దళితులతో కాంగ్రెస్ రాజకీయం
- ఢిల్లీలో కోవింద్‌తో భేటీ
ఈ పర్యటన సందర్భంగా తొలుత ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుస్తారని, అనంతరం ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోతామని తెలిసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపిందని అన్నారు. మీరాకుమార్‌ను రాష్ట్రపతిగా చేయాలనుకుంటే రెండు పర్యా యాలు అవకాశం ఉన్నా అప్పు డు ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓడి పోతామని తెలిసీ దళిత అభ్యర్థిని నిలిపారన్నారు. కాగా, సెప్టెంబర్ 10, 11, 12వ తేదీల్లో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తారని లక్ష్మణ్ వెల్లడించారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన.. తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభు త్వ పథకాలపై ఎక్కడా ప్రధాని మోదీ చిత్రం గానీ, కేంద్ర శాఖల బొమ్మలు గానీ లేకపోవడం దురదృష్ట కరమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఓ ప్రశ్నకు బదు లిస్తూ ‘నియోజకవర్గాల పునర్విభజనను మేం వ్యతిరేకించడం లేదు. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారితో రాజీనామా చేయించకుండా... వారిని సర్దుబాటు చేసేందుకు టీఆర్‌ఎస్ పునర్విభజన కావాలనడాన్ని తప్పుపడుతున్నాం’అని అన్నారు.