పరుగెడుతుండగా వెంబడించి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపా రు. వారిని విచారించగా ఎర్రజెండాల ఘటనకు పాల్పడింది తామేనని వెల్లడించారు. ఎర్రజెండాలను పాతిన వారిని పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కరెంట్ మోటార్ల దొంగల అరెస్టు
పరకాలరూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయ బావుల కరెంట్ మోటార్లను ఎత్తుకెళుతు న్న దొంగలను పోలీసులు బుధవారం అ రెస్ట్ చేశారు. దొంగల నుంచి 3 కరెంట్ మోటార్లు, 2 బోరు మోటార్లు, 6 కరెంట్ వైరు బెండల్స్, 33 అల్యూమినియం పల కలు (330 కిలోలవి), ద్విచక్రవాహనం, 50 కిలోల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. పరకాల డీఎస్పీ సంజీవరావు కథ నం ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుం ట, హుజూరాబాద్, కమాన్‌పూర్, బేగంపే ట పరిసర ప్రాంతాలకు చెందిన జగన్నా థం సమ్మయ్య, తిరుపతి ఆంజనేయులు, పల్లంకొండ సాయిలు, రాబెల్లి రాజేష్‌కుమార్, షేక్ హమీద్‌బాబా వ్యవసాయ బా వుల వద్ద మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో రేగొం డ, పరకాల పోలీసులు రెండు బృందాలు గా ఏర్పడి వారి కోసం గాలింపు తీవ్రత రం చేశారు. పరకాల మండలం మల్లక్కపేట శివారులో జగన్నాథం సమ్మయ్య, తి రుపతి ఆంజనేయులును సీఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకోగా, రేగొండ మండల శివారులో పల్లంకొండ సాయి లు, రాబెల్లి రాజేష్‌కుమార్, షేక్ హమీద్‌బాబాను ఎస్సై పులి వెంకట్ అదుపులోకి తీసుకున్నారు. వారిపై గతంలో రేగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిరుమలగిరి, చె న్నాపురం, రామన్నగూడెం, రూపిరెడ్డిపల్లి గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కా పర్ వైరు ఎత్తుకెళ్లిన నాలుగు కేసులు, పరకాల మండలం రాయపర్తి, కంఠాత్మకూర్, ముస్త్యాలపల్లి గ్రామాల్లో వ్యవసాయ బా వుల వద్ద గల మోటార్లు, శాయంపేట, చి ట్యాలలో విద్యుత్ వైరు ఎత్తుకెళ్లిన కేసు, ప రకాల మండలంలో పోచారంలో జరిగిన చోరీ కేసులు నమోదై ఉన్నాయని తెలిపా రు. దొంగిలించిన వస్తువులను బైక్‌పై తీసుకెళ్తుండగా పక్కాసమాచారంతో వారి ని అరెస్టు చేశామని పేర్కొన్నారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి విలు వ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి దుండగులను అరెస్టు చేసిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకట్, సిబ్బందిని డీఎస్పీ సంజీవరావు అభినందించారు. -
'కెసిఆర్‌పై హత్యాయత్న ఆరోపణలు హాస్యాస్పదం'
-
తెలంగాణాలోను సమైక్యవాదులు ఉన్నారు