
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
పరకాలకు జరిగిన అన్యాయంపై నిలదీయండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
పరకాల : పోరాటాల పురిటిగడ్డ పరకాలను జిల్లాల పునర్విభజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లిన లక్ష్మణ పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో రెవెన్యూ డివిజన్ సమితి, బీజేపీ నాయకులు వేర్వేరుగా రెవెన్యూ డివిజన్ కోసం వినతి పత్రాలు అందజేశారు. పరకాలకు జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ రేపాల నర్సింహరాములు, బీజేపీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన పరకాల ప్రాంత ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమాలు చేయడం బాధగా ఉందన్నారు.
సీఎం దృష్టికి పరకాల సమస్య తీసుకెళ్తానని లక్ష్మణ్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, సాధన సమితి నాయకులు రేపాల నర్సింహరాములు, ఎడ్ల సుధాకర్, ఆడగాని జనార్దన్‌రావు, బీజేపీ నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ ఆర్‌పీ.జయంత్‌లాల్, బీజేపీ నాయకులు మేకల రాజవీర్, పల్లెబోయిన సురేష్ , కానుగుల గోపినాథ్, వంగాల సంగమేశ్వర్, జయపాల్‌రెడ్డి, కాచం గురుప్రసాద్, బీజేవైఎం నాయకులు యాట నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
కాళోజీ సెంటర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు రూరల్ జిల్లా నేతల ఘనస్వాగతం పలికారు. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాకు హైదరాబాద్ నుంచి హన్మకొండ మీదుగా వెళుతున్న సందర్భంగా రూరల్ జిల్లా అ« ద్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు.