ఓటు బ్యాంకు కాపాడుకోడానికే... | Lakshman comments on Chidambaram | Sakshi
Sakshi News home page

ఓటు బ్యాంకు కాపాడుకోడానికే...

Published Sun, Feb 26 2017 2:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఓటు బ్యాంకు కాపాడుకోడానికే... - Sakshi

ఓటు బ్యాంకు కాపాడుకోడానికే...

చిదంబరం వ్యాఖ్యలపై  లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరిగి న ఓ కార్యక్ర మంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కశ్మీర్‌ను దేశం కోల్పోవచ్చునని పేర్కొనడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసిన స్థాయి వ్యక్తులు చేయాల్సిన వ్యాఖ్యలు కాదన్నారు. కశ్మీర్‌లో సాధారణ స్థితి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కశ్మీర్‌ను అస్థిరపరిచి ఓటు బ్యాంకును కాపాడుకోడానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నినట్లు అర్థం చేసుకోవాల్సి వస్తుందని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు.

కశ్మీర్‌ ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణమని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన చర్యల వల్లనే కశ్మీర్‌లో హింస తగ్గిందని చిదంబరం చెప్పడం హాస్యాస్పదమ న్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక కాంగ్రెస్‌ వైఖరా స్పష్టం చేయాలని ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement